హంసా నందిని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హంసా నందిని
హంసా నందిని
జననంపూనం బర్టాకే
పూణే, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తినటి, మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2004–ప్రస్తుతం

హంసా నందిని తెలుగు సినీనటి, మోడల్, డ్యాన్సర్.

మా స్టార్స్ పత్రికకు, సెలబ్రిటీ క్రికెట్ లీగ్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ 2011,2013లకు ప్రచారకర్తగా చేశారు. మరాటీ కుటుంబం నుండి వచ్చింది. హంసా నందిని అసలు పేరు పూనం. అనుమానాస్పదం సినిమా సమయంలో దర్శకుడు వంశీ హంసా నందినిగా మార్చారు. 2014లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన చారిత్రక సినిమా రుద్రమదేవి సినిమాలో మదనిక పాత్రలో కనిపించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

హంసా నందిని పూనేలో పుట్టి, పెరిగింది. మోడలింగ్ చేయడంకోసం ముంబైకి వచ్చింది. 2002 నుంచి మోడలింగ్ రంగంలో ఉంటూ, పలు టెలివిజన్ ప్రకటనలలో నటించింది. ఆమె కామర్స్ లో డిగ్రీ పూర్తిచేసిన హంసా నందిని 2009 లో హ్యూమన్ రిసోర్స్ కోర్స్ లో చేరింది.

2013 లో మిర్చి, భాయి, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాలలో ప్రత్యేక గీతాలలో నటించింది.

2021 లో తాను రొమ్ము క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డట్లు తెలిపింది. ఇందుకోసం ఈమె శస్త్రచికిత్స చేయించుకుంది. జన్యుపరంగా ఆ వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉండటంతో ఇంకా మరిన్ని శస్త్రచికిత్సలు, కీమోథెరపీ చికిత్సలు చేయించుకున్నట్లు తెలిపింది. ఈమె తల్లి కూడా 2003 లో క్యాన్సర్ వ్యాధితోనే మరణించింది.[1]

క్యాన్సర్ ని జయించిన హంసా నందిని తిరిగి సెట్‌ లో 2022 డిసెంబరు 7న అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె సినిమాలపై దృష్టి పెట్టింది.[2]

చిత్ర సమహారం

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాష ఇతర వివరాలు
2004 ఒకటవుదాం తెలుగు
2005 786 (ఖైదీ ప్రమకథ) రోషిణి తెలుగు పూనం బర్టాకే
2006 మోహిని 9886788888 మోహిని కన్నడ
2006 కార్పొరేట్ హిందీ పూనం బర్టాకే
2007 అనుమానాస్పదం దేవిక తెలుగు
2008 గీత హంసా తెలుగు
2009 అధినేత హంసా తెలుగు
2009 ప్రవరాఖ్యుడు తెలుగు
2011 అహా నా పెళ్లంటా తెలుగు
2012 నా ఇష్టం తెలుగు అతిథి పాత్ర
2012 ఈగ కళ తెలుగు అతిథి పాత్ర
2012 నాన్-ఇ తమిళ
2013 మిర్చి తెలుగు టైటిల్ సాంగ్
2013 భాయ్[3] తెలుగు అతిథి పాత్ర
2013 రామయ్యా వస్తావయ్యా తెలుగు అతిథి పాత్ర
2013 అత్తారింటికి దారేది తెలుగు ప్రత్యేక గీతం
2014 లెజెండ్ తెలుగు ప్రత్యేక గీతం
2014 లౌక్యం[4] హంస సిప్పీ తెలుగు
2014 రియల్ స్టార్ తెలుగు
2015 రుద్రమదేవి[5] మదనిక తెలుగు
2015 సోగ్గాడే చిన్నినయనా తెలుగు
2015 బెంగాల్ టైగర్ తెలుగు అతిథి పాత్ర
2016 శ్రీరస్తు శుభమస్తు[6] తెలుగు అతిథి పాత్ర

మూలాలు

[మార్చు]
  1. "Hamsa Nandini: సినీనటి హంసానందినికి క్యాన్సర్‌ - telugu news actress hamsa nandini fights with cancer diagnosis". www.eenadu.net. Retrieved 2021-12-20.
  2. "Hamsa nandini: ఇది నాకు పునర్జన్మ! | Hamsanandini is back avm". web.archive.org. 2022-12-08. Archived from the original on 2022-12-08. Retrieved 2022-12-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. 123తెలుగు.కాం, సినిమా వార్తలు. "ఐటెం సాంగ్స్ చేయడం ఆషామాషీ కాదు – హంసా నందిని". www.123telugu.com. Retrieved 21 September 2016.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. 123తెలుగు.కాం, సినిమా వార్తలు. "గోపీచంద్ మూవీలో హంసా నందిని స్పెషల్ సాంగ్". www.123telugu.com. Retrieved 21 September 2016.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. స్పైస్ ఆంధ్రా, టీ2బీ. "మదనికగా హంసా నందిని". spiceandhra.com. Retrieved 21 September 2016.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]
  6. ఆంధ్రావిల్లాస్, సినిమా వార్తలు. "అల్లు శిరీష్ మూవీ స్పెషల్ సాంగ్ లో హంసా నందిని". www.andhravilas.net. Archived from the original on 9 మే 2017. Retrieved 21 September 2016.