Jump to content

విన్నర్ (2017 సినిమా)

వికీపీడియా నుండి
విన్నర్
దర్శకత్వంగోపీచంద్ మలినేని
రచనఅబ్బూరి రవి (మాటలు)
స్క్రీన్ ప్లేగోపీచంద్ మలినేని
కథవెలిగొండ శ్రీనివాస్
నిర్మాతనల్లమలుపు బుజ్జి
ఠాగూర్ మధు
తారాగణంసాయి ధరమ్ తేజ్
రకుల్ ప్రీత్ సింగ్
జగపతి బాబు
Narrated byదగ్గుబాటి రానా
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు
కూర్పుగౌతమ్ రాజు
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థలు
శ్రీ లక్ష్మీ నర్సింహా ప్రొడక్షన్స్
లియో ప్రొడక్షన్స్
విడుదల తేదీ
24 ఫిబ్రవరి 2017 (2017-02-24)
సినిమా నిడివి
155 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు

విన్నర్ 2017 లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు సంయుక్తంగా శ్రీ లక్ష్మీ నర్సింహా ప్రొడక్షన్స్ & లియో ప్రొడక్షన్స్ పతాకాలపై నిర్మించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం అందించాడు. సాయి ధరమ్ తేజ్,[2] రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, ప్రియదర్శి పుల్లికొండ, ముకేష్ రిషి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించాడు.[3]

ఉత్తమ సందేశాత్మక చిత్రం , నంది పురస్కారం

సిద్ధార్థ్ (సాయిధరమ్ తేజ్) తండ్రి అంటే అసహ్యంతో చిన్నతనంలో ఇంటి నుంచి వెళ్లిపోతాడు. పెరిగి పెద్దయ్యాక ఒక న్యూస్ పేపర్లో క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తుంటాడు. ఓ పార్టీలో సితార (రకుల్ ప్రీత్)ను చూసి ప్రేమలో పడతాడు. పెద్ద అథ్లెట్ కావాలని కలలు కంటున్న సితార.. సిద్ధార్థ్ అల్లరి కారణంగా తన కెరీర్ ను పక్కనబెట్టి హార్స్ రేసర్ అయిన ఆది (అనూప్ సింగ్)ను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఆ పెళ్లిని తప్పించుకునేందుకు సితార చెప్పిన అబద్ధం సిద్ధార్థ్ .. ఆదితో గుర్రపు పందెంలో పోటీ పడాల్సి వస్తుంది. అసలు గుర్రపు పందాలంటేనే పడని సిద్ధార్థ్.. సితార కోసం ఎలా కష్టపడ్డాడు.. తన స్థానంలో తన తండ్రికి కొడుగ్గా చలామణి అవుతున్న ఆది మీద ఎలా గెలిచి తన తండ్రికి దగ్గరయ్యాడు అన్నది మిగతాకథ.

తారాగణం

[మార్చు]

ప్రధాన తారాగణం

సహాయక తారాగణం

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందించాడు. ఆదిత్య మ్యుజిక్ ద్వారా విడుదల చేశారు.

పాటల పట్టిక
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."సితార"అనంత శ్రీరామ్యాజిన్ నిజార్, సంజన4:39
2."పిచ్చోన్ని ఐపోయా"శ్రీమణిదీపక్, క్రిస్టోఫర్ స్టాన్లీ, సాయి చరణ్4:50
3."సూయా సూయా"రామజోగయ్య శాస్త్రిఅనురాగ్ కులకర్ణి, సుమ కనకాల4:03
4."నా బి సి సెంటర్లో"భాస్కరభట్ల రవికుమార్నాకాష్ అజిజ్, షర్మిల, అంతర4:16
5."భజరంగబలి"రామజోగయ్య శాస్త్రియంఎల్.ఆర్ కార్తికేయన్, నవీన్ మాధవ్, శ్రీకృష్ణ, ఆదిత్య ల్యెంగర్, శరత్ సంతోష్, హైమత్, అరుణ్4:46
మొత్తం నిడివి:22:18

మూలాలు

[మార్చు]
  1. "Winner (Sai Dharam Tej's New Film)". The Times of India.
  2. "Rakul and Sai Dharam Tej start shooting for next"
  3. "Dharam Tej-Gopichand Malineni film kicks off"". Archived from the original on 2019-08-23. Retrieved 2019-08-23.

ఇతర లంకెలు

[మార్చు]