Jump to content

చింతకింది మల్లేశం

వికీపీడియా నుండి
చింతకింది మల్లేశం
చింతకింది మల్లేశం
జననం
వృత్తిచేనేత కార్మికుడు, ఆవిష్కర్త
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఆసు యంత్రం సృష్టికర్త
తల్లిదండ్రులు
  • లక్ష్మీ (తల్లి)

చింతకింది మల్లేశం చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత.[1] ఈయన చేనేత కార్మికులకు శ్రమ తగ్గించేందుకు గాను ఆసు యంత్రాన్ని కనుక్కున్నాడు. 2019లో ఈయన జీవితం ఆధారంగా మల్లేశం అనే సినిమా వచ్చింది.

జననం

[మార్చు]

తెలంగాణ రాష్ట్రం లోని యదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజీపేటలో జన్మించారు.

చదువు - వృత్తి

[మార్చు]

ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ చదువు 6వ తరగతిలోనే ఆపేశాడు. చేనేత వృత్తిలో ఆధారపడిన తల్లి లక్ష్మీకి చేదోడు వాదోడుగా ఉండేవాడు.[2] ప్రైవేటుగా 7వ తరగతి చదివి, 10వ తరగతి కూడా పాసయ్యాడు.[3]

గుర్తింపు

[మార్చు]

చేనేతకు సంబంధించిన ఆసు యంత్రాన్ని కనుగొన్నందుకు పద్మశ్రీ ఈయన ఈ అవార్డును అందుకున్నారు.


ఆసు యంత్రం తయారి

[మార్చు]
మల్లేశం ఆవిష్కరించిన ASU యంత్రం.

చింతకింది మల్లేశంది నిరుపేద చేనేత కుటుంబం. అమ్మచీరలు నేస్తుంది. ఒక చీరకు ఆసు పోయడానికి దారాన్ని పిన్నుల చుట్టు 9వేల సార్లు అటూ ఇటూ తిప్పాలి. ఇలా రోజుకి 18వేల సార్లు దారాన్ని కండెల చుట్టూ తిప్పితే గాని (25 కి.మీ) రెండు చీరలు తయారుకావు. దారాన్ని కండెల చుట్టూ తిప్పుతుంటే మల్లేషం తల్లి చేతులు లాగుతూ ఉండేవి. అమ్మ భుజం నొప్పితో రోజంతా బాధపడుతుంటే అమ్మ కష్టం గట్టేక్కేదెలా ఏదో ఒకటిచేయాలనుకున్నాడు. తనకొచ్చిన ఆలోచనను ఇరుగుపొరుగుతో పంచుకున్నాడు. వాళ్లు నిరుత్సాహపరచినా తన ఆశయం నెరవేర్చకోవడంకోసం హైదరాబాద్ వచ్చాడు. పార్ట్‌ టైమ్ జాబ్ చేస్తూ ఆసు యంత్రాన్ని పార్టులు పార్టులుగా తయారుచేశాడు. మొత్తం యంత్రం తయారుచేయడానికి ఏడేళ్లు పట్టింది.

ఆసియాలో గొప్ప యంత్రంగా ప్రశంస

[మార్చు]

అమ్మ పేరుమీదనే 2000ల సంవత్సరంలో లక్ష్మీ ఆసు యత్రం కనిపెట్టాడు. 2011 సంవత్సరంలో ఈ యంత్రానికి పేటెంట్ హక్కులు వచ్చాయి. అదే సంవత్సరం చివరలో ఫోర్బ్స్ జాబితాలో మల్లేశం పేరు చోటు చేసుకుంది. 2011లో ఆసు యంత్రానికి సాఫ్ట్ వేర్ జత చేస్తామని అమెరికా ముందుకు వచ్చింది.[4] ఆసు యంత్రం ఆసియాలో ది బెస్ట్ అని అమెరికాకు చెందిన పాట్ లాబ్స్ ప్రశంసించింది. అదే ఏడాది ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్తగా రాష్టప్రతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ. "చింతకింది మల్లేశంకు పద్మశ్రీ". Archived from the original on 26 జనవరి 2017. Retrieved 26 January 2017.
  2. దరువు. "తెలంగాణ నేతన్న మల్లేశంకు పద్మశ్రీ పురస్కారం....!". www.dharuvu.com. Archived from the original on 26 జనవరి 2017. Retrieved 26 January 2017.
  3. పల్లె సృజన. "Innovations AP / Sri Chintakindi Mallesham". www.pallesrujana.org. Archived from the original on 21 మార్చి 2017. Retrieved 26 January 2017.
  4. తెలుగు యువర్ స్టోరి. "చేనేతల వెతలు తీర్చిన మల్లేశంకు ఘనమైన గౌరవం". telugu.yourstory.com. Retrieved 26 January 2017.[permanent dead link]
  5. ఆంధ్రభూమి, మెయిన్ ఫీచర్. "అమ్మకోసం ఓ అద్భుత యంత్రం". Archived from the original on 21 మే 2017. Retrieved 26 January 2017.