సుమ కనకాల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సుమ కనకాల
Suma Kanakala.jpg
జననం సుమ
(1973-06-27) జూన్ 27, 1973 (వయస్సు: 42  సంవత్సరాలు) జూన్ 27, 1973
కేరళ, భారతదేశం
నివాస ప్రాంతం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
వృత్తి వ్యాఖ్యాత
క్రియాశీలక సంవత్సరాలు ప్రస్తుతం
భార్య / భర్త రాజీవ్ కనకాల
పిల్లలు ఇద్దరు

సుమ (జూన్ 27, 1973) ప్రజాదరణ పొందిన తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాతల్లో (యాంకర్లలో) ఒకరు.

ఈవిడ నాన్న ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న సమయం లో దేవదాసు కనకాల డైరెక్ట్ చేసిన మేఘమాల సీరియల్ లో రాజీవ్ కనకాల తో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారి 1999, ఫిబ్రవరి 10న వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి ఒక బాబు , ఒక పాప.

కేరళకు చెందిన ఈమె మాతృ భాష తెలుగు కానప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడడమే కాదు ఏకంగా వ్యాఖ్యానం (యాంకరింగ్‌) చేస్తూ ఈ రంగంలో ఉన్నతస్థానానికి చేరుకోవడం విశేషం. చక్కటి వ్యాఖ్యానం, ఆకర్షణీయమైన రూపం, చెరగని చిరునవ్వు, సమయస్పూర్తి ఈమె సొంతం. తెలుగు, మళయాళంలతో పాటు హిందీ మరియు ఆంగ్ల భాషలలోను మాట్లాడగలదు. పంచావతారం, స్టార్ మహిళ, భలే ఛాన్సులే వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యానం (యాంకరింగు) చేసి మంచి గుర్తింపును పొందారు.

టివి కార్యక్రమాలకే పరిమితం కాకుండా పలు చలనచిత్రాల పాటల ఆవిష్కరణ (ఆడియో రిలీజు) కార్యక్రమాలలోచక్కటి సమయస్పూర్తితో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

బాల్యం[మార్చు]

వివాహం[మార్చు]

కుటుంబం[మార్చు]

టి.వి.కార్యక్రమాలు[మార్చు]

 • క్యాష్
 • స్టార్ మహిళ
 • పంచావతారం
 • సూపర్ సింగర్
 • అవాక్కయ్యారా?
 • జీన్స్
 • భలే చాన్సులే
 • పట్టుకొంటే పట్టుచీర
 • లక్కు కిక్కు
 • again cash

ధారావాహికలు[మార్చు]

 1. మేఘమాల
 2. జీవన రంగం
 3. అన్వేషిత
 4. సుమ
 5. మందాకిని
 6. సమత
 7. ఆరాధన

సినిమాలు[మార్చు]

 1. కళ్యాణ ప్రాప్తిరస్తు
 2. వర్షం
 3. ఢీ
 4. బాదుషా
 5. స్వయం వరం
 6. గీతాంజలి
 7. రానోయి చందమామ

పురస్కారాలు[మార్చు]

 • 2009లో ఈటీవీ మరియు కోకొకోలా సంస్థలు తెలుగు ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఉత్తమ టివి యాంకర్ల కోసం నిర్వహించిన "లిమ్కా ఫ్రెష్ ఫేస్ ఆఫ్ హంట్" కార్యక్రమంలో మహిళల విభాగంలో విజేతగా నిలిచారు.
 • 2010 సంవత్సరానికి గాను ఉత్తమ టివి వ్యాఖ్యాత (పంచావతారం) నంది పురస్కారాన్ని అందుకున్నారు.
 • 2010 సంవత్సరానికి గాను ఉత్తమ టివి వ్యాఖ్యాత (స్టార్ మహిళ) లోకల్ టీవి మీడియా పురస్కారాన్ని అందుకున్నారు.
 • 2010 సంవత్సరానికి గాను ఉత్తమ టివి వ్యాఖ్యాత (స్టార్ మహిళ) సినీగోర్ పురస్కారాన్ని అందుకున్నారు.

ఇతర లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సుమ_కనకాల&oldid=1557288" నుండి వెలికితీశారు