సుందరకాండ (2025 సినిమా)
| సుందరకాండ | |
|---|---|
| దర్శకత్వం | వెంకటేష్ నిమ్మలపూడి |
| రచన | |
| స్క్రీన్ ప్లే | వెంకటేష్ నిమ్మలపూడి |
| నిర్మాత |
|
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | ప్రదీష్ ఎం వర్మ |
| కూర్పు | రోహన్ చిల్లాలే |
| సంగీతం | లియోన్ జేమ్స్ |
నిర్మాణ సంస్థ | సందీప్ పిక్చర్ ప్యాలెస్ |
విడుదల తేదీ | 2025 ఆగస్ట్ 27 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
సుందరకాండ 2025లో విడుదలైన తెలుగు సినిమా.[1] సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన ఈ సినిమాకు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించాడు. నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 26న విడుదల చేశారు.[2]
సుందరకాండ సినిమాను 2025 ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదల చేయగా,[3] సెప్టెంబర్ 23 నుండి జియో హాట్‌స్టార్ ఓటీటీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]
కథ
[మార్చు]సిద్ధార్థ్ (నారా రోహిత్) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, నలభై ఏళ్ల వయసొచ్చిన తనకు నచ్చే క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరకలేదంటూ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. స్కూల్ డేస్‌లో వైష్ణవిని (శ్రీదేవి విజయ్‌కుమార్) ఇష్టపడతాడు. ఆమె మరొకరిని పెళ్లిచేసుకొని సిద్ధార్థ్‌కు దూరమవుతుంది. ఆ తర్వాత ఎయిర్ పోర్టులో పరిచయమైన ఐరా (వృతి వాఘాని)లో ఇష్టపడి పెళ్లిచేసుకోవాలని అనుకుంటాడు. అప్పుడే ఐరాకు, వైష్ణవికి సంబంధం ఉందనే షాకింగ్ న్యూస్ సిద్ధార్థ్‌కు తెలుస్తుంది? సిద్ధూ పెళ్లికి వచ్చిన అడ్డంకులు ఏమిటి ? సిద్ధార్థ్ తల్లిదండ్రులు (నరేష్, రూప లక్ష్మి), అక్క (వాసుకి),స్నేహితులు (సత్య, సునైనా, అభినవ్ గోమఠం) ఎటువంటి సాయం చేశారు? చివరకు ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సందీప్ పిక్చర్ ప్యాలెస్
- నిర్మాత: సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకటేష్ నిమ్మలపూడి
- సంగీతం: లియోన్ జేమ్స్
- సినిమాటోగ్రఫీ: ప్రదీష్ ఎం వర్మ
- ఎడిటర్: రోహన్ చిల్లాలే
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్
- ఆర్ట్ డైరెక్టర్: రాజేష్ పెంటకోట
- పాటలు: శ్రీ హర్ష ఈమని
- కాస్ట్యూమ్ డిజైనర్లు: హర్ష & పూజిత తాడికొండ
- ఫైట్స్: పృథ్వీ మాస్టర్
పాటలు
[మార్చు]అన్ని పాటలను శ్రీ హర్ష ఎమానీ రాశారు; సంగీతాన్ని లియోన్ జేమ్స్ స్వరపరిచాడు
| సం. | పాట | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|
| 1. | "బహుశ బాహుశ" | సిద్ శ్రీరామ్ | 5:09 |
| 2. | "హమ్మయ్య[6]" | లియోన్ జేమ్స్, రామ్ మిర్యాల | 3:51 |
| 3. | "ప్లీజ్ ప్లీజ్ మేడమ్" | అర్జున్ చాందీ, దీపక్ బ్లూ, అరవింద్ శ్రీనివాస్, సాయి శరణ్, రేష్మా శ్యామ్, హరిప్రియ, లవితా లోబో | 4:11 |
| 4. | "ప్రియమైన ఈరా" | 4:11 | |
| 5. | "డియర్ ఈరా రిప్రైజ్" | హరిప్రియ | 2:25 |
మూలాలు
[మార్చు]- ↑ "ప్రేమకథతో సుందరకాండ". Chitrajyothy. 25 July 2024. Archived from the original on 22 September 2025. Retrieved 22 September 2025.
- ↑ "మూలా నక్షత్రంతో నారా రోహిత్ తంటాలు.. హిలేరియస్‌గా 'సుందరకాండ' టీజర్". NT News. 26 August 2024. Archived from the original on 22 September 2025. Retrieved 22 September 2025.
- ↑ "వినోదాల సుందరకాండ". NT News. 26 July 2025. Archived from the original on 26 July 2025. Retrieved 26 July 2025.
- ↑ "సుందరకాండ ఓటీటీ రిలీజ్... ఐదు భాషల్లో నారా రోహిత్ సినిమా స్ట్రీమింగ్... ఎప్పట్నించి అంటే?". ABP Desam. 17 September 2025. Archived from the original on 22 September 2025. Retrieved 22 September 2025.
- ↑ "సుందరకాండ.. సూపర్ హిట్ గ్యారెంటీ : నారా రోహిత్". NTV Telugu. 27 August 2024. Archived from the original on 22 September 2025. Retrieved 22 September 2025.
- ↑ "సుందరకాండ నుంచి ఎనర్జిటిక్ మెలోడీ". Mana Telangana. 11 October 2024. Archived from the original on 22 September 2025. Retrieved 22 September 2025.