తాతినేని సత్య
తాతినేని సత్య | |
---|---|
జననం | |
విద్యాసంస్థ | లయోలా కళాశాల, చెన్నై |
వృత్తి | సినిమా దర్శకుడు స్క్రీన్ ప్లే రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2010 - ప్రస్తుతం |
తాతినేని సత్య, తెలుగు, తమిళ సినీ దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత.[1] ఇతడు తెలుగు సినీ దర్శకుడైన తాతినేని ప్రకాశరావు మనవడు.
జీవిత విషయాలు
[మార్చు]చెన్నైలో జన్మించిన సత్య అక్కడే పాఠశాల విద్యను పూర్తి చేసి, చెన్నైలోని లయోలా కాలేజీ నుండి విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీ అందుకున్నాడు.
సినిమారంగం
[మార్చు]2001లో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన జోడి నంబర్ 1 సినిమాకు సహాయ దర్శకుడిగా చేరాడు. డేవిడ్ దగ్గర మరో ఎనిమిది సినిమాలకు పనిచేశాడు. 2005లో ప్రియ దర్శకత్వంలో వచ్చిన కంద నాల్ ముధల్ అనే తమిళ చిత్రానికి సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు.[2]
2009లో తమిళంలో విడుదలై విజయం సాధించిన వెన్నిల కబాడి కుజు అనే సినిమాను 2010లో భీమిలి కబడ్డీ జట్టు పేరుతో రిమేక్ చేశాడు.[3] ఆ తరువాత 2012లో శివ మనసులో శృతి (2009లో వచ్చిన శివ మనసుల శక్తి అనే తమిళ సినిమా రీమేక్) తీశాడు.[4] ఆ తర్వాత 2016లో శంకర (2011లో వచ్చిన మౌన గురు అనే తమిళ సినిమా రీమేక్) తీశాడు.[5][6]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|
2010 | భీమిలి కబడ్డీ జట్టు | తెలుగు | |
2012 | శివ మనసులో శృతి | తెలుగు | |
2016 | శంకర | తెలుగు | |
2017 | యార్ ఇవాన్ వీడెవడు |
తమిళం తెలుగు |
మూలాలు
[మార్చు]- ↑ "Tatineni Satya". timesofindia.indiatimes.com. Retrieved 29 April 2021.
- ↑ "Tatineni Satya interview - Telugu Cinema interview - Telugu film director". www.idlebrain.com. Retrieved 29 April 2021.
- ↑ "Satya Tatineni". filmytoday.com. Archived from the original on 29 ఏప్రిల్ 2021. Retrieved 29 April 2021.
- ↑ "SMS Telugu film review - Telugu cinema Review - Sudheer Babu & Regina". www.idlebrain.com. Retrieved 29 April 2021.
- ↑ "Shankara Movie Review". www.timesofindia.indiatimes.com. Retrieved 29 April 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Shankara telugu movie review". 123telugu.com. 2016-10-21. Retrieved 29 April 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link)
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో తాతినేని సత్య పేజీ