లక్ష్మీ రావే మా ఇంటికి
లక్ష్మీ రావే మా ఇంటికి | |
---|---|
దర్శకత్వం | నంద్యాల రవి |
రచన | నంద్యాల రవి |
నిర్మాత | గిరిధర్ మామిడిపల్లి |
తారాగణం | నాగ శౌర్య అవికా గోర్ |
ఛాయాగ్రహణం | సాయి శ్రీరామ్ |
కూర్పు | రామాంజనేయులు |
సంగీతం | కె. ఎం. రాధాకృష్ణన్ |
విడుదల తేదీ | 5 డిసెంబరు 2014 |
సినిమా నిడివి | 151 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లక్ష్మీ రావే మా ఇంటికి 2014, డిసెంబరు 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. నంద్యాల రవి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగ శౌర్య, అవికా గోర్ జంటగా నటించగా, కె. ఎం. రాధాకృష్ణన్ సంగీతం అందించాడు.
కథా నేపథ్యం
[మార్చు]లక్ష్మీ నిలయం సర్వేశ్ ఆనంద్ రావు (రావు రమేష్) కు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు లక్ష్మీ (అవిక గోర్). అన్ని విషయాల్లోనూ చాలా స్ట్రిక్ట్ గా ఉండే సర్వేశ్ రావు తన కుటుంబ సభ్యులను కూడా ఎంతో పద్దతిగా పెంచుతాడు. చదువు పూర్తి చేసుకొని జాబు తెచ్చుకున్న లక్ష్మీకి పెళ్లికి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో పెళ్ళి ఫిక్స్ అవుతుంది. బిటెక్ పూర్తిచేసి స్నేహితులతో జులాయిగా తిరిగే సాయి (నాగ శౌర్య) ఒకరోజు లక్ష్మీని చూసి ప్రేమలో పడతాడు. అప్పటికే లక్ష్మీకి నిశ్చితార్ధం అయిపోయిందని తెలుసుకున్న సాయి, లక్ష్మీని ఇంప్రెస్ చెయ్యడానికి ట్రై చేస్తుంటాడు. తన ప్రేమని సక్సెస్ చేసుకోవడానికి సాయి ఏం చేసాడు, లక్ష్మీ సాయిని ప్రేమించిందా, లక్ష్మీ – సాయి ఒకటయ్యారా అన్నది మిగతా కథ.[1]
నటవర్గం
[మార్చు]- నాగ శౌర్య (సాయి)[2]
- అవికా గోర్ (లక్ష్మీ)
- రావు రమేష్ (సర్వేష్ ఆనంద్ రావు, లక్ష్మీ తండ్రి)
- విజయ నరేష్
- పవిత్ర లోకేష్
- సప్తగిరి
- ప్రగతి
- సత్యం రాజేష్
- వెన్నెల కిషోర్
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: నంద్యాల రవి
- నిర్మాత: గిరిధర్ మామిడిపల్లి
- సంగీతం: కె. ఎం. రాధాకృష్ణన్
- ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
- కూర్పు: రామాంజనేయులు
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి కె. ఎం. రాధాకృష్ణన్ సంగీతం అందించాడు.[3]
- "దేవతల్లే" - (రచన: భాస్కరభట్ల రవికుమార్, గానం: కె. ఎం. రాధాకృష్ణన్) - 3:45
- "కాటుక దిద్దిన కాంచనమాల" - హేమచంద్రన్ - 3:58
- "ఆ వెన్నెలదైనా" - కార్తీక్, సునీత ఉపద్రష్ట - 5:01
- "ఎంత సొగసు చేరేనో" - గాయత్రి నారాయణ్ - 2:12
- "రావ మా ఇంటిదాక" - దీపు - 4:10
- "మనసులో ఉన్న ప్రేమ" - శ్రీకృష్ణ - 4:13
- "అమ్మ కడుపు చల్లగా" - శ్రీదేవి - 2:13
- "వేణుగాన లోలుడే" - సునీత - 2:12
నిర్మాణం
[మార్చు]2014 మే నెల వరకి చాలా వరకు చిత్రీకరణ పూర్తయింది. పాటలను కూర్గ్, పుదుచ్చేరిలో చిత్రీకరించారు. నాగశౌర్య, అవికా గోర్ లతోపాటు, రావు రమేష్, నరేష్, సప్తగిరి, సత్యం రాజేష్ తదితరులు ఈ చిత్రంలో ఉన్నారు.[4]
విడుదల
[మార్చు]టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ చిత్రానికి 2/5 రేటింగ్ ఇచ్చింది.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ 123 తెలుగు, సినిమా రివ్యూ (5 December 2014). "Lakshmi Raave Maa Intiki Telugu Movie Review". www.123telugu.com. Archived from the original on 23 March 2018. Retrieved 8 August 2020.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ సాక్షి, సినిమా (3 December 2014). "'బొమ్మరిల్లు'లో...'ఇడియట్' కుర్రాణ్ణి!". Sakshi. Archived from the original on 7 July 2018. Retrieved 8 August 2020.
- ↑ "Lakshmi Raave Maa Intiki (2014)". Raaga. Archived from the original on 15 జనవరి 2021. Retrieved 8 August 2020.
- ↑ "Avika Gor gets busy in Tollywood". Deccan Chronicle. 4 May 2014. Retrieved 8 August 2020.
- ↑ Kumar, Hemanth (28 April 2016). "Lakshmi Raave Maa Intiki Movie Review {2/5}: Critic Review of Lakshmi Raave Maa Intiki". The Times of India. Retrieved 8 August 2020.
- ↑ Dundoo, Sangeetha Devi (5 December 2014). "Lakshmi Raave Maa Intiki: Wait, what was that?". Retrieved 8 August 2020 – via www.thehindu.com.