Jump to content

ఢీ

వికీపీడియా నుండి
ఢీ
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీను వైట్ల
నిర్మాణం మల్లిడి సత్యనారాయణరెడ్డి
కథ కోన వెంకట్,
గోపీమోహన్
చిత్రానువాదం శ్రీను వైట్ల‌
తారాగణం మంచు విష్ణు
జెనీలియా
శ్రీహరి
బ్రహ్మానందం
సునీల్ (నటుడు)
జయప్రకాశ్ రెడ్డి
శ్రీనివాస రెడ్డి
సంగీతం కోటి
గీతరచన రామజోగయ్య శాస్త్రి
సంభాషణలు కోన వెంకట్
ఛాయాగ్రహణం మూరెళ్ళ ప్రసాద్
కళ నారాయణ రెడ్డి
కూర్పు మార్తాండ్.కె.వెంకటేష్
నిర్మాణ సంస్థ సిరి వెంకటేశ్వర ఫిలింస్‌
విడుదల తేదీ 13 ఏప్రిల్, 2007
భాష తెలుగు
పెట్టుబడి 5 కోట్లు

ఢీ కొట్టి చూడు 2007, ఏప్రిల్ 13న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఈ చిత్రం ఆద్యంతం సరదాగా సాగుతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. ఇది వెంకీ తరువాత శ్రీను వైట్ల హాస్యం బాగా పండిన చిత్రం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు విష్ణు, జెనీలియా, శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్ (నటుడు), జయప్రకాశ్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి తదితరులు ముఖ్య పాత్రాలలో నటించగా, చక్రి సంగీతం అందించాడు.

కథాగమనం

[మార్చు]

హైదరాబాదు నగరంలో శంకర్ గౌడ్ (శ్రీహరి), భల్లూయాదవ్ ల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఆ గొడవల్లో భల్లూ యదవ్ కొడుకు (అజయ్) శంకర్ గౌడ్ మనిషిని (సూర్య), అతని భార్య (సుమ) లను చంపేస్తాడు. చనిపోయిన అనుచరుడికి ఒక పాప, ఒక బాబు ఉంటారు. వారి ఆలనా పాలనా శంకర్ గౌడ్ చూస్తుంటాడు. నారాయణ (చంద్రమోహన్) కొడుకు బబ్లూ ఉరఫ్ శ్రీనివాసరావు (మంచు విష్ణువర్ధన్) తెలివైన వాడు. స్నేహితులతో గాలికి తిరగడం చూసి నారాయణరావు అతడిని శంకర్ గౌడ్ వద్ద పనిలో పెడతాడు. పనిలో తన తెలివి తేటలతో శంకర్ గౌడ్ అభిమానాన్ని సంపాదిస్తాడు బబ్లూ. శంకర్ గౌడ్ చెల్లెలు పూజ (జెనీలియా) బొంబాయిలో చదువుతుంటే ఆమె క్షేమం కోసం ఇంటికి తీసుకొచ్చేస్తాడు. అక్కడ బబ్లూ పూజ ప్రేమించుకుంటారు. శంకర్ గౌడ్ కి తెలియకుండా వీళ్ళు ప్రేమను కొనసాగిస్తూ లేచిపోయి పెళ్ళి చేసుకోవాలనుకొంటారు. పథకం ప్రకారము యాదగిరిగుట్ట వెళ్ళి పెళ్ళి చేసుకొంటారు. పగతో ఉన్న భల్లూ యదవ్ అతని మనుషులు పూజను చంపబోతే బబ్లూ కాపాడతాడు. శంకర్ గౌడ్ అక్కడికొస్తాడు కాని అతనికి పెళ్ళి సంగతి తెలియనివ్వరు. చెల్లిని కాపాడిన బబ్లూని మెచ్చుకొని చెల్లిన వెంట తీసుకెళుతున్న శంకర్ గౌడ్ను గాయపరచి పూజను తీసుకెళ్ళి పోతాడు భల్లూ యదవ్. పూజ చేతి నరాలను కోసి ఆమెను ఒక పాత బిల్డింగ్లో దాచి దమ్ముంటే ఆమె చచ్చేలోగా కాపాడుకోమని శంకర్ గౌడుకు చెప్తాడు భల్లూయదవ్. బబ్లూ సహాయంతో భల్లూ యాదవ్ అంతుచూసి పూజను కాపాడతారు. తరువాత ఆమెను అతనికే ఇచ్చి పెళ్ళి చేస్తాడు శంకర్ గౌడ్.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

చిత్ర విశేషాలు

[మార్చు]
  • శ్రీను వైట్ల ఈ చిత్రంలో కేవలం వినోదానికే పెద్దపీట వేసి మేధోవ్యూహాల ద్వారా కథానాయకుడి పాత్రను నడిపించారు.

బయటి లంకెలు

[మార్చు]
  1. సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=ఢీ&oldid=4212970" నుండి వెలికితీశారు