Jump to content

రామ చక్కని సీత

వికీపీడియా నుండి
రామ చక్కని సీత
(2019 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం శ్రీహర్ష మండ
నిర్మాణం విశాలక్ష్మి మండ,
జి.ఎల్ ఫణికాంత్
రచన శ్రీహర్ష మండ
తారాగణం
సంగీతం కేశవ కిరణ్
ఛాయాగ్రహణం మురుగన్ గోపాల్
కూర్పు గ్యారీ బిహెచ్
విడుదల తేదీ 27 సెప్టెంబరు 2019
నిడివి 126 నిముషాలు
దేశం భారతదేశం
భాష తెలుగు
నిర్మాణ_సంస్థ క్రొకోడైల్ క్రియేషన్స్, లియో సెల్యులాయిడ్స్

ఇంద్ర, సుకృత వాగ్లే జంటగా శ్రీహర్ష మండ తెరకెక్కించిన చిత్రం రామ చక్కని సీత. ఇంద్ర ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. మహాకవి వాల్మీకి రాసుకున్న రామాయణం నిజం అయితే తన కథ కూడా నిజమే అంటున్నాడు దర్శకుడు శ్రీ హర్ష మండ. క్రొకోడైల్ క్రియేషన్స్, లియో సెల్యులాయిడ్స్ బ్యానర్స్ పై విశాలక్ష్మి మండ, జి.ఎల్ ఫణికాంత్ సంయుక్తంగా నిర్మించారు.[1] ఈ సినిమా 2019, సెప్టెంబరు 27న థియేటర్లలో విడుదలయ్యింది.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • రచన-దర్శకత్వం: శ్రీహర్ష మండ
  • నిర్మాతలు:విశాలక్ష్మి మండ, జి.ఎల్ ఫణికాంత్
  • సంగీతం: కేశవ కిరణ్
  • ఛాయాగ్రహణం: మురుగన్ గోపాల్
  • కూర్పు : గారి బి.హెచ్.
  • కళ: నాగేంద్ర
  • స్టంట్స్: రియల్ సతీష్
  • నృత్యాలు: సన్నీ
  • పాటలు : చైతన్య ప్రసాద్, సాగర్, శ్రీహర్ష మండ

బాలు (ఇంద్ర) జీవితాన్ని చాలా లైట్ గా తీసుకునే హ్యాపీ గోయింగ్ కుర్రాడు. తొలిచూపులోనే అను (సుకృత వాగ్లే) ను చూసి ప్రేమలో పడిపోతాడు. తనను లైన్లో పెట్టడం కోసం సిద్ధు అనే పేరుతో ఫోన్ లో పరిచయమవుతాడు. అంతా సజావుగా సాగుతోందన్న సమయంలో బాలు చేసింది తనకు తెలుస్తుంది. తనని బాలు మోసం చేసాడని భావించిన అను అతణ్ణి దూరం పెడుతుంది. మనస్పర్థల కారణంగా దూరమైన ఈ జంట చివరికి ఎలా ఒక్కటయ్యారు అనేది మిగిలిన కథ.[2]

మూలాలు

[మార్చు]
  1. web master. "రామ చక్కని సీత ఫస్ట్ లుక్." TS News. tsnews.tv. Archived from the original on 24 జూన్ 2021. Retrieved 20 June 2021.
  2. Murali Ravi. "రామ చక్కని సీత మూవీ రివ్యూ". టాలీవుడ్.నెట్. Retrieved 20 June 2021.[permanent dead link]

బయటిలింకులు

[మార్చు]