గోపీమోహన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోపీమోహన్
పుట్టిన తేదీ, స్థలంపిన్నమనేని గోపీ మోహన్
(1974-07-01) 1974 జూలై 1 (వయసు 49)
కురుమద్దాలి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
కలం పేరుగోపీ, మోహన్
వృత్తిస్క్రీన్ ప్లే, కథా రచయిత
చురుకుగా పనిచేసిన సంవత్సరాలు2001
జీవిత భాగస్వామిప్రవీణ

గోపీమోహన్ (పిన్నమనేని గోపీ మోహన్) తెలుగు సినిమా స్క్రీన్ ప్లే, కథా రచయిత.[1]

జననం

[మార్చు]

గోపీమోహన్ 1974, జూలై 1న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, వుయ్యూరు సమీపంలోని కురుమద్దాలి గ్రామంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే మక్కువ.[2]

సినిమారంగం

[మార్చు]

1999లో ఎన్.శంకర్ తీసిన యమజాతకుడు, 2000లో బి. గోపాల్ తీసిన వంశీ సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. 2001లో తేజ తీసిన నువ్వు నేను సినిమాకు స్క్రిప్ట్, దర్శకత్వ శాఖలో సహాయం చేసాడు.

2002లో వచ్చిన సంతోషం సినిమాకు స్క్రీన్ ప్లే రాశాడు. ఆ తరువాత దశరధ్, శ్రీనువైట్ల, సురేందర్ రెడ్డి, తేజ, జి.నాగేశ్వర రెడ్డిలతో దర్శకులతో పనిచేసి వెంకీ మిస్టర్ & మిసెస్ శైలజాకృష్ణమూర్తి, శ్రీ, అశోక్, ఢీ, దుబాయ్ శీను, లక్ష్యం, స్వాగతం, ఝుమ్మంది నాదం, ధేనికైనా రెడీ, గ్రీకు వీరుడు, దూసుకెళ్తా వంటి సినిమాలకు స్క్రీన్‌ప్లే రాశాడు.

2008లో రెడీ సినిమాకు తొలిసారిగా కథ రాశాడు. తరువాత దర్శకుడు శ్రీనువైట్ల తీసిన రెడీ, కింగ్, నమో వెంకటేశా, దూకుడు, బాద్ షా చిత్రాలకు కథలు రాశాడు. గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్ట్ రచయితలుగా అనేక విజయవంతమైన సినిమాలకు కలిసి పనిచేశారు.

సినిమాలు

[మార్చు]

సహాయ దర్శకుడిగా

[మార్చు]
సంవత్సరం పేరు భాష
1999 యమజాతకుడు తెలుగు
2000 వంశీ తెలుగు
2001 నువ్వు నేను తెలుగు

స్క్రీన్ ప్లే రచయితగా

[మార్చు]
సంవత్సరం పేరు భాష
2002 సంతోషం తెలుగు
2004 వెంకీ తెలుగు
2004 మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి తెలుగు
2005 శ్రీ తెలుగు
2006 అశోక్ తెలుగు
2007 ఢీ తెలుగు
2007 దుబాయ్ శీను తెలుగు
2007 లక్ష్యం తెలుగు
2008 స్వాగతం తెలుగు
2010 ఝుమ్మంది నాదం తెలుగు
2012 దేనికైనా రెడీ తెలుగు
2013 గ్రీకు వీరుడు తెలుగు
2013 దూసుకెళ్తా తెలుగు
2014 పాండవులు పాండవులు తుమ్మెద తెలుగు
2014 అల్లుడు శ్రీను తెలుగు
2014 లౌక్యం తెలుగు
2016 డిక్టేటర్ తెలుగు [3]
2016 శౌర్య తెలుగు
2019 ఓ బేబీ తెలుగు

కథా రచయితగా

[మార్చు]
సంవత్సరం పేరు భాష
2008 రెడీ తెలుగు
2008 కింగ్
2009 రామ్ కన్నడ
2010 నమో వెంకటేశ తెలుగు
2010 ఉత్తమ పుతిరన్ తమిళం
2011 రెడీ హిందీ
2011 దూకుడు తెలుగు
2012 ఛాలెంజ్ 2 బెంగాలీ
2013 షాడో తెలుగు
2013 బాద్‍షా
2015 బ్రూస్ లీ
2016 డిక్టేటర్[4]
2017 మిస్టర్

మూలాలు

[మార్చు]
  1. "ముగ్గురు హీరోలు... ముగ్గురు హీరోయిన్లు... ఛలో అమెరికా". Sakshi. 2017-02-01. Archived from the original on 2017-02-04. Retrieved 2023-07-24.
  2. Y Krishna Jyothi. "Gopimohan to turn director!". The New Indian Express. Archived from the original on 2016-03-26. Retrieved 2023-07-24.
  3. "Balakrishna's 99th Movie Dictator Launch" Archived 26 జూన్ 2015 at the Wayback Machine MovieNewz.in. Retrieved 2023-07-24
  4. "Balakrishna's 99th Movie Dictator Launch" Archived 26 జూన్ 2015 at the Wayback Machine MovieNewz.in. Retrieved 2023-07-24

బయటి లింకులు

[మార్చు]