ఆలేరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

Sreeramoju haragopal (చర్చ) 12:56, 17 జూలై 2015 (UTC)

ఆలేరు
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో ఆలేరు మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో ఆలేరు మండలం యొక్క స్థానము
ఆలేరు is located in Telangana
ఆలేరు
తెలంగాణ పటములో ఆలేరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°39′N 79°03′E / 17.65°N 79.05°E / 17.65; 79.05
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రము ఆలేరు
గ్రామాలు 14
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 47,365
 - పురుషులు 23,599
 - స్త్రీలు 23,766
అక్షరాస్యత (2011)
 - మొత్తం 64.52%
 - పురుషులు 76.86%
 - స్త్రీలు 52.22%
పిన్ కోడ్ {{{pincode}}}
Nameboard at Aler Railway Station.jpg

ఆలేరు, తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆలేటికథః మావూరు ఆలేరు. నల్లగొండ జిల్లా. మావూరు ఒక నదీలోయ నాగరికత నింపుకున్న పల్లె దీవి. ఎక్కడ తడిమినా ఊటలూరే చారిత్రక సంపదలు, నీటిచెలిమలు. లెక్కకు మిక్కిలి కాలువలు. వూరు చుట్టూ వాగుల వడ్డాణం. చిన్నప్పుడు మా తాత ఈ వూరిలో పెద్దపులులనే తరిమేటన్ని ఆవుల మందలుండేవని అందువల్లే ఆవులున్న ఈ వూరు ఆవులూరు లేదా ఆవులేరు గా, రాను రాను ఆలేరుగా పిలువబడ్డదని చెప్పేవాడు. కాదు ఆరు ఏరులు పారే ఊరే ఆలేరుగా పేరుపొందిందని ఒక వాదం. దానికి బలం ఏమిటంటే ఒకరాజు(?) రంగనాయకుని విగ్రహాన్ని తనరాజ్యానికి తీసుకపోతున్నపుడు విగ్రహమున్న బండి ఇక్కడి నదిపాయలో దిగబడిపోయి కదలలేదట. అపుడు రంగనాయక దేవుడే రాజుకు కలలో కనిపించి ‘శ్రీరంగపట్నంలో సప్తకావేరులున్నట్టు ఇక్కడ ఏడుపాయలు ప్రవహిస్తున్నందున ఇక్కడే తనవిగ్రహాన్ని ప్రతిష్టించి దేవాలయం నిర్మించమన్నా’డట. ఈ కథను రంగనాయకుని గుడి పూజారి కీ.శే. కొండమయ్యగారి భార్య చెప్పారు.అందువల్ల ఆలేరులో ఆరేడు ప్రవాహాలుండడం వల్ల ఏరుల వూరు ఆలేరు అయింది కావచ్చు. భౌగోళికంగా ఆలేరు 17.65 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 79.05 డిగ్రీల తూర్పు రేఖాంశాలపై ఉన్నది., సముద్రమట్టానికి 361 అడుగుల ఎత్తున వుంది. మావూరు నుండి 202 జాతీయరహదారి వెళుతున్నది.మా వూరు చుట్టు వున్న వూర్లన్ని ఎత్తుమీదున్నవే. చిన్న చిన్న రాతిబోళ్ళు. 30,40 అడుగుల నుండి 100 అడుగుల ( గొలనుకొండగుట్ట ) గుట్టలు చుట్టూరా విస్తరించి వున్నాయి. నిజానికి మావూరిది నల్లరేగడి నేల.ఒకప్పుడు వూరి పైనుండి పారిన వాగుల వరదల్లో మట్టిపొరలు కొట్టుకుపోయి వూరిలోని ఈశాన్యప్రాంతమంత చౌడుభూములున్నాయి. కాలువ గట్టుపొలాలు ఇసికపాలెక్కువున్న పొలాలు, వూరికి నైరుతిదిక్కున నల్లరేగడి చెలకలున్నాయి. ఆలేరువాగుకు తూర్పున ఎర్రనేలలున్నాయి. దిగువమానేరు రిజర్వాయరు(కరీంనగర్) నుండి మొదలైన వాగొకటి రామెంచ దగ్గర చీలి రెండు దిక్కులకు వెళ్ళింది. ఒకటి వర్కోల్ వైపు, మరొకటి రామెంచ వైపు. ఒకపాయ వర్కోల్ నుండి కోహెడ (మ్రోయు తుమ్మెదవాగు ), శనిగరం చెరువు, బసవాపూర్, నంగునూరు, ధూళిమిట్ట, బైరాంపల్లి, ఆకునూరు ( దాటినంక మరొకపాయ ), చేర్యాల, బచ్చన్నపేట, కొలిపాక నుండి ఆలేరు....... ఇంకొకపాయ దొమ్మాట,గజ్వెల్, జగదేవపూర్, గంధమల్ల, రేణికుంట, కొలిపాక నుండి ఆలేరు చేరుతుంది. ఆవాగు ఆలేరుకు ఉత్తరాన వున్న కొలిపాక ఈవలి నుంచి ఈశాన్యాన మలుపు తిరిగి బచ్చన్నపేట నుండొచ్చిన వాగును కలుపుకుని ఆలేరు వాగయింది. ఆలేరు పేరు మీదనే ఆలేరువాగు కాపేరొచ్చింది.మేం పెద్దవాగనే పిలుస్తుంటాం. మా వాగు ఆలేరువాగుకు భిక్కేరు అనే మరో పేరుంది. బౌద్ధభిక్షువులు ఈ వాగు వెంటనే పయనించారని, విహారాలు నిర్మించారని వాగొడ్డున అక్కడక్కడ బయటపడుతున్న బౌద్ధం ఆనవాళ్ళు సాక్ష్యమిస్తున్నాయి.భిక్కేరొడ్డున చాడ (ఆత్మకూరు మండలం) లో ఇటీవల బౌద్ధస్తూపం అవశేషాలు, బుద్ధుని విగ్రహం లభించాయి. ఈ వాగు వెంట ఒక్క బౌద్ధమే కాదు, జైనం కూడా విశేషంగా వ్యాప్తిచెందింది. సుత్తపిటకంలో శ్రమణకుల మార్గం ఆలేరుగుండానే సాగిందని రాసున్నదని మా చారిత్రక మార్గదర్శి విరువంటిగోపాలకృష్ణ గారన్నారు. ఆలేరువాగు ఒకప్పుడు ఆలేరుకు దాదాపు 3కి.మీ.ల పైనుండి ప్రవహించి వుంటుందని నా అభిప్రాయం. ప్రస్తుతమున్న గ్రామానికి 3 కి.మీ. దూరంలో (రఘునాథపురం..రాజపేట దారిలో) బొబ్బిలిమడుగు దగ్గర గొల్లోనిమాన్యంలో ‘ఉల్లి’ పాటిగడ్డ అని పిలిచే పాతవూరు శిథిలాలున్నాయి. అక్కడ వ్యవసాయం చేస్తున్నవారికి మధ్యశిలాయుగపు, నవీనశిలాయుగపు గొడ్డళ్ళు, సుత్తెలు వంటి రాతిపనిముట్లు, మట్టిపూసలు పెద్దసైజు (14.9 అం.)కొలతల ఇటుకలు, మందపాటి పెంకలు దొరుకుతున్నాయి. అక్కడ ప్రస్తుతం పారుతున్న వరదకాలువలతో ఏర్పడ్డ గొల్లోనిఒర్రె( గొల్లోనిమాన్యంలో పారుతున్నందున పొందిన పేరు) ఈవల దక్షిణదిశకు ఒడ్డున రోళ్ళు కనిపిస్తున్నాయి. రెండు, మూడడుగుల లోతులో ఇంఢ్లనిర్మాణం చేసిన జాడలు కనిపిస్తున్నాయి. అవతలిఒడ్డున ఏముకుంట(నేమికుంట?) దగ్గర రోళ్ళగడ్డ అని పిలువబడేచోట కూడా రోళ్ళు,శిలాయుగపు రాతిపనిముట్లు దొరుకుతున్నాయి. కొలనుపాకకు నైరుతి దిక్కున అక్కడ నుండి పారుతున్న ఆలేరు వాగుకు వరదలొచ్చినపుడు వాగు చీది పల్లానికి జారి ఇపుడున్న గుండ్లగూడెం గట్టుకు తట్టుకుని నిలిచి సాగిపోయింది. వాగుతో పాటు వూరు ఇపుడున్నచోటికి తరలివచ్చింది. నిదర్శనంగా వూళ్ళో మూడు ఆంజనేయుళ్ళున్నారు. గాఁవ్ జలే హనుమాన్ బాహర్ అనే జనోక్తి ప్రకారం ఆలేరు కనీసం 3 చోట్లకు మారిందని అర్థం. అంతేకాదు వూరిలో ఎక్కడ త్రవ్వినా అడుగున ఎక్కువగా ఇసుకపొరలు బయటపడుతుంటాయి. ఆలేరుకు పడమట ఇంకా రెండు వాగులు( వరదప్రవాహాలు) ఒకటిః గొల్లోనిఒర్రె. దీనికే రత్నాలవాగు అని పేరున్నది. కాని మా విరువంటిగోపాలకృష్ణ సార్ అది రత్నాలవాగు కాదు రాటనాలవాగంటాడు. నిలువురాతిస్తంభాల గాడుల్లో పొందించిన గడకర్రలతో నీళ్ళు తోడే నీటియంత్రాలను రాటనాలంటారు. అట్లాంటి రాతిస్తంభాలు మాకు కొలనుపాక గొల్లమఠం ముందర,మాసాయిపేట గుమ్మటాల దగ్గర కనిపించాయి. రెండవ వాగుః ఈదులవాగు. ఇది చాలా చిన్నవాగు. రత్నాలవాగుకు పైన 1 కి.మీ దూరంలో ప్రవహించే వాగు. ఈ రెండు వాగులు వర్షాధారమైనవే. ఇంకా వూరికి ఉత్తరాన ఒకప్పటి పెద్దవాగు(ఆలేరువాగు) ప్రవాహమార్గంలో ఊటపర్రెలు పదిదాకా ఏర్పడివున్నాయి. 1.ఏముకుంటపర్రె (వూరికి వాయవ్యాన 3కి.మీ. దూరంలో ఏముకుంట దగ్గర) 2.ఒంటిపర్రె (వూరికి వాయవ్యాన 2కి.మీ. దూరంలో బైరకుంట దగ్గర) 3.రామసముద్రం పర్రె 4.రెడ్డిపర్రె 5.ఇటుకరాళ్ళపర్రె 6.ముడిగెల పర్రె 7.కొలిపాకపర్రె 8.తుంగ చంద్రమ్మపర్రె 9.లచ్చిందేవి పర్రె 10.లొట్లపర్రె ఇవి ఒకప్పటి ఆలేరువాగు మార్గంలో భూగర్భజలాల నిల్వలు. మా చిన్నపుడు చేయిపెట్టి తోడితే చాలు పర్రెలో నీటిజలలు పొంగుకొని వచ్చేవి. ఈ పర్రెల ఆధారంగానే నాకీ అభిప్రాయం కలిగింది. పర్రెలన్ని మావూరి నిండా పంటకాలువలై, తాగునీటి కాలవలై మాకు నీటికరువు లేకుండా చేసాయి. బావుల్లో 4,5 చేదలకే నీళ్ళందేవి.ఈ పర్రెలనుండే 1.రామసముద్రం కాలువ 2.రెడ్డికాలువ 3.పర్రెకాలువ 4.పెద్దకాలువ 5.కొత్తకాలువ 6.శాయిగూడెం కాలువ 7.మైలోని కాలువ 8.చంద్రమ్మ కాలువ 9.సోమరాజుబాయి కాలువలొచ్చాయి. ఇవిగాక మాకు వర్షపునీటిని నిలువచేసుకునే కుంటలు 1.ఏముకుంట 2.బైరకుంట 3.చింతకుంట 4.పోచమ్మకుంట 5.కొచ్చెరువు వుండేవి. ఇపుడు మావూరి పర్రెలు, కాలువల ఆనవాళ్ళు కొన్ని వున్నాయి. కొన్ని కనిపించకుండా పోయాయి. కుంటల్లో ఏముకుంట, బైరకుంటలే బతికి వున్నాయి. ఏముకుంట నేమికుంటనా?కావొచ్చు. మా అమ్మ చిన్నపుడు చెప్పిన కథ నిజమే అయితే ఈ కుంట నేమికుంట కావచ్చు. ఏముకుంట ప్రాంతంలో గిన్నెదేవర బంగారుగుడి వుండేదట. దాన్నిసుదర్శనచక్రం వంటిది కాపాడుతుండేదట. ఒక మాంత్రికుడు (కాలాముఖశైవులా?) ఛండాల(వామాచార, కౌలాచార) పూజలతో గుడిని అపవిత్రం చేసి బంగారం దోచుకుని గుడిని తగులపెట్టాడట. అపుడు కొందరు గుడిలోని వజ్రాల విగ్రహాలను తీసుకుని మాయావి మంత్రాలకందకుండా ఏరు (మంత్ర ప్రభావం ఏరు దాటదట) దాటించి దాచిపెట్టారట. చోళులదాడిలో కొలనుపాకను తగులబెట్టించినట్టు చరిత్ర చెపుతున్నది. వెయ్యేండ్ల కింద జరిగిన సంఘటనే కథగా మారిందేమొ. జైనదేవాలయాలను పడగొట్టించి హిందూదేవాలయాలుగా మార్చి కట్టుకొన్నవెన్నో సంఘటనలు చరిత్రలో వున్నాయి. కొలనుపాకలోని జైనదేవాలయం చెప్పుకుంటున్నట్టుగా క్రీ.శ. 4వ శతాబ్దిదేం కాదు.ఆ ఆలయం గోడల్లోనే జైనశాసనస్తంభాలు లభించాయి. ఎవరుకూడా శాసనాలను అట్లా గోడల్లోపెట్టి కట్టరు. ఒక్క జైనాలయంలోనే కాదు, కొలనుపాకలోని కులమఠాల గోడల్లో, కప్పుల్లో, వీరనారాయణుని గుడి కప్పులో ప్రాకారపు గోడల్లో జైనశాసనాలెన్నో అగుపిస్తున్నాయి.అంటే మతద్వేషంతో జైనాలయాల్ని, బసదుల్ని కూల్చి అవే రాళ్ళను వాడుకున్నారనిపిస్తుంది. బహుశః ఏముకుంట ప్రాంతంలోని గిన్నెదేవర (జినదేవుడి) గుడి యుద్దంలో తగులబడినపుడు లేదా కూల్చబడినపుడు మూలవిరాట్టులను కొలనుపాకకు తరలించి వుంటారేమో. ఆలేరు చరిత్రః రెడ్డి కాలువ ఒడ్డున ఆలేరు శాసనం బయల్పడింది. ఆలేరు గురించి సైదాపురం (క్రీ.శ.1034 జూన్ ) శాసనంలో ఆలేరు-40, ఆలేరుకంపణంగా పేర్కొనబడింది.కొలనుపాకను పాలించిన పారమార జగద్దేవుడు తన (రాజరక్షకుడు) సవదొరె (పిదపకాలంలో చౌదరిగా మారిన పిలుపు) సోమయ నాయకునికి ఆలేరుని ఇచ్చాడుట. ఆలేరు అప్పటి పాలనాకేంద్రంగాను, రెవెన్యూ కేంద్రంగా వుండేదని తెలుస్తున్నది. మా వూరు ఆలేరును పేర్కొన్న సైదాపురంశాసనం (యాదగిరిగుట్ట దగ్గర) ఆ శాసనంలో.... 1వ వైపు స్వస్తి సమస్త భువనాశ్రయ శ్రీ పృ థ్వీ వల్లభ మహారాజాధిరాజ పరమేశ్వర పరమభట్టారకం సత్యాశ్రయ కుళతిలకం చా ళుక్యాభరణం శ్రీ మజ్జగదే క మల్లదేవర్ సక వర్ష956 నెయ భాను సంవత్సర జేష్ట ద పుణ్నమి బృహస్పతి వారదన్డు పొట్టళకెఱె య నెలవీడి నొళ్సోమగ్రహణ మ హా పర్వనిమిత్తదిం వైద్యరత్నాకరం ప్రా ణాచార్య నగ్గళయ్యన భిన్నప దొళ్బ కొల్లిపాకె-7000 దొళగణ ఆలే ఱు-40 ఱ బళియ ముప్ననపళ్ళి యొళ గ్గళెయ్యన మాడిసిద బుద్ధసేనజినా లయక్క మిక్కుఱికి యొళె మాడిసిద వైద్యర త్నాకర జినాలయక్కం ముచ్చనపళ్ళియ గావు ణ్ణం నరవైద్య నగ్గళయ్యన మాడిత మయా ర్దె యొళాయెరడు బసదియ భోగక్కం ఖ ణ్డ స్ఫుటిత నవసుధాకమార్దిగళం జా కబ్బెయ రెకబ్బెయ బసదియ ప్రతిబద్ధ కజ్జికాస్థానమాగె దేవభోగం తత్ప్ర తిబద్ధం బుద్ధిపాకె వాళిగె స బెతం బిట్ట ముప్పనపళి యొళ్దులల్లెవపం హి.. 2వ వైపు ..నిర్దే హాయస(తాం హితాయ విదుషాం..) తాత్మానామారోగ్యాయన్రుణాం సుఖాయ సుహృదాతు. ష్టై గురూణాంసదారక్షాయై జినశాసనస్యభిష జాం శాస్త్ర్రక్రియా సంశయాష్ట్యైద్యుచ్చే్దాయచ ప ద్మ భూస్సహజవైద్య్తరత్నాకరః.... ఆయుర్వేద విదాంయేశాస్త్ర కర్మక్రమేప్రౌఢాశ్రీ జగదేకమల్లయః న్రుపతేర్యే శాస్త్రపారంగతాస్తేషాం సంసది శస్త్ర శాస్త్రకుశల శ్రీ వైద్యరత్నాకరః జేతా నా బల రగ్గళ బు ధనిధి శ్శస్త్రేణ శాస్త్రే ణావా.... యద్యత్ర శస్త్రాదిషుకర్మ కరోతి లోకత్వంతు ప్రపేత్పినరవై ద్యక మగ్గళార్యః దివ్యం తథాపది ద తదాపి సుఖం విధాతుం సింహస్యత స్యచ(జయసింహ) పి పరైర్భిషగ్భిర్వ్యాధి ప్రకర్షె తదు క్షం నిరూహ దక్షం కథయంతి దిక్షు ఉమాతంత్రమాద్యం ల... సంగ్రహ పరిచ్ఛేద క్రియాకౌశలోద్దామ ప్రథిత శస్త్ర శా స్త్రవిషయ ప్రాగణ్యమనూర్జితప్రదం కమ్మిగ చక్రవర్తి జయసింగం మె ....................... ...................... 3వ వైపు ప్రదియెళర సంగె(పణ్డరాగరకుడువ) జయ సింగం దా గద్యాణ...బసది రక్కెబా డరకవొన్డు రాటాణ మెరడు కరెయ నేల ..కిసుకాడు మాగెమత్తర్నూఱు పూ దోంట మొన్దు నివేశనం పత్తు(ఘర)ద్రమ్మ మొన్దుగావుంణ్డన మాన్యద పాఱగా గెఱకిదమామియోళ్పన్నెరడఱ కొల గావుణ్డన....ట్టర... డుకొ... ణ్దదోయ పిరియ కెయ్యమద్మణ్ఱమ మ్మడియ బిట్టద తెంకణ మద్దిన ధు వియ్గెం చికబెయోళ్ ఊ...కాల్గ............. ళొళ్గెల్ల......... ణాముఱు పూణం ...........ల్గళ ప్రతిబద్ధ .....గిళాల గెయ్దు ద్రమ్మం షుర ద్రమ్మని మొన్దు వణ..కొణు సోయారమియ్దొన్డు తాళబసమొన్దు పా లె త్పెం.. తొఱెయద డయొళద్యాం పడువణ ....ణుస యగామెమెం యాగె పడువలు మూడ లు నన్దనవన మెన్యెయ తొణక్కం మత్తాన్నార్వల్వ త్త... మూడగణద్దెమె బెట్టదసా మా మాన్య దకెయ బోఱయ్యదె....పిదగణ బెట్టద ......కెయ్యత్త మూనూఱయ్యత్తు ఆయూ రసీమె దిశాగదొళ బియ కన్దుకూర కతన క ఱెయ దశాన ప కాణొండు మూఱుపల్లె ఆగ్నేయ దొళ్దు సనకుందెయ న మావరిష్ణ గండద కల్లోన్దుళుం గెయతాం నడకల్లోన్దు తెంకల్వ యెంబూ.. వీరెమొళె.. .....కల్లదిన్దునొ తెమొళ్వెలంగ కుళెయొ న్దు పడువణదె...యొ... న్దువాయ వ్యదొళె అవికుంటెయ మాకె..ప్పణుసె యకం.... ఈ శాసనంలో క్రీ.శ. 1034 జూన్ 4వ తేదీన పొత్తలకెఱె( పటాన్ చెరువు) వద్ద శిబిరంలో వున్న కొలనుపాక-7000నాడు మండలేశ్వరుడు పారమార జగద్దేవుడు చంద్రగ్రహణ సందర్భంగా వైద్యరత్నాకర, ప్రాణాచార్య, శస్త్రశాస్త్రకుశల శ్రీ అగ్గలయ్య కోరిక మేరకు ఆలేరు-40 కంపణంలోని ముచ్చనపల్లి వద్ద నిర్మించిన బుద్ధసేనజినాలయానికి, ఇక్కుర్తిలోని వైద్యరత్నాకరజినాలయానికి కానుక ఇచ్చినట్లు తెలుపబడినది. ఇంకా మా గ్రామం చుట్టు వున్న గ్రామాలు కాలువల వివరాలు చెప్పబడివున్నాయి. మరొక శాసనాధారం ఆలేరు శాసనంః నల్లగొండ జిల్లా శాసనసంపుటి-1లో 42 వది ఆలేరు శాసనం. ఆలేరు నుండి కొలనుపాక దారిలో ( గ్రామ సచివాలయం ) రెడ్డి కాలువ ఒడ్డున లభించిన శాసనంలో శాసనకాలం తెలియదు. విశ్వావసు సం.( ఏ సం.మో) జయంతిపురం రాజధానిగా పాలిస్తున్న త్రిభువనమల్లదేవుని కాలం నాటిది. ఈ శాసనంలో ఆలేరు-40 కంపణం సవదొరె సోమనాయకుడు పేర్కొనబడ్డాడు. వేమిరెడి, బూదిరెడి పేర్లు కూడా రాయబడివున్నాయి. శాసనం 1వ వైపు ........... సమస్త భు... వనాశ్రయ శ్రీ ప్రిథ్వీ వ ల్లభ మహా రా జాధి రాజప రమేశ్వర ప రమ భట్టా రక సత్యాశ్ర యకుళ తిళ కం చాళుక్యా భరణం శ్రీ మ త్రిభువన మ ల్ల దేవర వి జయ రాజ్యము త్త రోత్తరాభి వ్రుద్ధి ప్రవర్ధ మానమాచం 2వ వైపు ద్రార్కతారం జ యంతీపుర ద నెలెవీడి నొ ళుసుఖ సంకథా వినోదదిం రాజ్యం గెయ్యుత్తరమిరె శ్రీమచ్చాళు క్య విక్రమ వర్షద 50 నెయ విశ్వావసు సం వ త్సరద బహుళ 1 సోమవారదం దు ఆలేఱ న ల్వత్తఱ సవదొ రె సోమనాయ క్కం వేమిరడి బూదిరడి యు అవన 3,4 వైపుల రాతలు జీర్ణమై వున్నాయి ఒకపుడు ఈ వూళ్ళో మహాకాళి దేవాలయం వుండేదట. అది ఏ వరదమేటల్లో మునిగివున్నదో.మా వూళ్ళో మూడు ఆంజనేయుని గుళ్ళున్నాయి. ఒకటి హరిజనవాడదారిలో ఒకప్పటి పర్రెకాలువ ఒడ్డున వుంది.పాతగుడి ఆనవాలుగా ఒక ఆలయస్తంభం మిగిలివుంది.దాని మీది శిల్పాలు చిత్రంగా వున్నాయి.ఒకవైపు కూర్చుని చేతులు జోడించి బొమ్మ, అభిముఖంగా మరోకవైపు నిలుచుని చేతులు జోడుంచిన బొమ్మ చెక్కబడివున్నాయి. రెండో హనుమంతుడు నడూర్లో బొడ్రాయి దగ్గర శివాలయంలో వినాయకునితో పాటు వుంది. మూడోఆంజనేయుడి గురించి ఎవరింట్లోనో వున్నట్టు చెపుతారు కాని జాడ దొరకలేదు. మావూళ్ళోని రంగనాయకుని గుడి, 16వ శతాబ్దం నాటిదని ప్రతీతి. గుడిలో రంగనాయకుని విగ్రహశిల్పం అద్భుతకళాఖండం. ఇంతటి విగ్రహం శ్రీరంగపట్నం తర్వాత మరెక్కడాలేదని అంటారు. ఆలయం పునరుద్ధరణ చేసినపుడు పాత ఆలయస్తంభాల్ని, విగ్రహాల్ని ఎక్కడో పారేసారు. పాతగుడిలోని అర్ధమంటపం, ఆలయం పైకప్పు పైన మా చిన్నపుడు వున్న మునుల (జైనులు?)శిల్పాలు ఇపుడు లేవు. ఇప్పుడున్న గుడిగోడల్లో చాళుక్యుల శిల్పకళా స్తంభాలు రెండు, మూడు అగుపిస్తున్నాయి. గుడిలోపల ఒకటి, గుడిబయట మరొకటి వీరగల్లులున్నాయి. ఒకప్పటి జైనబసదిని వైష్ణవాలయంగా మార్చివేసినట్లు చెప్తారు చారిత్రకపరిశోధకులు. అక్కడికి దగ్గరలో చాముండేశ్వరిగుడి వుంది. ఆ గుడిని కూడా పునరుద్ధరణలో మార్చివేసారు. గుడిలో చాముండేశ్వరి, శివలింగం, వినాయకుడు, సూర్యవిగ్రహాలున్నాయి. ఒకప్పుడు ఇక్కడ త్రికూటాలయం వుండేదేమో. గుడి ముందర నగ్నరూపంలో మహిషాసురమర్దని, భైరవుడు, 1అడుగు ఎత్తున్న హనుమంతుడు, చిన్నవైన లింగాలున్నాయి. మేం చిన్ననాడు చూసిన అర్థమంటపం ఇపుడులేదు. అక్కడికి చేరువలో బొడ్రాయి దగ్గర మరొక శివాలయం వుంది. దేవాలయంలోని శివలింగం తెల్లనిరంగులో వుంది. గుడి ఎదుట వున్న వినాయకునిశిల్పం శైలి చూస్తే చాళుక్యుల నాటిదని తెలిసిపోతున్నది. అక్కడే హనుమంతుని మరొక విగ్రహం వుంది. ఒకప్పుడు వుండే పోచమ్మకుంటకు పడమట వున్న పోచమ్మ దేవాలయంలో మూడు దుర్గవిగ్రహాలున్నాయి. మరొక విగ్రహం శిథిలమై విరిగివుంది. గుడిబయట పోతరాజుగా పూజలందుకుంటున్న వీరగల్లు వుంది. గుడిలో వున్న మరొక శిల్పం అది జైనమునిదా లేక శైవాచార్యునిదా (ఎవరో సిద్ధునిది కావొచ్చని పి.వి.పరబ్రహ్మశాస్త్రి గారన్నారు) నిర్ధారణకు అందడం లేదు. రైలుకట్ట వెంట మాలోల్ల పోచమ్మ, కిష్టారెడ్డిచెలకలో మాదిగల పోచమ్మలున్నారు. అందులో వున్నవి దుర్గల శిల్పాలే. రైలుకట్టకు దగ్గరలో గౌరిదేవమ్మ గుడివుంది. అది 60 ఏళ్ళ కిందటిదే నంటారు. రైలుకట్టకు అవతలివైపు రైల్వేస్టేషన్ దగ్గరలో వున్న శివాలయం రాజరాజేశ్వరునిది.150 ఏళ్ళ కింద నిర్మించబడ్డదట. అక్కడే పురాతనకాలం నాటి మసీదుంది. ఎదురుగా దర్గా వుంది. అది సూఫీగురువు చిస్తీ మనవని సమాధిగా ప్రసిద్ధం. కొంచెం దూరంలో తాళ్ళకు వెళ్ళే రామసముద్రం తొవ్వలో కాటమయ్యగుడి వుంది. అక్కడే వున్న రైస్ మిల్లు గోడకు దగ్గరగా ఒక బావి (కోనేరు) వుండేది. పూడ్చేసారు. దానికి పైన కొద్ది దూరంలో భూదేవమ్మ గుడి వుండేదట. రైసుమిల్లులోని బావిలో మట్టి ఒరలు బయటపడ్డాయని మానాన్నవాళ్ళు చెప్తుండేవారు. ఆ మిల్లు కిందకు పోయినవి తుంగచంద్రమ్మ పర్రె, కాలువలు. మట్టి ఒరలు ఈ ప్రాంతంలో కొలనుపాకకు తూర్పున, షారాజిపేట అడ్లూరిచెరువులో, మావూరి రైసుమిల్లులో లభించాయని జనం ఉవాచ. అడ్లూరిచెరువుకొసన టంగుటూరుకు దగ్గరలో బయటపడివున్న రాళ్ళు, ఫలకలు బౌద్ధం సంబంధించినవేమో అనిపిస్తున్నది. అక్కడే బయ్యన్నగా పిలువబడే విగ్రహం మట్టిలో కూరుకునిపోయివుంది. మావూరికి ఉత్తరాన కొలనుపాకదారిలో పెద్దవాగు ఒడ్డున ‘ముడిగెల’ అనే పేరున్న ప్రదేశం వుంది. ఇక్కడ సర్వాలంకారశోభితయైన మహిషాసురమర్దిని, వినాయకుని విగ్రహాలున్నాయి. అక్కడికి దగ్గరలో ఆంజనేయుని విగ్రహం వుంది. అక్కడే బెల్లంబొంద లేదా కోనేరు అని పిలువబడే చతురస్రాకారపు బావి వుంది. ఆ పొలాల్లో ఎన్నో శిల్పాలు దొరికాయట. పొలం పనులకు అడ్డంగా వున్నాయని ఆ బావిలో పడేసినట్లు స్థానికరైతులు చెప్పారు. దగ్గరలో వున్న వాగొడ్డున కలశం వున్న దేవాలయ ద్వారబంధం కనిపించింది. వాగునుండి ఇసుక తోడుకపోయిన వ్యాపారులే చాలా శిల్పాలను తరలించారని కూడా విన్నాం. ఒకే ఒక చేతులు విరిగిన విష్ణుమూర్తి విగ్రహాన్ని తీసుకెళ్ళి ఏముకుంటలో తమపొలంలో నిలుపుకున్నారు కీ.శే. బొట్లనర్సయ్యగారు. మావూరిలో 35 అమ్మదేవతల గుళ్ళున్నాయి. 1.పోచమ్మ 2.మాలపోచమ్మ 3.మాదిగల పోచమ్మ 4.గడిమైసమ్మ 5.పెద్దమ్మ 6.పర్రెమైసమ్మ 7.వనం మైసమ్మ 8.ముత్యాలమ్మ 9.గుండెలమ్మ 10. పబ్బల పోచమ్మ 11. నల్లపోషమ్మ..............(అసంపూర్ణం) మావూరి బీరప్పగుడి గొల్లోనిఒర్రె ఒడ్డున వుంది. ఇందులో గొల్ల, కుర్మలు పూజించే లింగాలలో కొన్ని ఆదిమానవుల రాతి పనిముట్లు ఎక్కువగా రాతిగొడ్డండ్లు వున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు అన్ని బీరప్పగుళ్ళలో నవీన శిలాయుగానికి చెందిన ఆదిమానవుల రాతి పనిముట్లు లింగాలుగా పూజలందుకుంటున్నాయి. ఇవికాక శిథిలాలయాల ఆనవాళ్ళు చాలానే వున్నాయి. వూరి పొలిమేరలో బంగారు మైసమ్మ కూడలిదేవత. ఆదిమానవుల ఆవాసాలీ ప్రాంతంలో ఎక్కువగా వున్నాయి. ఆలేరుకు 7 కి.మీ.ల దూరంలో వున్న ఇక్కుర్తిలో ఆదిమానవుల నివాసాల జాడలు లభించే కొసగుట్ట పరిసరాల్లో 200కు పైగా ఆదిమానవుల ( మెన్హర్లు,డోల్మన్లు, కైరన్లు, సిస్తులు-రక్కసిగుళ్ళు) సమాధులున్నాయి. అక్కడ 16 ఆదిమానవుల రాతి పనిముట్లు లభించాయి. ఇక్కుర్తిలో 11 వ శతాబ్దపు కాలంనాటి దిగంబరజైన సంప్రదాయానికి చెందిన గురువు ‘నరవైద్యవర’ అగ్గలయ్య జైనబసదిలో వుండేవారని ‘సైదాపురం శాసనం’లో చెప్పబడింది. ఇక్కడి గుట్టమీద పార్శ్వనాథుని విగ్రహం, జిన అనే అక్షరాలున్న రాతిపలక వుంది.కోనేరు, జైనపాదాలు, జైనమునులు తపస్సుచేసుకునే రాతి గదులు ఈ గుట్టమీద మనం చూడొచ్చు. అంతేగాక శివాలయం, కాళికగుడి, ఆంజనేయుని గుడి,పొలాల్లో శిథిలాలయాల ఆనవాళ్ళున్నాయి. ఈవూరికి దగ్గరి గ్రామం మాటూరులో ఒకశాసనం (కన్నడభాషలో వుంది, రాష్ర్టకూటుల కాలంనాటిదని వూహించబడింది), శక్తివిగ్రహం, మరి రెండు వీరగల్లులు కనుగొనడం జరిగింది. మరొకవూరు అమ్మనబోలులో బడికానుకుని బావి అంచున మత్స్యావతారం చెక్కబడివుంది. ఇంకా అక్కడ వీరగల్లులు, అమ్మదేవతల శిల్పాలున్నాయి. అదే దారిలో పొరుగూరు గొలనుకొండలో చాలా ఎత్తైన లింగాకారపు గుట్ట వుంది.దానికి పడమటివైపు శివాలయంలో అర్థనారీశ్వరుడు, వినాయకుడు, విరిగిన వేణుగోపాలస్వామి శిల్పాలున్నాయి.అక్కడికి దగ్గరలో కొండకు చెక్కిన పన్నెండుగురు ఆళ్వారుల బొమ్మలు, శాసనాక్షరాలు వున్నాయి.మరొక పక్కన కూర్మావతార విగ్రహం వుందట.వూరికి పడమటి దిక్కున పొలాలదారిలో లెక్కలగుండు, దానిమీద గ్రామభూముల వివరాలున్నాయి. గ్రామ పరిసరాల్లో చాలా పెద్దవైన ఆదిమానవుల సమాధులున్నాయి.కొండపైన ఆదిమానవుల ఆవాసాలున్నట్టు అక్కడ లభించే రాతిపనిముట్లు, పాత్రల వల్ల గుర్తించవచ్చు. అక్కడకు దగ్గరలో వున్న జీడికల్లు ఒక తీర్థక్షేత్రం. ఇక్కడ జీడిగుండం, కల్లుగుండం అని రెండు గుండాలు అంచున శ్రీరాముడు కొలువై వున్నాడు. అతిప్రాచీనమైన ఈ క్షేత్రం ఒకపుడు ప్రసిద్ధవైష్ణవ పీఠంగా వుండేది. ఈ ప్రాంతంలో వైష్ణవమతకేంద్రంగా విలసిల్లినట్లు ప్రాచీన రచనలలో తెలుస్తుంది. వీరాచలంగా ప్రసిద్ధి ఈ క్షేత్రం.‘వీరాచల మహాత్మ్యం’ లో ఈ ప్రాంతవిశేషాలు చదువవచ్చు. ఇక్కడికి దగ్గరలో లేడిబండగా పిలువబడే ప్రదేశం వుంది. ఇక్కడే రాముడు మాయలేడిని వధించినట్లు స్థానికుల పురాణకథనం. మరొక విశేష గ్రామం షారాజిపేట.ఈ వూరిలో పురాతన వెంకటేశ్వరాలయం వుంది. స్థానిక దొరగడి ముందర చక్రేశ్వరి వంటి జైనదేవత, ఇతర దేవతల శిల్పాలు, విరిగిన విగ్రహాలు అగుపిస్తాయి. వూరి గ్రామం ఆనవాళ్ళు, ముఖ్యంగా బావులలో వేసిన మట్టిఒరలు లభించాయని ఇక్కడి పెద్దలు చెప్పారు.చెరువును ‘అడ్లూరు’చెరువుగా పిలవడం విశేషం. చెరువులో ప్రాచీన ఆలయశిథిలాలు పడివున్నాయి. వాటికి కొంతదూరాన ‘బయ్యన్న’ విగ్రహం వుంది. సశేషం...........

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. కొలనుపాక
 2. రాఘవాపురం (కొలనుపాక)
 3. శ్రీనివాసపురం
 4. పటేల్‌గూడెం
 5. టంగుటూరు
 6. షారాజీపేట
 7. తూర్పుగూడెం
 8. బహదూర్‌పేట
 9. మంతపురి
 10. దిలావర్‌పూర్‌
 11. ఇక్కుర్తి
 12. కొల్లూరు
 13. శర్బనాపురం
 14. మాటూరు
 15. అమ్మనబోలు
 16. గోలంకొండ
 17. మందనపల్లి
 18. గుండ్లగూడెం
Nalgonda map.jpg

నల్గొండ జిల్లా మండలాలు

బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్‌పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్‌పహాడ్‌ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్‌నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్‌పోడ్‌ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట


వరంగల్ జిల్లా, నెల్లికుదురు మండలంలోని ఇదే పేరున్న మరొక గ్రామం కోసం ఆలేరు (వెల్లికుదురు మండలం) చూడండి

పంచాంగము శ్రౌత స్మార్తాది సకల సత్కర్మానుష్టానములకు ఆధారభూతమైనది. జటిల గణిత సాధ్యమైన పంచాంగణనము బహుప్రాచీన కాలము నుండి వారి వారి సాంప్రదాయములను అనుసరించి చేయబడుచున్నవి. కాగా కొన్ని పంచాంగములయందు గ్రహణాది ప్రత్యక్ష గోచారములు కూడా తప్పిపోవు ప్రమాదములు మనము చూచుచున్నాము. ఇట్టి దోషములు తప్పిదములు రాకుండా ఉండాలని కంచి పరమాచార్యుల వారు సుమారు ౧౧౦ సంవత్సరముల నుండి జ్యోతిష పంచాంగ పండిత సదస్సులను భారతదేశములోని ప్రముఖులైన జ్యోతిష, పంచాంగ, ఖగోళ, తర్క, మీమాంస, వ్యాకరణ, సంస్కృత, స్కంధత్రయ, మతత్రయ పండితులను, ధర్మశాస్త్ర పండితులను పిలచి శ్రీమఠమున నిర్వహించడము అవిచ్ఛినన్నముగా జరుగుతున్నది. అట్టి సభయందు తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, ఆలేరు వాస్తవ్యులు బ్రహ్మశ్రీ దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు ప్రతి సంవత్సరము గణిస్తూ వెలువరిస్తున్న శ్రీ కాలనిర్ణయ పంచాంగములోని పండుగల, మౌఢ్య, పుష్కర, సంక్రమణ, గ్రహసంచార, గ్రహణ నిర్ణయములన్నియూ సశాస్త్రీయముగా ధర్మబద్ధముగా ఉన్నవి అని పై సదస్సు అమోదించటము జరిగినది. శ్రీ మన్మథ నామ సంవత్సర కాలనిర్ణయ పంచాంగములో గోదావరి పుష్కరములపై ప్రత్యేక వివరణ, పుష్కర మాహత్మ్యం, నదీస్నాన సంకల్పం, అర్గ్యప్రధాన వివరములు సశాస్త్రీయముగా ఇవ్వబడినవి. అధికమాస విశిష్టత పై ప్రత్యేక వ్యాసం ఇవ్వబడినది. ప్రతేకముగా వివాహది మ్హూర్తముల విషయములలో ధర్మ శాస్త్ర వివరములు, పంచక రహితాది వివరములు, పుష్కర, వర్గోత్తమాంశ, శుభాంశలతో శుభముహూర్తములు, ప్రతిదిన గ్రహచక్రములు, ప్రతిదిన శ్రాద్ధ తిథి వివరములు, సంపూర్ణముగా సర్వులకూ అర్థమగు రీతిలో ఇవ్వడము జరిగినది. బ్రహ్మశ్రీ దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు ౧౯ సంవత్సరములకే పంచాంగ గణన చేసి అత్యధిక పిన్నవయస్సులో పంచాంగకర్తగా ప్రముఖులతో (జగద్గురు శ్రీశ్రీశ్రీకంచి స్వామివారు, & మాజీ సిక్కిం గవర్నర్ రామారావ్ గారు, & సి.నా.రే.) సన్మానము పొందుట, జ్యోతిష కేసరి బిరుదు పొందుట జరిగినది. నల్లగొండ, రంగారెడ్డి వైదిక, అర్చక బ్రహ్మణ సంఘములకు ఆస్థాన సిద్ధాంతిగా వ్యవహరించుట, ౧౫౭ దేశములకు ప్రాంతీయ కాలసవరణలతో పంచాంగమును తయారు చేయుట, సైంటిఫిక్ జ్యోతిషం అనే అంశము మీద పరిశోధన చేయుచున్నారు

భారతీయ సనాతన ధర్మము అందరికీ అదర్షప్రాయమైనది అట్టి సనాతన ధర్మానికి ప్రతీకగా ప్రతి ఒక్కరూ మన సంస్కృతీ సాంప్రదాయములను పాటిచాలనే ఆలోచనతో ఈ ఉగాది తెలుగు క్యాలెండర్ రూపొందించడము జరిగినది ఈ కాలనిర్ణయము తెలుగు మాసములతో అనేక వివరణలతో ఇవ్వడము జరిగినది దీని రూపకర్త యగు బ్రహ్మశ్రీ దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు అనేక వివరణములు & రాశి ఫలితములు & సంవత్సర ఫలితములు కూడా ఇందులో ఇవ్వడము జరిగినది. ఆంగ్లవత్సరాది వద్దు - తెలుగు వత్సరాదియే ముద్దు ఉమ్మడి దేశముల సఖ్యతకై ఆంగ్లవత్సరాదిని గుర్తిద్దాం మన భారతీయ ఉన్నత్తత్వమును తెలుపుటకు తెలుగువత్సరాదిని ఆచరిద్దాము.

"https://te.wikipedia.org/w/index.php?title=ఆలేరు&oldid=1556964" నుండి వెలికితీశారు