ఓం భీమ్ బుష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓం భీమ్ బుష్
దర్శకత్వంశ్రీ హర్ష కొనుగంటి
రచనశ్రీ హర్ష కొనుగంటి
నిర్మాతసునీల్ బలుసు
తారాగణం
ఛాయాగ్రహణంరాజ్ తోట
కూర్పువిష్ణు వర్షన్ కావూరి
సంగీతంస‌న్నీ ఎంఆర్
నిర్మాణ
సంస్థ
వి సెల్యులాయిడ్స్
విడుదల తేదీ
2024 మార్చి 22 (2024-03-22)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఓం భీమ్ బుష్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమాకు శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 26న[1], ట్రైలర్‌ను న విడుదల చేసి సినిమాను మార్చి 22న విడుదల చేశారు.

ఈ సినిమా ఏప్రిల్ 12 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో  ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]

కథ[మార్చు]

క్రిష్ (శ్రీ విష్ణు), వినయ్ (ప్రియదర్శి), మాధవ్ (రాహుల్ రామకృష్ణ) ప్రాణ స్నేహితులు. వీరిని బ్యాంగ్ బ్రోస్ అని పిలుస్తుంటారు. భైరవపురంలో తాంత్రిక విద్యల పేరుతో కొందరు డబ్బు సంపాదించడం బ్యాంగ్ బ్రోస్ కంట పడుతుంది. దీనితో వీరు ముగ్గురు భైరవపురం ఊరిలో అడుగుపెడతారు. అక్కడ డబ్బులు సంపాదించుకోవడం కోసం సైంటిస్టులుగా కొత్త అవతారం ఎత్తుతారు. దీంతో వీరి గురించి తెలుసుకోవడానికి ఆ ఊరి ప్రజలు వీరికి ఓ పరీక్ష పెడతారు. ఆ ఊరిలో ఉన్న సంపంగి మహల్ లో ఉన్న నిధిని కనిపెట్టాలని ప్రయత్నిస్తున్న వీరికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్:  వి సెల్యులాయిడ్స్
  • నిర్మాత:  సునీల్ బలుసు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి[7]
  • సంగీతం: స‌న్నీ ఎంఆర్
  • సినిమాటోగ్రఫీ:  రాజ్ తోట
  • ఎడిటర్: విష్ణు వర్షన్ కావూరి
  • ఆర్ట్ డైరెక్ట‌ర్: శ్రీ‌కాంత్ రామిశెట్టి

సంగీతం[మార్చు]

ఈ చిత్రానికి పాటలు మరియు బ్యాక్రౌండ్ స్కోర్ సన్నీ ఎం. ఆర్. సమకూర్చారు. శ్రీహర్ష కొనుగంటితో ఇది అతని రెండవ సహకారం, మరియు శ్రీవిష్ణుతో అతని మొదటి సహకారం.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."బ్యాంగ్ బ్రోస్"లక్ష్మి ప్రియాంకఆదిత్య అయ్యంగర్, డింకర్ కల్వల, వివేక్ హరిహరన్, రుత్విక్ తలశిల్కర్, సన్నీ ఎం.ఆర్.3:02
2."ది వెడ్డింగ్ సాంగ్"కృష్ణకాంత్కపిల్ కపిలన్3:22
3."దిల్ ధడ్కే"కృష్ణకాంత్కృష్ణ తేజస్వి, సన్నీ ఎం.ఆర్.3:03

మూలాలు[మార్చు]

  1. A. B. P. Desam (26 February 2024). "ఓం భీమ్ బుష్'బుదిరి తల్లీ బుదిరేష్, రిలీజ్ - 100 ప‌ర్సంట్ ఫ‌న్!". Archived from the original on 13 March 2024. Retrieved 13 March 2024.
  2. Sakshi (8 April 2024). "3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా". Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.
  3. "రివ్యూ: ఓం భీమ్ బుష్‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌ అలరించిందా?". 22 March 2024. Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.
  4. Eenadu (24 February 2024). "శ్రీవిష్ణు చిత్రం... 'ఓం భీమ్‌ బుష్‌'". Archived from the original on 24 February 2024. Retrieved 24 February 2024.
  5. Chitrajyothy (20 March 2024). "సినిమాలో ఎటు చూసినా నేను, ప్రియదర్శి, రాహులే కనిపిస్తాం | Actor SREE Vishnu About Om Bheem Bush Movie ktr". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.
  6. Eenadu (17 March 2024). "ఆ చిత్రానికి, 'ఓం భీమ్‌ బుష్‌'కి పోలిక ఉండదు: ప్రియదర్శి". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
  7. Eenadu (13 March 2024). "నిర్మాతలిచ్చే స్వేచ్ఛ.. దర్శకులకు ఓ వరం". Archived from the original on 13 March 2024. Retrieved 13 March 2024.

బయటి లింకులు[మార్చు]