ఈగ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈగ
(2012 తెలుగు సినిమా)
Eega Poster.jpg
దర్శకత్వం ఎస్.ఎస్. రాజమౌళి
నిర్మాణం సాయి కొర్రపాటి
కథ ఎస్.ఎస్.రాజమౌళి
తారాగణం సుదీప్
నాని
సమంత
తాగుబోతు రమేశ్
సంగీతం ఎం.ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, వారాహి చలన చిత్రం, మకుట గ్రాఫిక్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ఈగ. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులు. ఎం. ఎం. కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 6, 2012 న విడుదలై భారీ విజయాన్ని సాధించింది.

కథ[మార్చు]

బిందు (సమంత) వాళ్ళ ఎదురింటిలో నివసిస్తూ ఉంటాడు నాని (నాని), అంతేకాకుండా రెండు సంవత్సరాల నుంచి నాని బిందుని ప్రేమిస్తూ ఉంటాడు. బిందు సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ 511 అనే ఎన్జీవో సంస్థని నడుపుతూ అందులో తను కూడా ఒక సోషల్ వర్కర్ గా పనిచేస్తూ ఉంటుంది. బిందు కూడా నానిని ప్రేమిస్తుంది కానీ చెప్పకుండా తనే తెలుసుకోవాలని తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటుంది. ఇంతలో బిందు నడిపే ఎన్జీవో సంస్థకి సహాయం చేసే గొప్ప ధనికుని పాత్రలో పరిచయమైన సుదీప్ (సుదీప్) బిందుని ఇష్టపడతాడు.

సుదీప్ చాలా క్రూరమైన స్వభావం కలవాడు, తన అవసరానికి ఇతరులను చంపడానికి కూడా వెనుకాడడు. నాని బిందుని ప్రేమిస్తున్నాడని సుదీప్ కి తెలియగానే నానిని అతి కిరాతకంగా చంపేస్తాడు. చనిపోయిన నానినే మళ్ళీ ఈగగా పుడతాడు. అలా జన్మించిన ఈగ తనే నాని అని బిందుకి ఎలా తెలియజేసింది, తనను చంపిన సుదీప్ మీద ఎలా పగ తీర్చుకుందనేదే మిగిలిన చిత్రం.

తారాగణం[మార్చు]

  • నానిగా నాని
  • బిందుగా సమంత
  • సుదీప్ గా సుదీప్
  • కళగా హంసా నందిని
  • బిందు వదినగా దేవదర్శిని
  • సుదీప్ స్నేహితుడిగా ఆదిత్య
  • మాంత్రికుడు తంత్రగా అభిరాం

పురస్కారాలు[మార్చు]

సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
2012 నంది పురస్కారాలు[1] ఉత్తమ చిత్రం సాయి కొర్రపాటి విజేత
2012 నంది పురస్కారాలు ఉత్తమ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి విజేత
2012 నంది పురస్కారాలు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత ఎస్.ఎస్.రాజమౌళి విజేత
2012 నంది పురస్కారాలు ఉత్తమ విలన్ సుదీప్ విజేత
2012 నంది పురస్కారాలు ఉత్తమ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు విజేత
2012 నంది పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రహణం సెంథిల్ కుమార్ విజేత

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Nandi Awards 2012, 2013 : Winners List". Gulte.com. Retrieved 19 January 2018.