కత్తి మహేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహేష్ కుమార్ కత్తి
మాతృభాషలో పేరుకత్తి మహేష్ కుమార్
జననంకత్తి మహేష్ కుమార్[1]
చిత్తూరు, ఆంధ్రప్రదేశ్ , భారతదేశం
నివాసంహైదరాబాదు, తెలంగాణ,
జాతీయతభారతీయుడు
పౌరసత్వంభారతీయుడు
చదువుసినిమా విమర్శకుడు[1]
విద్యాసంస్థలుహైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ[1]
వృత్తి
 • విమర్శకుడు
 • నటుడు
 • రచయిత
 • దర్శకుడు
ప్రసిద్ధులుసినిమా విమర్శకుడు
Styleపేరలల్ సినీమా
స్వస్థలంచిత్తూరు జిల్లా

కత్తి మహేష్ తెలుగు చలనచిత్ర రంగంలో ఒక నటుడు, సినీ విమర్శకుడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుండి ఫిలిం థియరీ లో పట్టభద్రుడు.

2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ఊరు చివర ఇల్లు కథను ఆధారంగా చేసుకొని ఒక షార్ట్ ఫిలింకి దర్శకత్వం చేశాడు[2]. మిణుగురులు అనే చిత్రానికి సహ-రచయితగా వ్యవహరించాడు[3][4]. పెసరట్టు (సినిమా) అనే సినిమా క్రౌడ్ ఫండింగ్ ఆధారంగా నిర్మాణానికి అవసరమయ్యే డబ్బు సమకూర్చుకుని తీశాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.[5]. హృదయ కాలేయం లో ఓ చిన్న పాత్ర పోషించారు.

వివాదాలు[మార్చు]

 • పలు ప్రసార మాధ్యమాలలో సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తూ మహేష్ దుమారం రేపారు. [6] . దాదాపు అన్ని ప్రసార మాధ్యమాలలో మహేష్ పవన్ కళ్యాణ్ సినీ, రాజకీయ, వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేస్తూ సంచలనానికి కేంద్రం అయ్యాడు[7]. పవన్ అభిమానులు దీనిని తీవ్రంగా నిరసించారు. కొందరు ఇతని పై భౌతికంగా దాడి చేయటానికి ప్రయత్నించారు. కథ శృతిమించి పాకాన పడటంతో, ఈ ఘట్టానికి చరమగీతం పాడాలని సాధారణ ప్రజానీకం, సినీ పండితులు అభిప్రాయపడ్డారు. తాను మౌనంగా ఉన్నా, పవన్ అభిమానులు తనను రెచ్చగొడుతూనే ఉన్నారని కోన వెంకట్ ను ఉద్దేశించి మహేష్ ట్వీట్ చేశారు. సమాధానంగా వెంకట్, దురదృష్టవశాత్తూ తాను చెప్పిన తర్వాత కూడా మహేష్ తన విమర్శలను ఆపలేకపోయారని వెంకట్ సమాధానం ఇచ్చారు. [8]
 • ఓ న్యూస్ ఛానల్ లో జరిగిన డిబేట్ లో కత్తి మహేష్ పాల్గొొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఫోన్ లో తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు[9].కత్తి మహేష్ వ్యాఖ్యలతో ఆగ్రహంచారు జనశక్తి నేతలు. ఆయనపై కేజీహ్ బీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సమాజంలో ఓ వర్గం వారి మనోభావాలను దెబ్బ తీస్తుండటంతో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందు జాగ్రత్తగా హైదరాబాద్‌ పోలీసులు అతనికి ఆరు నెలలపాటు హైదరాబాదు నగర బహిష్కరణ విధించారు[10]. కత్తి మహే్‌షను చిత్తూరులోని అతని స్వస్థలానికి తరలించారు. శ్రీరాముడిపై కత్తి మహేశ్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీపీఠం అధిపతి సాధూ పరిపూర్ణానంద పాదయాత్ర తలపెట్టడంతో ఉద్రిక్తతలు తలెత్తుతాయని అనుమానించిన డీజీపీ కత్తిపై బహిష్కరణ వేటు వేశారు.[11]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 Y. Sunita Chowdhary, Vying for alternate existence, The Hindu, January 2012.[1]
 2. "'Telugu cinema never expanded into meaningful cinema' - Rediff.com Movies". Rediff.com. 2015-02-06. Retrieved 2017-01-08.
 3. "Minugurulu Grabs Best Indian Film CIICFF - Telugu Movie News". Indiaglitz.com. 2014-01-25. Retrieved 2017-01-08.
 4. "Minugurulu in Oscar contenders list - Telugu Movie News". Indiaglitz.com. 2014-12-26. Retrieved 2017-01-08.
 5. "Pesarattu Movie Review, Rating - Nikitha Narayanan, Nandu". All India Roundup. 2015-02-06. Archived from the original on 2016-12-20. Retrieved 2017-01-08.
 6. పవన్ కళ్యాణ్ సినీ నటుల ఇంట పుట్టినందుకే స్టార్ అయ్యాడు - కత్తి మహేష్
 7. మీడియా ముఖంగా నటి పూనం కౌర్ కు ప్రశ్నాస్త్రాలను సంధించిన కత్తి
 8. "కత్తి మహేష్ ట్విట్టర్ వార్". Archived from the original on 2018-01-23. Retrieved 2018-01-18.
 9. "రాముడు ఒక దగుల్బాజీ.. సీత రావణాసురుడితోనే ఉంటే బాగుండేది..!: కత్తి మహేష్ పై కేసు నమోదు".[permanent dead link]
 10. "Six months externment for controversial film critic Katti Ma ."
 11. "కత్తి మహేష్‌ బహిష్కరణ".[permanent dead link]

ఇతర లింకులు[మార్చు]