Jump to content

అక్కల చంద్రమౌళి

వికీపీడియా నుండి
అక్కల చంద్రమౌళి
జననం8 జూన్ 1983
రామకృష్ణాపూర్‌ గ్రామం , మంచిర్యాల జిల్లా , తెలంగాణ, భారతదేశం
వృత్తికవి, సినిమా పాటల రచయిత
తల్లిదండ్రులుఅక్కల లచ్చన్న, రాజేశ్వరి

అక్కల చంద్రమౌళి తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి, సినిమా పాటల రచయిత. ఆయన 2013లో ‘గులాబీ’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

అక్కల చంద్రమౌళి 8 జూన్‌ 1983న తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, రామకృష్ణాపూర్‌ గ్రామంలో అక్కల లచ్చన్న, రాజేశ్వరి దంపతులకు జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు రామకృష్ణాపూర్‌ లో, హైదరాబాద్ లో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసి , ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీఏ పూర్తి చేశాడు.[1]

సినీ జీవితం

[మార్చు]

అక్కల చంద్రమౌళి సింగరేణిలో కారుణ్య నియామకం ద్వారా తన తండ్రి ఉద్యోగం తనకు వచ్చింది. ఆయన సినిమాలపై ఇష్టంతో ఆ ఉద్యోగాన్ని వదులుకొని సినీరంగంలోకి అడుగు పెట్టాడు. ఆయన 2013లో ‘గులాబీ’ సినిమా ద్వారా పాటల రచయితగా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన పలు డాక్యూమెంటరీలకు పాటలు రాసాడు.

చిత్రాలు-పాటలు
  1. గులాబీ (2013) - 1. శతమానంభవతి చరితల్లోనే మురిసే 2. సొగసు చీరలో నిశీధి వేళలో 3. ఇది కవి రాయని శ్లోకమే 4. మేఘమొదిలే మెరుపై కదిలే
  2. శివకాశీపురం (2017) - 1. ఇన్నాళ్లుగా నా కళ్లల్లో నువ్వే 2. బంతీపూలతో బండికట్టినానే 3. తొలివరమై రావా
  3. కారులో షికారుకెళ్తే (2017) - 1.హే దుమ్మేసేయ్‌ ఈలగొట్టి
  4. మెయిల్‌ (2021) 1.హే.. బొమ్మా బొరుసంటూ
  5. పరేషాన్‌ (2021) 1. సౌ సారా సౌ సారా చటక్కారా [2]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (4 September 2021). "సాహిత్య చంద్రుడు". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  2. Telangana Today (24 January 2021). "Mancherial lyricist hits high notes". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.