Jump to content

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు

వికీపీడియా నుండి
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు
సినిమా పోస్టర్
దర్శకత్వంరామ్ గోపాల్ వర్మ
రచనరామ్ గోపాల్ వర్మ
కరుణ్ వెంకట్
నిర్మాతఅజయ్ మైసూర్
తారాగణంఆజ్మల్ అమీర్
ఛాయాగ్రహణంసురేష్ వర్మ
కూర్పుఅన్వర్ ఆలీ
సంగీతంరవి శంకర్
నిర్మాణ
సంస్థలు
టైగర్ ప్రొడక్షన్
కంపెనీ ప్రొడక్షన్
విడుదల తేదీs
12 డిసెంబరు, 2019
దేశంభారతదేశం
భాషతెలుగు

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు[1] 2019, డిసెంబరు 12 విడుదలైన రాజకీయ నేపథ్య తెలుగు చలనచిత్రం.[2] అజయ్ మైసూర్ నిర్మాణసారథ్యంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆజ్మల్ అమీర్, బ్రహ్మానందం, ఆలీ తదితరులు నటించగా, రవి శంకర్ సంగీతం అందించాడు[3]


2019 జరిగిన ఎన్నికల్లో వెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోతుంది. ఆర్‌సీపీ పార్టీ ఘనవిజయం పొందడంతో ఆ పార్టీ అధినేత వీఎస్‌ జనార్థన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తాడు. ఈ పరిణామాలతో వెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీముఖ్యమంత్రి బాబు, అతని కుమారుడు చినబాబు తీవ్ర మనోవ్యధకు గురై, వీఎస్‌ జనార్థన్‌రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పన్నగాలు వేస్తుంటారు. ఈ నేపథ్యంలో బాబుకు కుడిభుజంగా ఉంటూ వ్యూహరచనలో పాలుపంచుకునే దయనేని రమ హత్య జరగడంతో రాష్ట్రంలో గొడవలు చెలరేగుతాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం ఏపీలో రాష్ట్రపతి పాలన విధించి మధ్యంతర ఎన్నికలకు ఏర్పాటు చేస్తుంది. ఆ తరువాత జరిగిన పరిణామాలేమిటి, దయనేని రమను ఎవరు హత్య చేసారు, ఏపీ రాజకీయాల్లో మనసేన పార్టీ, బీపీ జాన్‌ ప్రపంచశాంతి పార్టీ పోషించిన పాత్రలేమిటి, మధ్యంతర ఎన్నికల్లో ఎవరు గెలిచారు అనేది మిగతా కథ.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
  • నిర్మాత: అజయ్ మైసూర్
  • రచన: రామ్ గోపాల్ వర్మ, కరుణ్ వెంకట్
  • సంగీతం: రవి శంకర్
  • ఛాయాగ్రహణం: సురేష్ వర్మ
  • కూర్పు: అన్వర్ ఆలీ
  • నిర్మాణ సంస్థ: టైగర్ ప్రొడక్షన్, కంపెనీ ప్రొడక్షన్

పాటలు

[మార్చు]
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు
పాటలు by
రవి శంకర్
Released2019
Recorded2019
Genreపాటలు
Producerరవి శంకర్

ఈ చిత్రానికి రవి శంకర్ సంగీతం అందించగా, సిరాశ్రీ పాటలు రాసాడు.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."కమ్మ రాజ్యంలో కడప రెడ్లు"సిరాశ్రీరవి శంకర్04:25
2."కాస్ట్ ఫీలింగ్"సిరాశ్రీరామ్ గోపాల్ వర్మ07:05
3."బాబు చంపేస్తాడు"సిరాశ్రీరామ్ గోపాల్ వర్మ04:44
4."నేనే కెఎ పాల్"సిరాశ్రీరవి శంకర్03:30
5."పప్పులాంటి అబ్బాయి"సిరాశ్రీ 02:47

విడుదల

[మార్చు]

ఈ చిత్రం అసలు పేరు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరులో 2019, నవంబరు 29న విడుదల కావలసివుంది.[2] కానీ సెన్సార్ సమస్య వల్ల విడుదల ఆగిపోయింది.[5] చిత్రం పేరు మార్చి విడుదలచేయాలని తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.[6] సెన్సార్ బోర్డు నుండి అనుమతి రావడంతో 2019, డిసెంబరు 12న సినిమాను విడుదల చేయనున్నట్లు రామ్ గోపాల్ వర్మ తన అధికారిక ట్విట్టర్ పేజీ ద్వారా ప్రకటించాడు.[7]

ప్రచారం

[మార్చు]

ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ 2019, సెప్టెంబరు 7న విడుదల అయింది.[8] 2019, అక్టోబరు 25న పోస్టర్ విడుదలచేసి పాత్రల గురించి, ట్రైలర్ విడుదల తేదీ గురించి చెప్పారు.[9] 2019, అక్టోబరు 27న[10] దీపావళి[11] సందర్భంగా ట్రైలర్ విడుదల చేయబడింది.

స్పందన

[మార్చు]

రేటింగ్

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Ram Gopal Varma's "Kamma Raajyam lo Kadapa Redlu" is now called "Amma Rajyam lo Kadapa Biddalu"". Times of India. 29 November 2019. Retrieved 7 December 2019.
  2. 2.0 2.1 "'Kamma Rajyam Lo Kadapa Reddlu': Release date locked". India Glitz. 10 November 2019. Archived from the original on 11 నవంబరు 2019. Retrieved 24 November 2019.
  3. "Ajmal Amir to star as Jaganmohan Reddy in Ram Gopal Varma film". TimesofIndia. 28 October 2019. Retrieved 24 November 2019.
  4. "Photo: Ali Is Playing Speaker Pammineni RamRam In Kamma Rajyam Lo Kadapa Reddlu". socialnews.xyz. 28 October 2019. Retrieved 24 November 2019.[permanent dead link]
  5. "Kamma Rajyam Lo Kadapa Reddlu postponed due to Censor Issue". Tollywood.net. 29 November 2019. Archived from the original on 2 డిసెంబర్ 2019. Retrieved 7 December 2019. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  6. "Telangana HC puts stay on Ram Gopal Varma's Kamma Rajyam Lo Kadapa Redlu; asks him to change the film's title". Times Now. 29 November 2019. Retrieved 7 December 2019.
  7. "Amma Rajyamlo Kadapa Biddalu Gets Censor Clearance". GreatAndhra. 7 December 2019. Retrieved 7 December 2019.
  8. "Ram Gopal Varma releases the first look poster of Kamma Rajyam lo Kadapa Reddlu". Times of India. 7 September 2019. Retrieved 24 November 2019.
  9. "RGV reveals looks of Pawan Kalyan, Chandrababu Naidu, Jagan Reddy's roles in KRKR before its trailer". ibtimes. 25 October 2019. Retrieved 24 November 2019.
  10. "Kamma Rajyam Lo Kadapa Reddlu Trailer (Video)". socialnews.xyz. 28 October 2019. Retrieved 24 November 2019.
  11. "Kamma Rajyamlo Kadapa Redlu Trailer review". tollywood.net. 27 October 2019. Archived from the original on 28 అక్టోబర్ 2019. Retrieved 24 November 2019. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  12. "Amma Rajyam Lo Kadapa Biddalu Movie Review: Nothing entertaining about AP politics". The Times of India. 12 December 2019. Retrieved 12 December 2019.1.5/5 stars
  13. "Ram Gopal Varma's Amma Rajyam lo Kadapa Biddalu Movie Review & Rating". The Hans India. 12 December 2019. Retrieved 12 December 2019.2/5 stars