ఆహా నా పెళ్ళంట (2022 వెబ్ సిరీస్)
ఆహా నా పెళ్ళంట | |
---|---|
జానర్ | రొమాన్స్
కామెడీ డ్రామా |
సృష్టికర్త | షేక్ దావూద్ జి, తమాడా మీడియా |
రచయిత | కళ్యాణ్ రాఘవ్ పసుపుల |
ఛాయాగ్రహణం | షేక్ దావూద్ జి |
దర్శకత్వం | సంజీవ్ రెడ్డి |
తారాగణం |
|
సంగీతం | జుడా శాండీ |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | రాహుల్ తమాడా సాయిదీప్ రెడ్డి బొర్రా |
ఛాయాగ్రహణం | నగేష్ బానెల్ లష్కర్ అలీ |
ఎడిటర్ | మధు రెడ్డి |
ప్రొడక్షన్ కంపెనీ | తమాడా మీడియా |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | జీ5 |
ఆహా నా పెళ్ళంట 2022లో విడుదలైన వెబ్ సిరీస్. జీ-5, తమాడా మీడియా బ్యానర్‌లపై సూర్య రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్, ఆమని, హర్షవర్ధన్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ నవంబరు 17న జీ-5 ఓటీటీలో విడుదలైంది.
కథ
[మార్చు]శీను (రాజ్ తరుణ్) స్కూల్‌లో చదివే సమయంలో జరిగిన ఓ సంఘటన వల్ల పెళ్ళయ్యే వరకు హనుమంతుడిలా, పెళ్లి తర్వాత రాముడిలా ఉంటానని తన తల్లితండ్రులకు ఒట్టు వేస్తాడు. శ్రీను పెద్దయ్యాక, పెళ్ళి చేసుకుంటానని చెప్పడంతో వివాహం కుదరగా సరిగ్గా పెళ్ళి రోజున అమ్మాయి కనిపించదు, దీంతో శ్రీను కుటుంబసభ్యుల పరువు పోతుంది. దీనంతటికి కారణం మహా (శివానీ రాజశేఖర్) అని పెళ్లి కూతురు తండ్రి పోసాని కృష్ణమురళి శ్రీనుకు చెబుతాడు. ఆ అమ్మాయి, ఆమె కుటుంబానికి కూడా తాను అనుభవించిన బాధ తెలియాలని సరిగ్గా పెళ్ళికి ముందు రోజు మహా (శివానీ రాజశేఖర్)ని శ్రీను కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.[1]
నటీనటులు
[మార్చు]- రాజ్ తరుణ్
- శివాని రాజశేఖర్
- హర్షవర్ధన్
- ఆమని
- పోసాని కృష్ణ మురళి
- మొహమ్మద్ అలీ బైగ్
- మధునందన్
- రఘు కారుమంచి
- వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్
- దీపాలి శర్మ
- కృతిక సింగ్
- గెటప్ శ్రీను
- భద్రం
- తాగుబోతు రమేష్
- దొరబాబు
- రాజ్ కుమార్ కసిరెడ్డి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: జీ-5, తమాడా మీడియా
- నిర్మాత: సూర్య రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా
- కథ, స్క్రీన్ ప్లే : షేక్ దావూద్ జి
- మాటలు : కళ్యాణ్ రాఘవ్
- దర్శకత్వం : సంజీవ్ రెడ్డి
- సంగీతం: జుడా శాండీ
- సినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్, ఆష్కర్ అలీ
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (17 November 2022). "'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్ రివ్యూ". Archived from the original on 25 November 2022. Retrieved 25 November 2022.