సతీష్ కాసెట్టి
సతీష్ కాసెట్టి | |
---|---|
జననం | సత్యనారాయణ కాసెట్టి |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | తెలుగు సినిమా రచయిత, దర్శకుడు |
వెబ్‌సైటు | http://satishkasetty.com/ |
సతీష్ కాసెట్టి తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. 2006లో ఈయన తొలిసారిగా దర్శకత్వం వహించిన హోప్ చిత్రానికి ఉత్తమ సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా జాతీయ పురస్కారం బహుమతి వచ్చింది.
సినిమారంగ ప్రస్థానం
[మార్చు]సతీష్ 2006లో తొలిసారిగా హోప్ సినిమాకు దర్శకత్వం వహించాడు. నిర్మాత డి. రామానాయుడు, కళ్యాణి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం 54వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఉత్తమ సామాజిక అంశం కలిగిన చిత్రంగా బహుమతిని అందుకుంది. విద్యావ్యవస్థలోని ఒత్తిడి కారణంగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై ఈ చిత్రం రూపొందించబడింది.[1]
2009లో కమల్ కామరాజు, కలర్స్ స్వాతి జంటగా నటించిన కలవరమాయే మదిలో చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో పల్లవించని అనే పాటకు గాయని కె. ఎస్. చిత్రకు ఉత్తమ గాయనిగా నంది పురస్కారం లభించింది.[2] సతీష్ దర్శకత్వంలో 2016, ఫిబ్రవరిలో శ్రీకాంత్ హీరోగా టెర్రర్ సినిమా విడుదలైంది.
దర్శకత్వం వహించిన చిత్రాలు
[మార్చు]- హోప్ (2006)
- కలవరమాయే మదిలో (2009)
- టెర్రర్ (2016 సినిమా)
మూలాలు
[మార్చు]- ↑ "54th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 28 February 2018.
- ↑ "Kalavaramaye Madilo is appealing". Rediff.com. 17 July 2009. Retrieved 21 February 2013.