Jump to content

టెర్రర్ (2016 సినిమా)

వికీపీడియా నుండి
టెర్రర్
దర్శకత్వంసతీష్ కాసెట్టి
రచనసతీష్ కాసెట్టి
నిర్మాతషైక్ మస్తాన్
తారాగణంశ్రీకాంత్
నికిత
ఛాయాగ్రహణంవి. శ్యామ్ ప్రసాద్
కూర్పుబసవ పైడిరెడ్డి
సంగీతంకే. సాయి కార్తీక్
విడుదల తేదీ
26 ఫిబ్రవరి 2016 (2016-02-26)
సినిమా నిడివి
144 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు

టెర్రర్ 2016 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సతీష్ కాసెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, నికిత, కోట శ్రీనివాసరావు, రవివర్మ, బలిరెడ్డి పృథ్వీరాజ్, నాజర్ తదితరులు నటించారు. సాయి కార్తీక్ సంగీతం అందించగా శ్యామ్ ప్రసాద్ ఛాయాగ్రాహకుడిగా పనిచేసాడు.

టెర్రర్ సినిమా 2016 ఫిబ్రవరి 26 లో విడుదలయ్యి విమర్శనాత్మక ప్రశంసలు అందుకుంది.[1][2][3]

నటీనటులు

[మార్చు]

ముఖ్యమంత్రిని హత్యచేసి, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని కొందరు ఉగ్రవాదులు కుట్ర పన్నుతారు. ఆ కుట్ర గురించి హోమ్ మినిస్టరుకు సమాచారం వస్తుంది. అయితే... సీఎం పీఠంపై ఆశ పెంచుకున్న హోమ్ మినిస్టర్ ఈ కుట్రను భగ్నం చేయకుండా కొనసాగేలా చేస్తాడు. తద్వారా సీఎమ్ దుర్మరణానంతరం తానే ఆ పదవి పొందవచ్చని భావిస్తాడు. ఓ ఎన్‌కౌంటర్ కారణంగా సస్పెండ్ అయిన విజయ్ అనే పోలీస్ ఆఫీసరుకు ఈ కుట్ర గురించి తెలుస్తుంది. హోమ్ మినిస్టర్ ఆడే రాజకీయ రంగంలో పోలీసు ఉన్నతాధికారులూ భాగసాములయ్యారని తెలిసి అవాక్కవుతాడు. తన సస్పెంట్ ఆర్డర్‌ను రద్దు చేసుకోవడానికి అవినీతిపరుడుగా మారిన విజయ్‌ను అతని తండ్రి ద్వేషించి ఇంటిలోంచి బయటకు పంపించేస్తాడు. తన సిన్సియారిటీతో తండ్రిని మెప్పించాలనే తపన ఓవైపు, తన డిపార్ట్ మెంట్లోని అవినీతిలో తాను భాగమై పోయాననే ఆవేదన మరో వైపు విజయ్‌ను అతలాకుతలం చేస్తుంటుంది. సరిగ్గా అదే సమయంలో తన దృష్టిలోకి వచ్చిన టెర్రరిస్ట్ అటాక్‌ను భగ్నం చేసేందుకు సిద్ధమౌతాడు విజయ్. అందులో అతను ఎంతవరకూ సఫలమయ్యాడన్నది మిగతా కథ.[4]

మూలాలు

[మార్చు]
  1. Srikanth's 'Terror' movie review by critics and audience: Live update
  2. "Terror Review". Archived from the original on 2019-07-28. Retrieved 2019-07-28.
  3. Hits and Flops of 2016 in Tollywood
  4. చంద్రం (11 March 2016). "సమకాలీన సమస్యలపై టెర్రర్". జాగృతి వారపత్రిక. Retrieved 25 February 2024.