బిందాస్
బిందాస్ (2010 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వీరు పోట్ల |
---|---|
కథ | వీరు పోట్ల |
తారాగణం | మంచు మనోజ్ కుమార్ వెన్నెల కిశోర్ రఘుబాబు బెనర్జీ భానుచందర్ మాస్టర్ భరత్ పరుచూరి వెంకటేశ్వరరావు సుబ్బరాజు అహుతి ప్రసాద్ జయప్రకాష్ రెడ్డి ఎమ్.ఎస్.నారాయణ |
సంభాషణలు | వీరు పోట్ల |
నిర్మాణ సంస్థ | ఎ. కె. ఎంటర్ టైన్ మెంట్ |
విడుదల తేదీ | 5 ఫిబ్రవరి 2010 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
బిందాస్ 2010 లో విడుదలైన సినిమా. మంచు మనోజ్ కుమార్, షీనా షాహాబాది నటించారు. వీరు పోట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010 ఫిబ్రవరి 5 న విడుదలైంది.
అజయ్ ( మనోజ్ మంచు ) అతని తల్లిదండ్రులు రాయలసీమ లోని వారి ఉమ్మడి కుటుంబం నుండి విడిపోయారు. అజయ్, మహేంద్ర నాయుడు ( అహుతి ప్రసాద్ ) కుటుంబానికి చెందినవాడు. శేషాద్రి నాయుడు ( జయ ప్రకాష్ రెడ్డి ) మహేంద్రకు శత్రువు. వారు ఒకరి కుటుంబ సభ్యులను మరొకరు చంపుకుంటూ ఉంటారు. స్వేచ్ఛ, శాంతిని కోరుకునే అజయ్ దీన్ని ఈ శత్రుత్వాన్ని ముగించి రెండు కుటుంబాలను ఎలా ఏకం చేస్తాడనేది కథ.
స్పెషల్ జ్యూరీ అవార్డు , మంచు మనోజ్ , నంది పురస్కారం .
కథ
[మార్చు]మహేంద్ర, శేషాద్రిలు ఎంపి టిక్కెట్టు కోసం వాదించుకుంటూండగా సినిమా మొదలవుతుంది. టిక్కెట్టు మహేంద్రకు ఇవ్వాలని పార్టీ నిర్ణయిస్తుంది. మహేంద్ర కుటుంబం పార్టీ భవనం నుండి బయటికి రానీయకుండా, శేషాద్రి అతని కుమారులు అల్లకల్లోలం సృష్టిస్తారు. ఇంతలో, తన బావను మహేంద్ర ముఠా కిడ్నాప్ చేసినట్లు శేషాద్రికి ఫోన్ వస్తుంది. కంగారు పడిన శేషాద్రి, మహేంద్ర కుటుంబాన్ని ప్రస్తుతానికి విడిచిపెట్టమని తన కుమారులు, అనుచరులను అడుగుతాడు. మహేంద్ర కుటుంబం పార్టీ భవనం నుండి బయలుదేరిన తర్వాత, శేషాద్రి బావను విడిచిపెట్టమని వారు తమ అనుచరులను ఆదేశిస్తారు. అయితే, శేషాద్రి బావను చంపేస్తారు. ప్రతీకారం తీర్చుకోవడం కోసం మహేంద్ర కుటుంబ సభ్యులందరినీ చంపాలని శేషాద్రి కోరుకుంటాడు. మహేంద్ర తన మనుష్యులను కుటుంబంలోని ప్రతి సభ్యుడిని వారి రక్షణ కోసం తన ఇంటికి రావాలని ఆదేశిస్తాడు.
ఇక్కడ అజయ్ పరిచయ మౌతాడు. అతను మహేంద్ర మేనల్లుడు. మహేంద్రకు ముగ్గురు సోదరీమణులు ఉన్నారు, వారిలో ఒకరు గిరిజ ( షీనా షాహాబాది) కు తల్లి. కొన్ని కామెడీ, చెతుర్ల తరువాత, గిరిజ అజయ్‌తో ప్రేమలో పడతుంది. మహేంద్ర తన కుటుంబాన్ని ఊరొదిలి బయటకు వెళ్లవద్దని ఆదేశిస్తాడు. అయితే, గిరిజ పుట్టినరోజుకు కేక్ తీసుకోవటానికి అజయ్ తన ఇద్దరు దాయాదులతో నగరం విడిచి వెళ్తాడు. అతను కేక్ తీసుకొస్తే, అతన్ని ముద్దు ఇస్తానని ఆమె పందెం కాస్తుంది. తిరిగి వచ్చేటప్పుడు, ముగ్గురూ పకోడీలు తీసుకోడానికి ధాబా దగ్గర ఆగుతారు. శేషాద్రి చిన్న కుమారుడు వారిపై దాడి చేస్తాడు. మహేంద్ర కుటుంబ సభ్యులలో కనీసం ఒకరినైనా చంపేవరకు తాను ఆ ధాబా లోనే ఉంటానని, ఇంటికి రాననీ పంతం పట్టి దానిని తన స్థావరంగా చేసుకున్నాడు. అజయ్ తనను తన బంధువులను సకాలంలో రక్షించుకుంటాడు. కానీ అతడు బయటికి వెళ్ళినందుకు మహేంద్రకు కోపం వచ్చి తన ఇంటిని వదిలి వెళ్ళిపొమ్మంటాడు.
రైలు ఎక్కటానికి అజయ్ స్టేషనుకు చేరుకుంటాడు. రైలు ఎక్కే ముందు, పట్టణంలో బాంబు దాడి జరిగిందనే వార్తలను టీవీలో చూస్తాడు. వెంటనే, అతను పురుషోత్తం నాయుడు యొక్క "గురూజీ" ( విజయకుమార్ ) వద్దకు వెళ్ళి అతని సలహా తీసుకుంటాడు. అప్పుడు, అజయ్ శేషాద్రి అల్లుడు శరత్ ( సునీల్ ) సహాయంతో శేషాద్రి ఇంట్లోకి ప్రవేశించి అందరినీ మార్చడానికి ప్రయత్నిస్తాడు. శేషాద్రి పెద్ద కొడుకును తన భార్యా పిల్లల తోటి, అతని చిన్న కొడుకు ( సుబ్బరాజు ) ను తన కాబోయే భార్యతోటీ ఏకం చేసి, అతను దాదాపు తన లక్ష్యాన్ని సాధిస్తాడు. ఒక వేడుక రోజున, మహేంద్ర కుటుంబానికి హాని చేయమని వారి నుండి మాట తీసుకుంటాడు. కాని మహేంద్రను మాత్రం తమకిష్టమైనది చేస్తామని వారు చెబుతారు. శేషాద్రి స్నేహితులలో ఒకరు అజయ్‌ను గుర్తించి, అతడు శత్రు శిబిరానికి చెందినవాడని శేషాద్రి కుటుంబానికి చెబుతాడు. దాంతో అజయ్ పారిపోతూంటే, అతణ్ణి పొడుస్తారు. చివరికి రెండు కుటుంబాలు కలిసి పోవడంతో సినిమా సుఖాంతమౌతుంది
తారాగణం
[మార్చు]- మంచు మనోజ్
- షీనా
- ఆహుతి ప్రసాద్
- జయప్రకాశ్ రెడ్డి
- వెన్నెల కిషోర్
- సుబ్బరాజు
- సునీల్
- విజయకుమార్
- జీవా
- ఎం.ఎస్. నారాయణ
- కల్పన
- తెలంగాణ శకుంతల
- భానుచందర్
- పరుచూరి వెంకటేశ్వరరావు
- యనమదల కాశీ విశ్వనాథ్
- సుదీప
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "బిందాస్" | భువనచంద్ర | రంజిత్, మామీ బాయ్‌స్, కోకో నందా, ఎం.సి. బులెట్ | 4:28 |
2. | "సురాంగణి" | రామజోగయ్య శాస్త్రి | జస్సీ గిఫ్ట్ | 4:57 |
3. | "ఏంటమ్మా ఏంటమ్మా" | భువన చంద్ర | కార్తిక్, అనూరాధా శ్రీరామ్ | 4:52 |
4. | "గిరిజా గిరిజా" | భువన చంద్ర | కార్తిక్, చిన్మయి | 4:59 |
5. | "జూం గరగర" | రామజోగయ్య శాస్త్రి | శివం, సుచిత్ర | 4:10 |
విడుదల
[మార్చు]బిందాస్ సానుకూల సమీక్షలు అందుకుంది. ఐడిల్‌బ్రేన్.కామ్ కు చెందిన జీవీ "మనోజ్ మంచు తనకు ఒక కొత్త ఇమేజిని తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో అతని నటన భారీ ప్రశంసలకు అర్హమైనది". పరిశ్రమ పండితులు దీనిని మనోజ్ కెరీర్‌లో అతిపెద్ద హిట్‌గా ప్రకటించారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-05. Retrieved 2020-08-28.