కారుమంచి రఘు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రఘు కారుమంచి
RaghuKarumanchi.jpg
జననంరఘు కారుమంచి
హైదరాబాదు
నివాసంహైదరాబాదు
చదువుఎంబీయే
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు2002 - ప్రస్తుతం

కారుమంచి రఘు ఒక తెలుగు సినీ హాస్యనటుడు. 150 కి పైగా సినిమాల్లో నటించాడు.[1][2][3]టీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ హాస్యకార్యక్రమంలో రోలర్ రఘు అనే పేరుతో ఒక బృందాన్ని నడిపాడు.

రఘు 2002 లో వి.వి. వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు.[4] అదుర్స్ సినిమా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.[2]

జీవితం[మార్చు]

రఘు వాళ్ళ స్వస్థలం తెనాలి. అతను హైదరాబాదులో పుట్టి పెరిగాడు. తండ్రి మాజీ సైనికాధికారి. తల్లి గృహిణి. రఘు ఎంబీఎ పూర్తి చేసిన తరువాత కొద్ది రోజులు ఓ సాఫ్టువేరు కంపెనీలో పనిచేశాడు. రఘుకు ఇద్దరు పిల్లలున్నారు.[2]

కెరీర్[మార్చు]

వి. వి. వినాయక్ మరియు సురేందర్ రెడ్డి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పటి నుంచి రఘుకు మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ రఘును సినీ పరిశ్రమలోకి ఆహ్వానించారు. రఘు కూడా నటనా రంగం వైపు ఆసక్తితో వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించాడు. రఘుకు జూనియర్ ఎన్టీఆర్తో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది.

సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Raghu Karumanchi". maastars.com. Movie Artists Association. Retrieved 18 September 2016.
  2. 2.0 2.1 2.2 "Interview : Raghu Karumanchi – My role in Adhurs was career defining". 123telugu.com. Mallemala Entertainments. Retrieved 18 September 2016.
  3. "Telugu Movie Actor Raghu Karumanchi". nettv4u.com. Retrieved 18 September 2016.
  4. GV. "Comedian Raghu Karumanchi new films". idlebrain.com. Retrieved 18 September 2016.
  5. సాక్షి, సినిమా (7 September 2018). "'సిల్లీ ఫెలోస్‌‌' మూవీ రివ్యూ". మూలం నుండి 7 September 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 6 June 2019. Cite news requires |newspaper= (help)