ప్యార్ మే పడిపోయానే
ప్యార్ మే పడిపోయానే | |
---|---|
దర్శకత్వం | రవి చావలి |
రచన | రవి చావలి |
నిర్మాత | కె.కె. రాధామోహన్ |
తారాగణం | ఆది శాన్వీ శ్రీవాస్తవ వెన్నెల కిషోర్ |
ఛాయాగ్రహణం | టి. సురేంద్ర రెడ్డి |
కూర్పు | కృష్ణారెడ్డి |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 10 మే 2014 |
సినిమా నిడివి | 148 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ప్యార్ మే పడిపోయానే 2014, మే 10న విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ చలనచిత్రం. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ నిర్మాణ సారథ్యంలో రవి చావలి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆది, శాన్వీ శ్రీవాస్తవ ప్రధాన పాత్రల్లో నటించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఇదే పేరుతో హిందీలోకి అనువాదం చేయబడింది.
కథా సారాంశం
[మార్చు]చంద్ర/చిన్నా (ఆది), యుక్తా (షాన్వి) చిన్నప్నటినుండి స్నేహితులు. చిన్నా కుటుంబం ఇంటినుండి బయటికి వెళ్లిపోవడంతో చిన్నా, యుక్తాల మధ్యవున్న బంధం దూరమవుతుంది. యుక్తాకు ఎంతో విలువైనదాన్ని చిన్నా దొంగిలించడంతో ఆమె అతన్ని ద్వేషిస్తుంటుంది.
కొన్ని సంవత్సరాల తరువాత, చిన్నా గాయకుడిగా మారి, గొప్పపేరు సంపాదిస్తాడు. తన కళాశాలలో యుక్తాను చూసిన చిన్నా, ఆమె తన చిన్ననాటి స్నేహితురాలు అని తెలుసుకోకుండా ఆమె వెంట పడుతుంటాడు. యుక్తా కూడా గాయకురాలిగా మారడంతో, వాళ్ళద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది.
చిన్న తన క్రేజీ బ్యాండ్ సంస్థలో యుక్తాను గాయకురాలిగా చేర్చుకుంటాడు. ఇద్దరూ కలిసి కొన్ని పాటలు రూపొందించగా, ఆడియో కంపెనీ వారికి అవి నచ్చుతాయి. అలా ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. ఇంతలో యుక్తా తన చిన్ననాటి స్నేహితురాలు అని చిన్నాకు తెలుస్తుంది.
చిన్నప్పుడు జరిగిన సంఘటనను యుక్తా ఇంకా మరిచిపోలేదని గ్రహించిన చిన్నా, చిన్ననాటి సంఘటన గురించి యుక్తాను మరచిపోయేలా చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తాడు. కానీ, అవేవి ఫలించవు. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.[1]
నటవర్గం
[మార్చు]- ఆది (చిన్నా)
- శాన్వీ శ్రీవాస్తవ (యుక్త)
- వెన్నెల కిషోర్
- తాగుబోతు రమేష్
- పృథ్వీరాజ్
- వై. కాశివిశ్వనాథ్
- సప్తగిరి (హుస్సేన్ వర్మ)
- దువ్వాసి మోహన్
- మధునందన్
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: రవి చావాలి
- నిర్మాత: కె.కె. రాధమోహన్
- సంగీతం: అనూప్ రూబెన్స్
- సినిమాటోగ్రఫీ: టి. సురేంద్ర రెడ్డి
- కూర్పు: కృష్ణారెడ్డి
- నిర్మాణ సంస్థ: శ్రీ సత్య సాయి ఆర్ట్స్
పాటలు
[మార్చు]Untitled | |
---|---|
ఈ చిత్రంలోని ఎనిమిది పాటలను అనూప్ రూబెన్స్ స్వరపరచగా, అన్ని పాటలు భాస్కరభట్ల రవికుమార్ రాశాడు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా ఈ చిత్ర పాటలు విడుదలయ్యాయి. 2014, ఏప్రిల్ 14న హైదరాబాదులోని రాక్ హైట్స్ లో పాటల విడుదల కార్యక్రమం జరిగింది.[2] సినీ నటుడు మంచు మనోజ్ కుమార్ పాటల సిడిలను విడుదల చేశాడు. సినీ నటులు నాని, నవదీప్, ఆదిత్ అరుణ్, వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, ప్రిన్స్, సినీ నటీమణులు రకుల్ ప్రీత్ సింగ్, షాన్వి, సినీ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, నటులు సాయి కుమార్, అతని భార్య మెదలైనవారు ఈ పాటల విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు.[3]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "ఓ మై డియర్" | రంజిత్, యామిని సిస్టర్ | 3:17 | ||||||
2. | "ప్యార్ మే పడిపోయానే" | శ్రేయ ఘోషాల్ | 3:12 | ||||||
3. | "మనసున ఏదో యామ" | విజయ్ ప్రకాష్, శ్రావణి, సవేరి | 3:13 | ||||||
4. | "నువ్వే నువ్వే ఫిమేల్" | రమ్య ఎన్ఎస్ కె | 2:29 | ||||||
5. | "సా మ రి స" | అంజనా సౌమ్య, అనుదీప్ దేవ్ | 2:44 | ||||||
6. | "చల్ రే చల్ రే" | రాహుల్ నంబియార్ | 3:01 | ||||||
7. | "నువ్వే నువ్వే మేల్" | అనుదీప్ దేవ్ | 2:29 | ||||||
8. | "చిన్న పిల్లలు" | ఆది | 2:00 | ||||||
22:25 |
స్పందన
[మార్చు]ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రతికూల సమీక్షలను అందుకుంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Pyar Mein Padipoyane Plot & Review". 123telugu.com.
- ↑ "Audio Launch Of Pyar Mein padipoyane". youtube.com.
- ↑ "Manchu Manoj Releases Pyar Mein Padipoyane Audio". filmibeat.com.
- ↑ "Pyar Mein Padipoyane Review: Passion-less Love Lore". greatandhra.com.
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2014 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- 2014 తెలుగు సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు