జబర్దస్త్ (హాస్య ప్రదర్శన)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"జబర్‌దస్త్ "
వర్గంహాస్య ప్రదర్శన
మూల కేంద్రమైన దేశంభారతదేశం
వాస్తవ భాషలుతెలుగు
నిర్మాణం
ప్రదేశములుహైదరాబాదు (filming location)
మొత్తం కాల వ్యవధి90 నిమిషాలు (per episode) every thursday- 9:30 pm to 11:00 pm IST
ప్రసారం
వాస్తవ ప్రసార ఛానల్ఈటీవి
చిత్ర రకం480i
External links
Website

జబర్‌దస్త్ ఈ టీవీలో ప్రసార మయ్యే ఒక హాస్య ప్రదర్శన (కామెడీ షో). ఇది భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ప్రజాదరణ పొందిన కార్యక్రమం.[1] ఈ షోను మొదట ఈటీవీలో ఫిబ్రవరి 7, 2013 న ప్రారంభించారు.

f న్యాయనిర్ణేతలుగా ప్రముఖ తెలుగు సినిమా నటులు ఐన నాగేంద్రబాబు మరియు రోజా సెల్వమణిలు నిర్వహిస్తున్నారు.[1]

ఎపిసోడ్ భావనలు[మార్చు]

ఈ ఎపిసోడ్ ప్రాథమికంగా మూడు వివిధ జట్ల మధ్య జరిగే పోటీ. ఆ తర్వాత యిది ఐదు టీముల మధ్య హాస్య ప్రదర్శనలు నిర్వహించే కార్యక్రమంగా మారింది. ఈ షో చివర్లో అన్ని టీములు వారి ప్రదర్శనా విధానాన్ని బట్టి పది పాయింట్లకు గానూ వారు పొందే పాయింట్ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఈ పాయింట్లు న్యాయనిర్ణేతలు నిర్దేశిస్తారు. చివర్లో న్యాయనిర్ణేతలు నిర్ణయించిన టీం నకు 10,000 రూపాయలు నగదు బహుమతిని అందజేస్తు వారు ప్రదర్శించిన స్కిట్ లో ఒక సన్నివేశం గల పోస్టరును ఈ వారం పోస్టరుగా నిర్ణయిస్తారు.

ఈ కామెడీ స్కిట్ ల చివర్లో అన్ని జట్ల నాయకులు ఒక జోకును చెప్పాలి. అందులో మంచి జోకును న్యాయనిర్ణేతలు నిర్ణయించి ఆ వర్గ నాయకునకు 10,000 రూపాయల బహుమతిని కూడా యిస్తారు.

పాత జట్లు (7 ఫిబ్రవరి 2013 నుండి 15 ఆగస్టు 2013)[మార్చు]

 1. వేణు వండర్స్ కు నేతృత్వం వహిస్తున్న హాస్యనటుడు "వేణు" [2]
 2. ధనాధన్ ధనరాజ్ కు నేతృత్వం వహిస్తున్న హాస్యనటుడు ధనరాజ్
 3. చమ్మక్ చంద్ర కు నేతృత్వం వహిస్తున్న హాస్యనటుడు "చంద్ర".
 4. రాకెట్ రాఘవ కు నేతృత్వం వహిస్తున్న హాస్యనటుడు "రాఘవ".
 5. రోలర్ రఘు కు నేతృత్వం వహిస్తున్న హాస్యనటుడు "రఘు"
 6. చలాకీ చంటి కు నేతృత్వం వహిస్తున్న హాస్యనటుడు "చంటి".

పాత జట్లు (22 ఆగస్టు 2013 నుండి 8 మే 2014 )[మార్చు]

 1. షకలక శంకర్ కు నేతృత్వం వహిస్తున్న హాస్యనటుడు "శంకర్" .
 2. సుడిగాలి సుధీర్ కు నేతృత్వం వహిస్తున్న హాస్యనటుడు "సుధీర్"
 3. అదిరే అభినయ్ కు నేతృత్వం వహిస్తున్న హాస్యనటుడు మరియు వ్యాఖ్యాత "అభినయ్"
 4. రాకెట్ రాఘవ కు నేతృత్వం వహిస్తున్న హాస్యనటుడు "రాఘవ".
 5. రచ్చ రవి కు నేతృత్వం వహిస్తున్న హాస్యనటుడు "రవి"

(9 అక్టోబరు 2014 నుండి 2016 వరకు )[మార్చు]

 1. రాకెట్ రాఘవ జట్టుకు నేతృత్వం వహిస్తున్న నాయకుడు "రాఘవ"
 2. షేకింగ్ శేషు జట్టుకు నేతృత్వం వహిస్తున్న నాయకుడు "శేషు" .
 3. ధనాధన్ ధనరాజ్ కు నేతృత్వం వహిస్తున్న హాస్యనటుడు ధనరాజ్
 4. వేణు వండర్స్ కు నేతృత్వం వహిస్తున్న హాస్యనటుడు "వేణు" [2]
 5. అల్లరి హరీష్ జట్టుకు నేతృత్వం వహిస్తున్న నాయకుడు "హరీష్"

న్యాయనిర్ణేతలు[మార్చు]

ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలుగా ప్రముఖ తెలుగు సినిమా నటులు ఐన నాగేంద్రబాబు మరియు రోజా సెల్వమణిలు నిర్వహిస్తున్నారు.

సాంకేతిక వర్గం[మార్చు]

==అత్యధిక విజేతలు==sudigali sudheer multi talented person

వివాదాలు[మార్చు]

 • జబర్దస్త్ హాస్యప్రదర్శనల్లో వేణు వండర్స్ టీంలీడర్ వేణు ఒక లఘుహాస్యనాటిక (స్కిట్)లో శ్రామిక గౌడ మహిళాజీవనవిధానాన్ని అవమానపరిచారంటూ పోలీస్ కేసు నమోదైంది. ఈ వివాదం నడుస్తూండగానే వేణుపై దాడిజరిగింది. ఆ దాడిపై అంతటా నిరసనలు, వేణుకు సోషల్ మీడియాలో కొందరు సినీ పెద్దల నుంచి సామాన్యుల వరకూ సమర్థనలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంలో వేణుపై దాడిచేశారని భావిస్తున్న కొందరు వ్యక్తులపై కూడా కేసు నమోదైంది.[3]
 • 2014 అక్టోబరు 30న ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో బ్రాహ్మణ పాత్రలతో మద్యం సేవిస్తున్నట్టుగా చూపిన సన్నివేశాలు కూడా వివాదాస్పదమయ్యాయి. తిమ్మాపూర్‌కు చెందిన కేతిరెడ్డి అంజిరెడ్డి ఈ విషయంపై కోర్టులో కేసు వేయడంతో కోర్టు సదరు లఘుహాస్యనాటికలో పాల్గొన్న నటులపై, న్యాయనిర్ణేతలపై కేసు నమోదుచేసి విచారించాలని కోర్టు ఆదేశించింది.[4]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 "Extra Jabardasth Comedy Show 26th December 2014". www.aptoday.com. AP TODAY. Retrieved 14 January 2015.
 2. 2.0 2.1 "wonders-venu"
 3. "జబర్దస్త్ వేణుపై కేసు నమోదు". జగతి మీడియా పబ్లికేషన్స్. సాక్షి. డిసెంబర్ 21, 2014. Retrieved 14 January 2015. Cite news requires |newspaper= (help); Check date values in: |date= (help)
 4. "జబర్దస్త్ పై మరో వివాదం". నేటి తెలుగు. నేటి తెలుగు. Retrieved 14 January 2015.

ఇతర లింకులు[మార్చు]