యెన్నెన్జీ
యెన్నెన్జీ | |
---|---|
జననం | నరేందర్ గౌడ్ నాగులూరి 1982 మార్చి 4 |
వృత్తి | రచయిత, దర్శకుడు, నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2008 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | లలిత కవిత |
పిల్లలు | ఆధ్యా తన్మయి (కుమార్తె) |
తల్లిదండ్రులు | నాగులూరి సాయాగౌడ్ - లక్ష్మీబాయి |
యెన్నెన్జీ (నరేందర్ గౌడ్ నాగులూరి) తెలంగాణ రాష్ట్రానికి చెందిన సినిమా రచయిత, దర్శకుడు, నటుడు. ఆయన తెలంగాణ ఉద్యమం సమయంలో 2013లో దర్శకత్వం వహించిన ‘యాది’ , ‘రాజిగ ఓరి రాజిగా’ అనే లఘు చిత్రాలు అతడికి మంచి గుర్తింపును తెచ్చాయి.[1] 2021లో వచ్చిన మెయిల్ సినిమాలో కంప్యూటర్ వైరస్ మెకానిక్ షకీల్ పాత్రలో నటించాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]నరేందర్ 4 మార్చి 1982న తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ మండలం, హసన్‌పల్లిలో సాయాగౌడ్, లక్ష్మీబాయి దంపతులకు జన్మించాడు.[1] అతను పదవ తరగతి వరకు పోచంపాడ్ గురుకులం లో, బోధన్ లో ఇంటర్‌మీడియెట్ చదివాడు. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్‌లో డీఎంఎల్టీ కోర్సు పూర్తి చేశాడు. అనంతరం నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరాడు.[2]
సినీ జీవితం
[మార్చు]నరేందర్ గౌడ్ 2000 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చి కొంతకాలం పెయింటర్ గా పనిచేశాడు. ఈ క్రమంలోనే బాబు మోహన్ ద్వారా ఇ.వి.వి.సత్యనారాయణతో అతడికి పరిచయం ఏర్పడింది. నరేందర్ గౌడ్ 2008లో తూర్పు పడమర సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన తరువాత అతడు పలు డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్‌కు అసిస్టెంట్‌గా పనిచేశాడు. నరేందర్ తెలంగాణ ఉద్యమం సమయంలో 2013లో ‘యాది’ , ‘రాజిగ ఓరి రాజిగా’ లఘు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండు లఘు చిత్రాలకు అతడికి మంచి పేరు తీసుకువచ్చాయి.[1]
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, కోయలపై 'ఆర్ట్ ఎట్ హార్ట్' డాక్యుమెంటరీ తీసే అవకాశం కల్పించాడు.[3][4] నరేందర్ ఆ తరువాత భాషా సాంస్కృతిక శాఖ తరపున పేరిణీ నృత్యంపై డాక్యుమెంటరీ చేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రవీంద్రభారతి తెలంగాణ కళాకారులకు అడ్డాగా మారడంతో తెలంగాణ అవతరణ ఫిల్మోత్సవం, బతుకమ్మ ఫిల్మోత్సవం, సినివారం, సండే సినిమా, ఫెంటాస్టిక్ ఫైవ్ ఫిలిం ఫెస్టివల్, మాస్టర్ యువర్ క్రాఫ్ట్, యువ చిత్రోత్సవం వంటి కార్యక్రమాల రూపకల్పనలో భాగ్యస్వామి అయ్యాడు.[5]
ఆయన 2017లో దర్శకుడిగా క్రౌడ్ ఫండింగ్ ద్వారా హృదయాంజలి సినిమా ప్రారంభించాడు, కానీ కొన్ని కారణాల వల్ల అది నిలిచిపోయింది.[6] యెన్నెన్జీ 2021లో ఆహాలో విడుదలైన మెయిల్ సినిమాలో కంప్యూటర్ వైరస్ మెకానిక్ షకీల్ పాత్రలో నటించి ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపును అందుకున్నాడు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను సినిమాలకు రచనా సహకారం అందిస్తున్నాడు.
దర్శకత్వం వహించిన లఘు చిత్రాలు
[మార్చు]సంవత్సరం | షార్ట్ ఫిలిమ్స్ | లఘు చిత్రం/డాక్యుమెంటరీ | భాష |
---|---|---|---|
2013 | యాది[7] | లఘు చిత్రం | తెలుగు |
2015 | రేసు | లఘు చిత్రం | తెలుగు |
2016 | ఆర్ట్ ఎట్ హార్ట్ | డాక్యుమెంటరీ | తెలుగు |
2017 | రాజిగ ఓరి రాజిగా | లఘు చిత్రం | తెలుగు |
2017 | ఉత్తచేతుల బిక్షపతి | లఘు చిత్రం | తెలుగు |
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాష | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2021 | మెయిల్ | కంప్యూటర్ వైరస్ మెకానిక్ షకీల్ | తెలుగు | *"మెయిల్ సినిమాలో యెన్నెన్జీ నటించిన సన్నివేశం". |
2021 | అఖండ | గ్రామస్తుడు | తెలుగు | |
2022 | కిరోసిన్ | చంటి | తెలుగు | |
2022 | పంచతంత్ర కథలు | గ్రామస్తుడు | తెలుగు | |
2023 | రాక్షస కావ్యం | డిస్ట్రిబ్యూటర్ | తెలుగు | |
2024 | భరతనాట్యం | పాతబస్తీ వాసి | తెలుగు | |
హాంగ్ మాన్ | ఉరి తీయబడిన ఖైదీ | తెలుగు | ||
టీచర్ | సైకాలజిస్ట్ | తెలుగు | ||
సిట్రూర్ డేస్ | పులి | తెలుగు/తమిళ్ | వెబ్ సిరీస్ |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 నమస్తే తెలంగాణ (21 June 2020). "సినిమాను ప్రేమిస్తూ." Archived from the original on 2020-06-21. Retrieved 4 July 2021.
- ↑ telugu, NT News (2023-06-22). "Telangana | తెలంగాణ తల్లి నుదుట సాంస్కృతిక తిలకం". www.ntnews.com. Archived from the original on 2023-06-22. Retrieved 2023-06-22.
- ↑ మన తెలంగాణ (18 November 2015). "చీమలు తిని..ఇప్ప కల్లు తాగి". Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
- ↑ The Hindu, Srivathsan (5 October 2016). "The fading rhythm". The Hindu. Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
- ↑ Telangana Today (6 July 2017). "Cinivaaram: The filmmaker's reason to celebrate Saturday". Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
- ↑ ఆంధ్రజ్యోతి (6 February 2017). "రోడ్ థ్రిల్లర్ 'హృదయాంజలి'". Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
- ↑ "Interview with 'యాది' Director Yennengee – "learnt a lot of filmmaking on Internet!"". 8 November 2013. Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.