అదిరే అభి
అదిరే అభి | |
---|---|
జననం | హరికృష్ణ కామారెడ్డి, తెలంగాణ, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | అభినయ కృష్ణ |
వృత్తి | నటుడు, వ్యాఖ్యాత |
క్రియాశీల సంవత్సరాలు | 2002-ప్రస్తుతం |
Notable work | జబర్దస్త్ |
అదిరే అభి (అభినయ కృష్ణ) తెలుగు సినిమా, టివి నటుడు. 2002లో ఈశ్వర్ సినిమాలో తొలిసారిగా నటించిన అభి, ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ హాస్య కార్యక్రమంతో గుర్తింపు పొందాడు.[1]
జీవిత విషయాలు[మార్చు]
అభి తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డిలో జన్మించాడు. డెలాయిట్ ఎయిర్స్ ఇండియా (సాప్ సెక్యూరిటీ కన్సల్టెంట్) లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు.
కళారంగం[మార్చు]
కొరియోగ్రాఫర్, ఇమిటేషన్ డాన్సర్ రవీంద్రభారతిలో ప్రదర్శనలు చేసిన అభికి ఈశ్వర్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అభి ప్రదర్శన చూసిన డాక్టర్ సి. నారాయణ రెడ్డి, "మీలాంటి వ్యక్తికి మీ ప్రతిభను ప్రతిబింబించే పేరు ఉండాలి" అని అభినయ కృష్ణగా పేరు మార్చాడు.
కలేనియల్ కజిన్స్ లెజ్ లూయిస్, ఇండి పాప్ సింగర్ అనామిక, ఎం.ఎంశ్రీలేఖ, సంగం సినిమా అవార్డులు వంటి కార్యక్రమాలలో (భారతదేశంలోనే కాకుండా షార్జా, సింగపూర్ వంటి దేశాలలో) దాదాపు 1500 ప్రదర్శనలు ఇచ్చాడు.
సినిమారంగం[మార్చు]
2002లో జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ప్రభాస్ తొలిచిత్రం ఈశ్వర్ సినిమాలో హీరో ఫ్రెండ్‌గా తొలిసారిగా నటించాడు. ఆ తరువాత విష్ణు, విద్యార్థి, గౌతమ్ ఎస్.ఎస్.సి., ఈగ మొదలైన చిత్రాలలో నటించాడు. బాహుబలి 2 సినిమాకు దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు.[2]
నటించిన సినిమాలు[మార్చు]
సంవత్సరం | సినిమా | పాత్ర |
---|---|---|
2002 | ఈశ్వర్ | అభి |
2003 | విష్ణు | కృష్ణ |
ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు | ||
2004 | విద్యార్ధి | అభినయ |
2005 | గౌతమ్ ఎస్.ఎస్.సి. | అభి |
ప్రేమికులు | ||
2012 | ఈగ | |
2017 | రాగల 24 గంటల్లో | |
2010 | మా నాన్న చిరంజీవి |
టివిరంగం[మార్చు]
ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ హాస్య కార్యక్రమంలో అదిరే అభి బృందం ప్రదర్శనలు ఇస్తోంది.[3] ఈ కార్యక్రమం అభికి మంచి గుర్తింపును ఇచ్చింది. హూ వాంట్స్ టు బి ఎ మిల్లియనీర్ కార్యక్రమం తెలుగు వెర్షన్ అక్కినేని నాగార్జున సారథ్యం వహించిన మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంకి క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేశాడు.[4] ప్రస్తుతం అభి పలు ఛానళ్ళో యాంకర్‌గా, డాన్సర్‌గా, స్టాండ్-అప్ కమెడియన్‌గా రాణిస్తున్నాడు.
వ్యాఖ్యాతగా
- సూపర్ డూపర్, మహా మహా మాస్, మహా మహా మాస్ 2, యమహో, అదుర్స్-2 (ఈటివి)
- ఛాంపియన్స్ (జెమినీ టీవీ)
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ Chelluri, Sriram (17 May 2018). "Comedian Abhinaya Krishna of Jabardast fame to make his directorial debut soon - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-08-30.
- ↑ TNN (29 April 2016). "Adhire Abhi spotted at Australian Parliament house - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-08-30.
- ↑ Karamchetu, Abhyudaya (31 July 2016). "A Jabardast career". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-08-30.
- ↑ "Adhire Abhi". timesofindia.indiatimes.com. Retrieved 2020-08-30.