Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

ఖిలాడి

వికీపీడియా నుండి
ఖిలాడి
దర్శకత్వంరమేశ్‌ వర్మ
రచనరమేష్ వర్మ
నిర్మాతహవీష్‌,
  • సత్యనారాయణ కోనేరు[1]
  • రమేష్ వర్మ
తారాగణం
ఛాయాగ్రహణంసుజిత్ వాసుదేవ్
జీకే విష్ణు
కూర్పుఅమర్ రెడ్డి కుడుములు
సంగీతందేవిశ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
  • ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్
విడుదల తేదీ
2022 ఫిబ్రవరి 11
దేశం భారతదేశం
భాషతెలుగు

ఖిలాడి 2022లో సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ నేపథ్యంలో రూపొందిన తెలుగు సినిమా. రవితేజ హీరోగా, డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఖిలాడి టీజర్‏ను 2021, ఏప్రిల్ 12న విడుదల చేశారు.[2] ఈ సినిమా 2021, మే 28న విడుదల కావాల్సి ఉండగా కరోనా పరిస్థితుల కారణంగా చిత్ర విడుదలను వాయిదా వేశారు.[3] ఈ సినిమా ట్రైలర్‌ 2022 ఫిబ్రవరి 7న, సినిమా 2022 ఫిబ్రవరి 11న విడుదలైంది.[4][5] 'ఖిలాడి' డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ ఓటీటీలో మార్చి 11 నుంచి స్ట్రీమింగ్ అయింది.[6]

మోహన్ గాంధీ (రవితేజ) భార్యను హత్య చేసిన నేరంపై జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. క్రిమినల్‌ సైకాలజీ స్టూడెంట్‌ పూజా (మీనాక్షి చౌదరి), ఇంటెలిజెన్స్‌ ఐజీ జయరామ్‌ (సచిన్‌ ఖేడ్కర్‌) కుమార్తె. తన థీసిస్ కోసం సెంట్రల్‌ జైల్‌లో ఖైదీగా ఉన్న మోహన్‌గాంధీ (రవితేజ)ను కలుస్తుంది. తను చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నానంటూ గాంధీ పూజకు తన గతం వివరిస్తాడు. గాంధీ గతం విన్న పూజా తనకు బెయిల్‌ వచ్చేలా చేస్తుంది. జైలు నుంచి బయటపడ్డ గాంధీ నిజ స్వరూపం తెలిసి పూజ షాకవుతుంది.

ఈ క్రమంలో గాంధీ ఓ క్రిమినల్‌ అని, హోం మినిష్టర్‌ (ముఖేష్‌ రుషి)కు ఇటలీ నుంచి వచ్చే పది వేల కోట్ల రూపాయలను కొట్టేయాలనే వేసే ప్లాన్‌లో భాగంగానే అతను జైల్లోకి వచ్చాడని, ఆ తర్వాత జైలు నుంచి బయటకు రావడానికి తనను అడ్డుం పెట్టుకొని ఓ కట్టుకథ చెప్పాడని తెలుసుకుంటుంది. ఇంతకీ గాంధీ ఎవరు?? ఈ పది వేల కోట్ల డబ్బుల డీల్ తో అతడికి సంబంధమేంటి, చివరికీ డబ్బులు ఎవరి సొంతమయ్యాయి అనేదే మిగతా సినిమా కథ.[7][8]

చిత్రం నిర్మాణం

[మార్చు]

‘ఖిలాడి’ సినిమా షూటింగ్ 2020, అక్టోబరులో ప్రారంభమైంది.[9] ఈ సినిమాకు సంబంధించి యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు.[10][11]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (8 February 2022). "ఖిలాడి... హాలీవుడ్‌ సినిమాలా ఉంటుంది!". Archived from the original on 11 March 2022. Retrieved 11 March 2022.
  2. HMTV (12 April 2021). "Ravi Teja: 'ఖిలాడీ' టీజర్.. డేంజరస్ గా కనిపిస్తున్న మాస్ మహారాజ్". Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
  3. Eenadu (5 May 2021). "Raviteja: 'ఖిలాడి' వాయిదా - Raviteja khiladi movie release postponed". www.eenadu.net. Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
  4. TV 5 News (7 February 2022). "ఖిలాడి ట్రైలర్ వచ్చేసింది..!" (in ఇంగ్లీష్). Retrieved 7 February 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  5. Sakshi (8 February 2022). "ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే కొత్త చిత్రాలివే." Archived from the original on 11 February 2022. Retrieved 11 February 2022.
  6. Andhra Jyothy (5 March 2022). "ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ఖిలాడీ'..ఎప్పటినుంచి అంటే..!". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
  7. Namasthe Telangana (11 February 2022). "మాస్ ప్రేక్షకులే లక్ష్యంగా.. "ఖిలాడి"". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
  8. Andhra Jyothy (16 February 2022). "సినిమా రివ్యూ : 'ఖిలాడి'". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
  9. The News Minute (19 October 2020). "Ravi Teja unveils first look of his upcoming film 'Khiladi'". Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
  10. Sakshi (20 March 2021). "తెలివైన ఆట". Sakshi. Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
  11. 10TV (25 March 2021). "khiladi shooting : ఇటలీలో ఖిలాడీ...పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ఇటలీలో ఖిలాడీ...పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ | Ravi Teja Movie Khiladi Shooting In Italy". 10TV (in telugu). Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  12. Namasthe Telangana (8 February 2022). "'ఖిలాడి'తో చెట్టపట్టాల్‌". Archived from the original on 11 March 2022. Retrieved 11 March 2022.
  13. Andhra Jyothy (7 February 2022). "రాజశేఖర్‌గా రావు రమేశ్". Archived from the original on 7 February 2022. Retrieved 7 February 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=ఖిలాడి&oldid=4205267" నుండి వెలికితీశారు