ఎంత మంచివాడవురా!
ఎంత మంచివాడవురా! | |
---|---|
దర్శకత్వం | సతీష్ వేగేశ్న |
నిర్మాత | సుభాష్ గుప్తా ఉమేష్ గుప్తా |
తారాగణం | కళ్యాణ్ రామ్ మెహ్రీన్ పిర్జాదా |
ఛాయాగ్రహణం | రాజ్ తోట |
కూర్పు | బిక్కిన తమ్మిరాజు |
సంగీతం | గోపీ సుందర్ |
నిర్మాణ సంస్థ | ఆదిత్యా మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల తేదీ | 15 జనవరి 2020 |
సినిమా నిడివి | 144 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఎంత మంచివాడవురా! 2020, జనవరి 15న విడుదలైన తెలుగు చలనచిత్రం.[2] సతీష్ వేగేశ్న[3][4][5] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, మెహ్రీన్ పిర్జాదా జంటగా నటించగా, గోపి సుందర్ సంగీతం అందించాడు.[6] ఆదిత్యా మ్యూజిక్ పతాకంపై సుభాష్ గుప్తా, ఉమేష్ గుప్తా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం గుజరాతీ భాషా చిత్రం ఆక్సిజన్ సినిమాకి రిమేక్‌గా రూపొందించబడింది.[7] నమ్మిన బంటు (1960) చిత్రంలోని ఎంత మంచివాడవురా పాట పదాలతో ఈ చిత్రంపేరును పెట్టారు.[8]
కథ
[మార్చు]బంధాలు, బంధుత్వాలపై ఇష్టమున్న బాలు (కళ్యాణ్ రామ్)కు చిన్నప్పుడు పుట్టినరోజు బహుమతిగా చుట్టాలందిరినీ పిలిచి పండగలా ఎంజాయ్ చేయాలని తన తండ్రిని కోరుతాడు. అలా సంతోషంగా సాగుతున్న బాలు కుటుంబానికి రోడ్డు ప్రమాదం జరిగి బాలు తల్లిదండ్రులు చనిపోతారు. ఆ సమయంలో బంధువులు బాలును పట్టించుకోరు. ఇదే సమయంలో బాలుకు నందిని (మెహరీన్)తో పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరు పెరిగి పెద్దాయ్యాక షార్ట్ ఫిలిమ్స్ తీస్తుంటారు. తన స్నేహితులందరికీ బాలుగా ఉంటూ శివ, సూర్య, రిషి ఇలా రకరకాల పేర్లతో ఒక వృద్ధ జంటకి మనవడిగా, ఒకరికి కొడుకుగా, మరొకరికి తమ్ముడిగా ఉంటూ అనుబంధాల్ని కొనసాగిస్తుంటాడు. ఎవరికి తెలియకుండా బాలు దాచిన ఒక విషయం నందినికి, బాలు ఫ్రెండ్స్‌కు తెలుస్తుంది. ఎవరూ లేని బాలు అలా వేరే వేరే పేర్లతో అన్ని కుటుంబాలకి ఎలా దగ్గరయ్యాడు, ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.[9][10]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: సతీష్ వేగేశ్న
- నిర్మాత: సుభాష్ గుప్తా, ఉమేష్ గుప్తా
- సంగీతం: గోపి సుందర్
- ఛాయాగ్రహణం: రాజ్ తోట
- కూర్పు: బిక్కిన తమ్మిరాజు
- నిర్మాణ సంస్థ: ఆదిత్యా మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాణం
[మార్చు]అభివృద్ధి
[మార్చు]ఈ చిత్రం 2019లో రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లాలోని ఇతర ప్రాంతాలలో ప్రారంభమైంది.[11][12] పురుషోత్తమపట్నం, పెండ్యాల, కొవ్వూరు, కోటిపల్లి వంటి ప్రదేశాలలో సినిమాలోని ఎక్కువభాగం చిత్రీకరణ జరిగింది.[13]
మార్కెటింగ్ - విడుదల
[మార్చు]కళ్యాణ్ రామ్ 17వ చిత్రం కావడంతో అతని పుట్టినరోజున సినిమా టైటిల్ లోగో ఆవిష్కరించబడింది.[14] 2019, సెప్టెంబరు 21న చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలయింది.[15]
పాటలు
[మార్చు]ఎంత మంచివాడవురా! | |
---|---|
పాటలు by | |
Released | 9 అక్టోబరు 2019 |
Recorded | 2019 |
Genre | సినిమా పాటలు |
Language | తెలుగు |
Label | ఆదిత్యా మ్యూజిక్ |
ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించాడు. 2019, అక్టోబరు 9న ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "ఏమో ఏమో ఏ గుండెలో (రచన: రామజోగయ్య శాస్త్రి)" | ఎస్.పి. బాలసుబ్రమణ్యం | 4:34 |
2. | "అవునో తెలియదు (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | శ్రేయ ఘోషాల్ | 4:42 |
3. | "జాతరో జాతర (రచన: శ్రీమణి)" | రాహుల్ సిప్లిగంజ్, ఎల్.వి. రేవంత్, సాహితి చాగంటి | 4:19 |
మూలాలు
[మార్చు]- ↑ "Censor Certificate: Entha Manchivaadavuraa". 123Telugu.com. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-19.
- ↑ "Kalyan Ram's Entha Manchivaadavuraa seals its release date". 123Telugu.com.
- ↑ "Jaataro Jaatara from Entha Manchivaadavuraa: Mass folk number shot on the countryside - Times of India". The Times of India. India: The Times of India. Retrieved 19 January 2020.
- ↑ Adivi, Sashidhar (23 December 2019). "A family drama amid big-tickets". Deccan Chronicle. India: Deccan Chronicle. Retrieved 19 January 2020.
- ↑ Vyas (28 December 2019). "Mass song from 'Entha Manchivaadavuraa' out". www.thehansindia.com. India: The Hans India. Retrieved 19 January 2020.
- ↑ "Kalyan Ram Locks His Next For Sankranthi!". iQlikMovies.com.
- ↑ "Interesting update on NKR's Entha Manchivadavuraa". 123Telugu.com.
- ↑ "Interesting title launch for NKR17 on Kalyan Ram's b'day". 123Telugu.com.
- ↑ సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
- ↑ ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడవురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
- ↑ "Kalyan Ram gets in Action mode". Tollywood.net. Archived from the original on 2019-09-22. Retrieved 2020-01-19.
- ↑ "Kalyan Ram Entha Manchivaadavuraa shooting update". Gossiper.uk.[permanent dead link]
- ↑ "Kalyan Ram plays 'do-gooder'". The Hans India.
- ↑ "Entha Manchivaadavuraa Title Logo Teaser: Sweet N Simple!". Tupaki.com.
- ↑ "'Entha Manchivaadavuraa' FL: Kalyanram in serious mood!". Gulte.com.
ఇతర లంకెలు
[మార్చు]- CS1 location test
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2020 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- Album articles with non-standard infoboxes
- Album articles lacking alt text for covers
- 2020 తెలుగు సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలు
- శరత్ బాబు నటించిన సినిమాలు
- సుహాసిని నటించిన సినిమాలు
- తనికెళ్ళ భరణి సినిమాలు
- విజయ నరేష్ నటించిన సినిమాలు
- రాజీవ్ కనకాల నటించిన సినిమాలు