జనక అయితే గనక
జనక అయితే గనక | |
---|---|
దర్శకత్వం | సందీప్‌రెడ్డి బండ్ల |
కథ | సందీప్‌రెడ్డి బండ్ల |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సాయిశ్రీరామ్ |
కూర్పు | కోదాటి పవన్ కల్యాణ్ |
సంగీతం | విజయ్ బుల్గానిక్ |
నిర్మాణ సంస్థ | దిల్‌రాజు ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 12 అక్టోబరు 2024 |
దేశం | భారతదేశం |
జనక అయితే గనక 2024లో విడుదలైన తెలుగు సినిమా. దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వం వహించాడు. సుహాస్, సంగీర్తన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 4న,[1] ట్రైలర్‌ను ఆగష్టు 27న విడుదల చేయగా,[2] సినిమా అక్టోబర్ 12న విడుదలైంది.[3]
కథ
[మార్చు]మధ్యతరగతికి చెందిన ప్రసాద్ (సుహాస్) వాషింగ్ మెషిన్ రిపేర్ చేసే కంపెనీలో ఉధ్యోగం చేస్తూ ఉంటాడు. అతనికి చిన్న వయస్సులోనే సంగీర్తనతో పెళ్లి అవుతుంది. కానీ, పిల్లలను మాత్రం వద్దు అంటాడు. ఇరు కుటుంబ పెద్దలతో పాటు బయటివారు కూడా పిల్లలు.. పిల్లలు అని గోల పెడుతుంటారు. వచ్చే జీతం ఇంట్లోకే సరిపోవడం లేదు మళ్లీ ఇప్పుడు పిల్లలు అంటే వారి చదువుల కోసం కోట్లు ఖర్చు అవుతాయి. అవి తన దగ్గర లేదు కాబట్టి పిల్లలు వద్దు అంటూ చెప్పుకొస్తాడు. కానీ చివరకు సుహాస్ భార్య సంగీర్తన గర్భవతి అవుతుంది. దీంతో షాక్ కు గురైన సుహాస్ కండోమ్ వాడినా కూడా తన భార్య గర్భవతి ఎలా అయ్యిందో తెలియక సతమతమవుతూ ఒక నిర్ణయానికి వచ్చి కండోమ్ పనిచేయలేదని, తన మిత్రుడు పత్తి కిశోర్‌తో (వెన్నెల కిశోర్) మాట్లాడి కండోమ్ కంపెనీపై రూ. కోటికి దావా వేస్తాడు. ఇలాంటి విషయంలో కోర్టుకు వెళ్లిన ప్రసాద్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరికి ఈ కేసులో గెలిచాడా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[4]
నటీనటులు
[మార్చు]- సుహాస్[5]
- సంగీర్తన
- రాజేంద్రప్రసాద్
- గోపరాజు రమణ
- వెన్నెల కిషోర్
- మురళి శర్మ
- ప్రభాస్ శ్రీను
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:దిల్‌రాజు ప్రొడక్షన్స్
- నిర్మాత: దిల్‌రాజు[6], హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సందీప్‌రెడ్డి బండ్ల
- సంగీతం: విజయ్ బుల్గానిక్
- సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్
- సమర్పణ: శిరీష్
- ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్
- ప్రొడక్షన్ డిజైనర్: అరసవిల్లి రామ్‌కుమార్
- కాస్ట్యూమ్ డిజైనర్: భరత్ గాంధీ
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అకుల్
మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (5 July 2024). "సుహాస్ .. జనక అయితే గనక మూవీ టీజర్ రిలీజ్". Archived from the original on 4 October 2024. Retrieved 4 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ 10TV Telugu (27 August 2024). "సుహాస్ 'జనక అయితే గనక' ట్రైలర్ రిలీజ్.. కండోమ్ పనిచేయలేదని కేసు పెడితే." (in Telugu). Archived from the original on 4 October 2024. Retrieved 4 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Chitrajyothy (4 October 2024). "ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్నా". Archived from the original on 4 October 2024. Retrieved 4 October 2024.
- ↑ Eenadu (12 October 2024). "రివ్యూ: జనక అయితే గనక.. సుహాస్ కామెడీ ఎంటర్‌టైనర్ మెప్పించిందా?". Retrieved 31 October 2024.
- ↑ TV9 Telugu (2 July 2024). "జనక అయితే గనక అంటున్న సుహాస్.. మరో డిఫరెంట్ మూవీతో టాలెంటడ్ యాక్టర్". Archived from the original on 4 October 2024. Retrieved 4 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (4 October 2024). "ఆద్యంతం నవ్వించే చిత్రమిది". Archived from the original on 4 October 2024. Retrieved 4 October 2024.