Jump to content

నా నువ్వే

వికీపీడియా నుండి
నా నువ్వే
నా నువ్వే సినిమా పోస్టర్
దర్శకత్వంజయేంద్ర
రచనశుభ, జయేంద్ర, సూర్య
నిర్మాతమ‌హేశ్ కోనేరు, కిరణ్ ముప్పవరపు, విజయ్‌ కుమార్‌ వట్టికూటి
తారాగణంనందమూరి కళ్యాణ్‌రాం, తమన్నా
ఛాయాగ్రహణంపి.సి. శ్రీరాం
సంగీతంశరత్
నిర్మాణ
సంస్థ
కూల్ బ్రీజ్ సినిమాస్
విడుదల తేదీ
14 జూన్ 2018 (2018-06-14)
సినిమా నిడివి
125 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నా నువ్వే 2018, జూన్ 14న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] జయేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్‌రాం, తమన్నా జంటగా నటించగా శరత్ సంగీతం అందించాడు.[2][3] కూల్ బ్రీజ్ సినిమాస్ పతాకంపై మహేష్‌ ఎస్‌. కోనేరు, కిరణ్ ముప్పవరపు, విజయ్‌ కుమార్‌ వట్టికూటి నిర్మించారు.[4]

మీరా (తమన్నా భాటియా) రేడియో జాకీ, వరుణ్ (కల్యాణ్ రామ్) అమెరికాకు వెళ్లాలనుకొనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వీరిద్దరి ప్రేమకు లవ్ సైన్ అనే పుస్తకం బీజం వేస్తుంది. వరుణ్ ఫోటోను చూసిన వెంటనే అతడిని తన లక్కీగా భావిస్తుంది. తనకు తెలియకుండానే ప్రేమలో పడిపోతుంది. ఇలా తన మనసులో ఉన్న ప్రియుడి గురించి వెతుకులాట ప్రారంభిస్తుంది. వెతికే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. అమెరికాకు వెళ్లడానికి వరుణ్‌కు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. చివరికి మీరా, వరుణ్ కలుసుకొన్నారా అనేది మిగతా కథ.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: జయేంద్ర
  • నిర్మాత: మహేష్‌ ఎస్‌. కోనేరు, కిరణ్ ముప్పవరపు, విజయ్‌ కుమార్‌ వట్టికూటి
  • రచన: శుభ, జయేంద్ర, సూర్య
  • సంగీతం: శరత్
  • ఛాయాగ్రహణం: పి.సి. శ్రీరాం
  • నిర్మాణ సంస్థ: కూల్ బ్రీజ్ సినిమాస్

పాటలు

[మార్చు]

శరత్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సోని మ్యూజిక్ ఇండియా ద్వారా విడుదల అయ్యాయి.

నా నువ్వే
పాటలు by
శరత్
Releasedమే 7, 2018
Recorded2018
Genreపాటలు
Length20:36
Labelసోని మ్యూజిక్ ఇండియా
Producerశరత్
శరత్ chronology
హడియ్యా
(2017)
నా నువ్వే
(2018)
పేరోల్
(2018)
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "హేయ్ హేయ్ ఇలూ (మేల్ వర్షన్) (రచన: అనంత శ్రీరామ్)"  టిప్పు 2:27
2. "నిజమా మనసా (రచన: అనంత శ్రీరామ్)"  యాజీన్ నజీర్, ఎల్.వి. రేవంత్, ఎం.ఎం. మనస్వి 3:27
3. "రైట్ రైట్ రైట్ (రచన: రామజోగయ్య శాస్త్రి)"  టిప్పు 2:34
4. "చినికి చినికి (రచన: అనంత శ్రీరామ్)"  సప్తపర్ణ చక్రవర్తి, కార్తీక్ 3:06
5. "ప్రేమిక (రచన: అనంత శ్రీరామ్)"  శరత్ 2:53
6. "నా నువ్వే (రచన: రామజోగయ్య శాస్త్రి)"  ప్రియా మాలి 3:42
7. "హేయ్ హేయ్ ఇలూ (ఫిమేల్ వర్షన్) (రచన: అనంత శ్రీరామ్)"  రీటా 2:27
20:36

విడుదల - స్పందన

[మార్చు]

2018, జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల అయింది. ఇది 2109లో దిల్జాల ఆషిక్ అనే పేరుతో హిందీలోకి అనువాదంచేసి గుడ్ మైన్స్ టెలీఫిలిమ్స్ వారి ద్వారా యూట్యూబ్ లోకి విడుదల చేయబడింది.[5]

రేటింగ్

[మార్చు]
  1. టైమ్స్ ఆఫ్ ఇండియా – 2/5[6]
  2. 123 తెలుగు - 2.75/5[7]
  3. గ్రేట్ ఆంధ్ర - 2/5[8]

మూలాలు

[మార్చు]
  1. "It's a wrap up for Nandamuri Kalyanram's 'Naa Nuvve'". Times Of India. 9 April 2018. Retrieved 13 November 2019.
  2. "Tamannaah and Nandamuri Kalyan Rams Naa Nuvve first glimpse promises a breezy love story". India Today. 8 January 2018. Retrieved 13 November 2019.
  3. "Not Aishwarya Lekshmi, Tamannaah Bhatia to star in Kalyan Ram's next". Deccan Chronicle. 27 August 2017. Archived from the original on 28 August 2017. Retrieved 13 November 2019.
  4. ""Naa Nuvve" Song Promo on April 18th". The Hans India. 16 April 2018. Retrieved 13 November 2019.
  5. "Diljala Aashiq (Naa Nuvve) 2019 Hindi Dubbed Trailer – Nandamuri Kalyan Ram, Tamannaah Bhatia". YouTube.
  6. "Naa Nuvve Movie Review". The Times of India.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-11-17. Retrieved 2019-11-17.
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-07-07. Retrieved 2019-11-17.

ఇతర లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నా_నువ్వే&oldid=4293924" నుండి వెలికితీశారు