వీడెవడు
| వీడెవడు | |
|---|---|
![]() | |
| దర్శకత్వం | తాతినేని సత్య |
| స్క్రీన్ ప్లే | కన్నన్ తాతినేని సత్య |
| కథ | తాతినేని సత్య |
| నిర్మాత | రైనా జోషి |
| తారాగణం | సచిన్ జె. జోషి ఈషా గుప్తా ప్రభు |
| ఛాయాగ్రహణం | బినేంద్ర మీనన్ |
| కూర్పు | ప్రవీణ్ పూడి |
| సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | వికింగ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 2017 సెప్టెంబరు 15 |
| దేశం | భారతదేశం |
| భాషలు | తెలుగు తమిళ్ |
వీడెవడు 2017లో విడుదశాలైన తెలుగు సినిమా. వికింగ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రైనా జోషి నిర్మించిన ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహించగా ఎస్.ఎస్. తమన్ సంగీతమందించాడు. సచిన్ జె. జోషి, ఈషా గుప్తా, కిషోర్, ప్రభు, శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదలైంది.
కథ
[మార్చు]సత్య (సచిన్ జోషి) ప్రేమించి పెళ్లి చేసుకొన్న తన భార్య శ్వేత (ఈషా గుప్తా)ను ఫస్ట్ నైట్ రోజే హత్య చేసిన కేసులో గోవా జైలుకి 14 రోజుల రిమాండ్ కు వెళ్తాడు. ఆ కేస్ డీల్ చేసే బాధ్యతను పోలీస్ అధికారి ప్రకాష్ (కిషోర్)కు అప్పగిస్తుంది. కేస్ ను స్టడీ చేయడం మొదలెట్టిన ప్రకాష్ కి సత్య అసలు హంతకుడు కాడని, ఈ హత్య వెనుక వేరే కారణం ఉందని తెలుసుకొంటాడు. ఇంతకీ ఆ కారణం ఏమిటి?? ఈ హత్య వెనుక ఉన్నదెవరు ? అనేదే మిగతా సినిమా కథ.[1]
నటీనటులు
[మార్చు]- సచిన్ జె. జోషి
- ఈషా గుప్తా[2]
- కిషోర్
- ప్రభు
- శ్రీనివాస రెడ్డి
- వంశీ కృష్ణ
- సతీష్
- సుప్రీత్
- వెన్నెల కిషోర్
- ఢిల్లీ గణేష్
- ధన్య బాలకృష్ణ
- ప్రతాప్ పోతన్
- శత్రు
- ఖయ్యుమ్
- బెనర్జీ
- కిరణ్
- శశి
- మ్యాడీ
- సంతోష్
- షాని
- సాజిద్ సౌజా
నిర్మాణం
ఈ చిత్రం గురించి మొదటిసారిగా 2015 మేలో తెలుగు దర్శకుడు తాతినేని సత్య, సచిన్ జె. జోషి, ఇషా గుప్తా ప్రధాన పాత్రల్లో తెలుగు, తమిళ భాషల్లో ఒక ద్విభాషా చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించారు.[3]అయితే, సినిమా షూటింగ్ ఏడాది ఆలస్యంగా 2016 మేలో ప్రారంభమైంది.మొదటిగా చిత్ర బృందం పోలాండ్‌లో ఒక పాటను చిత్రీకరించింది.[4] ఈ చిత్రానికి తెలుగులో వీడెవడు అని, తమిళంలో యార్ ఇవన్ (Yaar Ivan) అని పేరు పెట్టారు. 2016 డిసెంబర్ నాటికి చిత్ర నిర్మాణం పూర్తయింది.[5]
పాటలు
ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకత్వం వహించారు.
| వీడెవడు | |
|---|---|
| సినిమా పాటలు by | |
| Released | 2017 |
| Genre | సినిమా పాటలు |
| Length | 19:07 |
| Label | లహరి మ్యూజిక్, టి-సిరీస్ |
| సం. | పాట | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|
| 1. | "ఎలా ఎలా" | ఎం. ఎం. మానసి | 4:26 |
| 2. | "నిన్నే నేను ప్రేమిస్తున్నా" | ఎం. ఎం. మానసి | 3:43 |
| 3. | "కా కా కా కాకులు" | దీపక్, ఎంసీ విక్కీ | 3:12 |
| 4. | "సరిగమ" | గీతా మాధురి, ఎం. ఎం. మానసి | 3:57 |
| 5. | "సుశీల" | సమీరా భరద్వాజ్ | 3:50 |
| మొత్తం నిడివి: | 19:08 | ||
మూలాలు
[మార్చు]- ↑ Ranjith, Gabbeta. "Veedevadu: A watch-worthy thriller with an interesting second half". Telangana Today. ఒరిజినల్ నుండి 27 January 2019 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 January 2022.
- ↑ "Esha Gupta to debut in Tollywood in Sachiin Joshi's next – Times of India". indiatimes.com. ఒరిజినల్ నుండి 27 December 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 November 2018.
- ↑ "- Telugu Movie News – IndiaGlitz.com". indiaglitz.com. ఒరిజినల్ నుండి 4 November 2018 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 November 2018.
- ↑ "Esha Gupta to debut in Tollywood in Sachiin Joshi's next". indiatimes.com. ఒరిజినల్ నుండి 27 December 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 November 2018.
- ↑ "Interview: Second Half Is Heart of Shankara says Tatineni Satya – Korada.com". koradanews.com. 20 October 2016. ఒరిజినల్ నుండి 4 November 2018 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 November 2018.
- ↑ "Veedevadu Songs Download - Free Online Songs @ JioSaavn". 7 July 2017. the original నుండి 9 నవంబర్ 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 November 2023.
{{cite web}}: Check date values in:|archive-date=(help)
