Jump to content

మెయిల్ (సినిమా)

వికీపీడియా నుండి
(మెయిల్‌ (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
మెయిల్
దర్శకత్వంఉదయ్‌ గుర్రాల
రచనఉదయ్‌ గుర్రాల
నిర్మాతప్రియాంక దత్
తారాగణం
ఛాయాగ్రహణంఉదయ్‌ గుర్రాల
శ్యామ్ దూపాటి
కూర్పుహరి శంకర్ టిఎన్
సంగీతంస్వీకార్ అగస్తి (పాటలు)
సయ్యద్ కమ్రాన్ (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్)
నిర్మాణ
సంస్థ
స్వప్న సినిమా
పంపిణీదార్లుఆహా
విడుదల తేదీ
12 జనవరి 2021 (2021-01-12)
సినిమా నిడివి
116 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

మెయిల్‌ 2021లో విడుదలైన తెలుగు సినిమా. స్వప్న సినిమా బ్యానర్ పై స్వప్నదత్, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించగా ఉదయ్‌ గుర్రాల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం టీజర్‌ను 2020, డిసెంబర్ 30న విడుదల చేసి,[1] సినిమాను ఓటీటీ వేదికగా ఆహాలో 2021 జనవరి 12న విడుదల చేశారు.[2]

అప్పుడప్పుడే కంప్యూటర్లు గ్రామాల్లోకి వస్తున్న రోజుల్లో రవి కుమార్ (హర్షిత్ రెడ్డి) కంప్యూటర్లపై ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకుంటాడు. కంప్యూటర్ కోర్స్ చేయాలని నిశ్చయించుకుని, కంబాలపల్లిలో కొత్తగా కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ను అదే ఊరికి చెందిన హైబత్ (ప్రియదర్శి) ప్రారంభిస్తాడు, రవి కంప్యూటర్ నేర్చుకోవాలని అనుకుంటాడు. కంప్యూటర్ నేర్చుకుంటానంటే, వీడెక్కడ ముంచుతాడోనని హైబత్ ఎలర్ట్ అవుతాడు. వదలకుండా సతాయిస్తూంటే కొన్ని షరతులు పెట్టి నేర్పుతాడు. ఈమెయిల్ ఎక్కౌంట్ క్రియేట్ చేసి, ఈమెయిల్ సౌకర్యం గురించి చెప్తాడు. దీంతో తనకి మెయిల్ వచ్చిందేమోనని రవి రోజూ చూస్తూంటాడు. ఒక రోజు రెండు కోట్లు లాటరీ తగిలినట్టు వస్తుంది. భయపడి వెళ్ళి ఫ్రెండ్ సుబ్బుకి చెప్తాడు. సుబ్బు ధైర్యం చెప్పి, ఏంచేయాలో చెప్తాడు. ఆ ప్రకారం అడ్రసు పంపి ఎదురు చూస్తూంటే, లక్ష కట్టాలని మెయిల్ వస్తుంది. ఇప్పుడు రవి ఏం చేశాడన్నది, ఎలాటి చిక్కుల్లో పడ్డాడన్నది ఈ సినిమా మిగతా కథ.

నటీనటులు

[మార్చు]
  • ప్రియదర్శి - హైమత్
  • హర్షిత్ రెడ్డి మల్గిరెడ్డి - రవి కుమార్
  • గౌరి ప్రియ - రోజా
  • మణి ఎగుర్ల - సుబ్బు
  • యెన్నెన్జీ - కంప్యూటర్ వైరస్ మెకానిక్ షకీల్
  • అంజి వల్గుమాన్
  • రవీందర్ బొమ్మకంటి - శివన్న
  • అనూష నేత - గిరిజ
  • సన్నీ పల్లె

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • దర్శకత్వం: ఉదయ్ గుర్రాల [3]
  • సంగీతం : స్వీకార్ ఆగస్తీ
  • పాటలు: అక్కల చంద్రమౌళి
  • నేపథ్య సంగీతం: కమ్రాన్
  • ఛాయాగ్రహణం: ఉదయ్ గుర్రాల, శ్యామ్ దూపాటి
  • నిర్మాతలు: ప్రియాంక దత్, స్వప్నా దత్
  • ఎడిటర్: హరి శంకర్ .టి.ఎన్

న్యూయర్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2021

[మార్చు]

మెయిల్‌ సినిమా న్యూయర్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2021’కు ఎంపికైంది.[4][5]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (30 December 2020). "అలరిస్తోన్న ప్రియదర్శి 'మెయిల్' టీజర్... - priyadarshi mail teaser released". m.eenadu.net. Archived from the original on 9 మే 2021. Retrieved 9 May 2021.
  2. TV9 Telugu (13 January 2021). "Mail Movie Review: ప్రేక్షకుల మనసును హత్తుకుంటున్న 'మెయిల్'.. కామెడి టైమింగ్‏తో అదరగొట్టిన ప్రియదర్శి.. - mail Movie Review". Archived from the original on 9 మే 2021. Retrieved 9 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (30 May 2021). "ఓటీటీలో ఓహో అనిపించారు! - Sunday Magazine". EENADU. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.
  4. 10TV (9 May 2021). "Mail Movie: అరుదైన ఘనతకెక్కిన తెలుగు సినిమా! | Mail in New York Indian Film Festival" (in telugu). Archived from the original on 9 మే 2021. Retrieved 9 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. Namasthe Telangana (9 May 2021). "న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మెయిల్". Archived from the original on 9 మే 2021. Retrieved 9 May 2021.