ప్రియదర్శి పులికొండ
ప్రియదర్శి పులికొండ | |
---|---|
జననం | హైదరాబాదు | 1989 ఆగస్టు 26
విద్య | మాస్ కమ్యూనికేషన్స్ లో ఎం. ఎ |
విద్యాసంస్థ | హైదరాబాదు విశ్వవిద్యాలయం |
వృత్తి | నటుడు |
జీవిత భాగస్వామి | రిచా శర్మ [1] |
తల్లిదండ్రులు |
|
ప్రియదర్శి పులికొండ ఒక తెలుగు సినీ నటుడు.[2] 2016 లో వచ్చిన పెళ్ళి చూపులు చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చాడు.[3] అర్జున్ రెడ్డి, మల్లేశం, జాతిరత్నాలు, బలగం ప్రియదర్శి నటించిన ప్రజాదరణ పొందిన చిత్రాలు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ప్రియదర్శి హైదరాబాదులో జన్మించాడు. తండ్రి పులికొండ సుబ్బాచారి ప్రొఫెసర్, జానపద సాహిత్య రంగంలో పేరు పొందిన పరిశోధకుడు. ఉస్మానియా, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, ద్రావిడ విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయాలలో పనిచేశాడు. ప్రాచీన సాహిత్యం ఆధునిక సాహిత్యాలపైన కూడా పరిశోధన విమర్శ చేశారు. తెలంగాణ జీవిత నేపథ్యంలో రెండు నవలలు రాశారు. మాదిగ కొలుపు, రేవు తిరగబడితే అనే ఈ నవలలు పేరు తెచ్చాయి. కవిగా మూడు కవితా సంపుటాలు ప్రచురించాడు. ఐదు దేశాలకు ఆహ్వానం పైన వెళ్ళి పరిశోధన పత్రాలు చదివాడు. తల్లి జయలక్ష్మి పది సంవత్సరాల పాటు ఉపాధ్యాయురాలుగా పనిచేసి తర్వాత వాలంటరీ రిటైర్‌మెంటు తీసుకోని ప్రస్తుతం గృహిణిగా అన్ని వ్యవహరాలు నిర్వహిస్తున్నారు. ఆమె డిటిపి పనిలో కూడా నిష్ణాతురాలు. .[4] ప్రియదర్శి హైదరాబాదు విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్స్ లో పి. జి. చేశాడు. చిన్నప్పుడు సంతోష్ నగర్ దగ్గరలోని హైదరాబాదు సైనిక్ స్కూల్ లో చదువుకున్నాడు. తర్వాత హెసియూ కాంపస్ స్కూల్, విజ్ఞాన్, స్కూల్, డిగ్రీ MNR కాలేజి తర్వాత ఎం.ఏ హెచ్‌సీయూలో చేశాడు. ఇతనికి చిన్నతనం నుంచి సినిమాల మీద ఆసక్తి ఉంది. ప్రియదర్శి తాతగారు పులికొండ పిచ్చయాచారిగారు ఆకాలంలో పద్యనాటకాలలో వివిధ పాత్రలు పోషించాడు రజాకార్ వ్యతిరేక ఉద్యమం జరిగే రోజుల్లో అప్పుడు పనిచేసిన నాటక దళంలో పనిచేసి వందల నాటక ప్రదర్శనలు చేశాడు. ప్రియదర్శికి ఆయన సొంత ఊరి ఖమ్మంజిల్లా మధిర మండలం మర్లపాడు గ్రామం అన్నా చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం తప్పక వెళ్ళి వస్తుంటాడు.
ప్రియదర్శి చెల్లెలు నావికాదళంలో లెఫ్టినెంట్ కమాండర్. ప్రియదర్శి భార్య రిచా నవలా రచయిత్రి. ఈమె స్వస్థలం ఆగ్రా సమీపంలో బృందావనం.[5]
సినీ జీవితం
[మార్చు]ఇతను 2016 లో టెర్రర్ అనే సినిమాలో టెర్రరిస్టుగా నటించాడు. అదే సంవత్సరంలో వచ్చిన పెళ్ళి చూపులు సినిమాలో హీరో స్నేహితుడు కౌశిక్ పాత్రలో అందరి దృష్టిలో పడ్డాడు. తెలంగాణా యాసలో ఇతను పలికిన సంభాషణలు విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. మధ్యలో కొన్ని లఘు చిత్రాలలో కూడా కనిపిస్తూ వచ్చాడు. జూనియర్ ఎన్. టి. ఆర్ కథానాయకుడుగా వచ్చిన జై లవకుశ, మహేష్ బాబు కథానాయకుడిగా వచ్చిన స్పైడర్ సినిమాలో కూడా నటించాడు.[6] ఆసుయంత్రాన్ని సృష్టించిన చింతకింది మల్లేశం జీవిత చిత్రం మల్లేశం సినిమాలో కథానాయకుడిగా నటించాడు. 2023 లో విడుదలైన బలగం, మంగళవారం చిత్రాలలో ముఖ్యమైన పాత్రలు పోషించాడు.
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చలన చిత్రం | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2016 | టెర్రర్ | తీవ్రవాది | |
పెళ్ళి చూపులు[7] | కౌషిక్ | ||
బొమ్మల రామారం | రామన్న | ||
2017 | ఘాజీ | నీలేష్ మిష్రా | హిందీ-తెలుగు ద్విభాషా చిత్రం |
విన్నర్ | |||
అర్జున్ రెడ్డి | న్యాయవాది | ||
కేశవ | |||
మిస్టర్ | వైద్యుడు | ||
బాబు బాగా బిజీ | |||
దర్శకుడు | |||
టేక్ ఆఫ్ | ఇరాక్‌లో ఉన్న భారతీయుడు | మళయాళం | |
యుద్ధం శరణం | |||
జై లవకుశ | ఓబులేష్ 'ఓబ్స్' | ||
స్పైడర్ | మధు | తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం | |
ఉన్నది ఒకటే జిందగీ | సతీష్ | ||
మిడిల్ క్లాస్ అబ్బాయి | దర్శి | ||
ఇది మా ప్రేమకథ | |||
2018 | రంగుల రాట్నం | ||
ఎగిసే తారాజువ్వలు | సోమరాజు | ||
కణం | సబ్ ఇన్‌స్పెక్టర్ అగ్ని | ||
తొలి ప్రేమ | రవి | ||
మనసుకు నచ్చింది | |||
నల | |||
నేల టిక్కెట్టు | లయర్ యాదగిరి | ||
వైఫ్ ఆఫ్ రామ్ | చారి(పోలీసు) | ||
నోటా 2018 | వాంగ్ | ||
F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్ | |||
అ! | నల భీమ | ||
నా నువ్వే | |||
2019 | మిస్టర్ మజ్ను | ||
రామ చక్కని సీత | |||
2020 | వరల్డ్ ఫేమస్ లవర్ | ||
గువ్వ గోరింక | |||
బొంభాట్ | |||
2021 | నాంది | ||
2021 | జాతి రత్నాలు | ||
2021 | ఇచ్చట వాహనములు నిలుపరాదు | ||
2023 | బలగం | సాయిలు | |
మంగళవారం | రవి | ||
హాయ్ నాన్న | జస్టిన్ | [8] | |
2024 | తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి | ||
ఓం భీమ్ బుష్ | |||
డార్లింగ్ | రాఘవ | ||
35 చిన్న కథ కాదు | |||
సారంగపాణి జాతకం |
టీవీరంగం
[మార్చు]సంవత్సరం | సిరీస్ | పాత్రపేరు | ఛానల్ పేరు | భాష | మూలాలు |
---|---|---|---|---|---|
2020 | మెయిల్ | హైబత్ | ఆహా | తెలుగు | |
2020 | లూజర్ | సూరి యాదవ్ | జీ5 | తెలుగు | |
2021 | ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ | మీనా | ఆహా | తెలుగు | |
2022 | లూజర్ 2 | సూరి యాదవ్ | జీ5 | తెలుగు | |
2023 | సేవ్ ద టైగర్స్ |
పురస్కారాలు
[మార్చు]- 2016: సైమా ఉత్తమ హాస్యనటుడు - పెళ్ళి చూపులు
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (9 June 2021). "నటుడు ప్రియదర్శి భార్య ఎవరో తెలుసా ?ఆమె ప్రొఫెషన్ ఏంటంటే." Sakshi. Archived from the original on 21 June 2021. Retrieved 21 June 2021.
- ↑ "ఆ పేరుతోనే పుస్తకం రాస్తా." eenadu.net. ఈనాడు. 11 June 2018. Archived from the original on 11 June 2018. Retrieved 11 June 2018.
- ↑ "Pelli Choopulu film website". Archived from the original on 2017-08-27. Retrieved 2018-02-04.
- ↑ "KTR releases song penned by Priyadarshi's father - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-10-29.
- ↑ "నా జీవితంలో 'ఛీ' అనుకునే సంఘటన అది". www.eenadu.net. Retrieved 2020-09-10.
- ↑ EENADU (19 June 2021). "ఈ సీరియస్ పాత్ర సవాలు విసిరింది: ప్రియదర్శి - actor priyadarshi interview about his role in in the name of god web series". Archived from the original on 25 July 2021. Retrieved 25 July 2021.
- ↑ "Meet Priyadarshi Tollywood town's new funny man". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 22 February 2018.
- ↑ https://www.thehindu.com/entertainment/movies/nani-interview-on-hi-nanna-directed-by-shouryuv-and-starring-mrunal-thakur-child-actor-kiara-and-shruti-haasan/article67597377.ece