దిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిల్
(2003 తెలుగు సినిమా)
Dil telugu Movie.webp
దర్శకత్వం వి.వి.వినాయక్
నిర్మాణం దిల్ రాజు
రచన వి.వి.వినాయక్, చింతపల్లి రమణ
తారాగణం నితిన్,
నేహా బాంబ్,
ప్రకాష్ రాజ్
సంగీతం ఆర్. పి. పట్నాయక్
ఛాయాగ్రహణం విజయ్ సి. కుమార్
కూర్పు గౌతంరాజు
భాష తెలుగు

దిల్ 2003 లో వి. వి. వినాయక్ దర్శకత్వంలో విడుదలైన విజయవంతమైన సినిమా. ఇందులో నితిన్, నేహ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్. పి. పట్నాయక్ సంగీత దర్శకత్వం వహించాడు. దిల్ రాజుకు నిర్మాతగా ఇది మొదటి సినిమా. ఈ సినిమా పేరు ఆయన పేరులో భాగం అయిపోయింది.

కథ[మార్చు]

శీను (నితిన్) మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక కళాశాల విద్యార్థి. తన మామయ్య (వేణుమాధవ్) కూడా అదే కళాశాలలో చదువుకుంటూ ఉంటాడు. అదే కళాశాలలో పేరుమోసిన దాదా గౌరీశంకర్ (ప్రకాష్ రాజ్) కూతురు నందిని (నేహ) కూడా చదువుతుంటుంది. ఒక కళాశాల కార్యక్రమంలో శీను, నందిని కలిసి నృత్యం చేస్తారు. దాన్ని చూసిన గౌరీశంకర్ మనుషులు అతని మీద చేయి చేసుకోబోతే నందిని వారిస్తుంది. కానీ ఆ సంఘటనే శీను నందినిని ప్రేమించేలా చేస్తుంది. వీళ్ళ ప్రేమను గురించి తెలుసుకున్న గౌరీశంకర్ తన కూతురుకు ఉన్నఫళంగా పెళ్ళి చేయాలని చూస్తాడు. కానీ నందిని ఒప్పుకోదు. శీను అడ్డు తొలగించుకోవడం కోసం గౌరీశంకర్ గుడి దగ్గర కలుసుకోమని తన కూతురు రాసినట్లు ఒక లేఖ రాసి శీనుకు పంపిస్తారు. కానీ అది తనను బోల్తా కొట్టించడానికి వేసిన పథకమని తెలుసుకున్న శీను కళాశాల స్నేహితులతో కలిసి ఆ ఎత్తుకు పై ఎత్తు వేస్తాడు. కానీ చిన్న పొరపాటు వల్ల ఆ రౌడీల చేతిలో గాయపడతాడు. చివరికి గౌరీశంకర్ నందినిని నిజాంపేట్ లో ఉంటున్న తన మామ దుర్గా పటేల్ దగ్గరికి పంపిస్తాడు.

శీను తన మామయ్యతో కలిసి ఫోన్ నంబరును పట్టుకుని నందిని ఎక్కడుందో కనిపెడతాడు. ఇద్దరూ కలిసి నిజాంపేట్ వెళతారు. దుర్గా పటేల్ కన్నుగప్పి ఇద్దరూ కలుసుకుంటారు. నందిని ఇద్దరూ కలిసి పారిపోయి పెళ్ళి చేసుకుందామంటుంది కానీ శీను అందరికీ ఒప్పించి తనను పెళ్ళి చేసుకుంటానని మాట ఇస్తాడు.

నటీనటులు[మార్చు]

బాక్సాఫీసు[మార్చు]

  • ఈ సినిమా 91 కేంద్రాలలో 50 రోజులకు పైగా నడిచినది.

పాటలు[మార్చు]

  • సి. ఎం పీ. ఏం కావలన్న ఆశే లేదు
  • ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో
  • తమలపాకు నెమలి సోకు
  • నీ చేతి గాజులు ఘల్లుమన్నవే
  • అమ్మ ఆవు ఇల్లు ఈగ
  • పెద్దలొద్దంటున్నా ప్రేమ తప్పని అన్నా

బయటి లింకులు[మార్చు]

  1. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020. CS1 maint: discouraged parameter (link)
"https://te.wikipedia.org/w/index.php?title=దిల్&oldid=3180251" నుండి వెలికితీశారు