రాంగ్ గోపాల్ వర్మ
స్వరూపం
రాంగ్ గోపాల్ వర్మ | |
---|---|
దర్శకత్వం | ప్రభు |
స్క్రీన్ ప్లే | ప్రభు |
కథ | ప్రభు |
నిర్మాత | ప్రభు |
తారాగణం | షకలక శంకర్ కత్తి మహేష్ అదిరే అభి ప్రభు |
ఛాయాగ్రహణం | బాబు |
కూర్పు | అవినాష్ |
సంగీతం | ర్యాప్ రాక్ షకీల్ |
నిర్మాణ సంస్థ | డేర్ ఆర్ డై క్రియేషన్స్ |
విడుదల తేదీ | 4 డిసెంబర్ 2020 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రాంగ్ గోపాల్ వర్మ 2020లో విడుదలైన తెలుగు సినిమా. మాస్టర్ దృవంశ్ సమర్పణలో డేర్ ఆర్ డై క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభు నిర్మించి దర్శకత్వం వహించాడు.[1] షకలక శంకర్,కత్తి మహేష్, అదిరే అభి, ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 4న విడుదలైంది.[2]
కథ
[మార్చు]రాజ్ గోపాల్ వర్మ (షకలక శంకర్) స్పూర్తితో దర్శకుడు కావాలనే కోరికతో (కత్తి మహేష్) శిష్యరికం చేస్తుంటాడు. అయితే తన గురించి వచ్చిన ఓ ప్రతికూల కథనాన్ని తన శిష్యుడు (కత్తి మహేష్) ఫోన్ లో చూస్తుండగా గమనించిన రాజ్ గోపాల్ వర్మ కోపగించుకొని తన వద్ద ఉండటానికి వీలులేదని బయటకు పంపిస్తాడు. రాజ్ గోపాల్ వర్మకు శిష్యుడు ఏ రకమైన శాపాలు పెడుతాడు? రాంగోపాల్ వర్మ జీవితంలోకి ప్రవేశించిదెవరు? ఇంతకు రాజ్ గోపాల్ వర్మకు తాను చేసే పనుల గురించి రియలైజ్ అయ్యారా? అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]- షకలక శంకర్
- కత్తి మహేష్
- అదిరే అభి
- ధీరజ్ అప్పాజీ
- రాధాకృష్ణ
- రాజబాబు
- వీర్ని శ్రీనివాస్
- రాజేష్ మన్నే
- అల్ రౌండర్ రవి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: డేర్ ఆర్ డై క్రియేషన్స్
- నిర్మాత, పాటలు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రభు
- సంగీతం: ర్యాప్ రాక్ షకీల్
- సినిమాటోగ్రఫీ: బాబు
- ఎడిటర్: అవినాష్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (22 August 2020). "రాంగ్ గోపాల్ వర్మ". Archived from the original on 2020-09-19. Retrieved 24 November 2021.
- ↑ Hmtv (24 November 2020). "శ్రేయాస్ ఎటిటి ద్వారా డిసెంబర్ 4న 'రాంగ్ గోపాల్ వర్మ'". Archived from the original on 2020-11-24. Retrieved 24 November 2021.
- ↑ Sakshi (5 December 2020). "అగ్ర దర్శకుడికి బేతాళప్రశ్న!". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.