డేవిడ్ ధావన్
డేవిడ్ ధావన్ (జననం 1955 ఆగస్టు 16[1]) ప్రముఖ భారతీయ దర్శకుడు. ఆయన అసలు పేరు రాజిందర్ ధావన్. పూణె లోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో నటన నేర్చుకునేందుకు ప్రయత్నించి, ఎడిటింగ్ నేర్చుకున్నారు.
తొలినాళ్ళ జీవితం[మార్చు]
డేవిడ్ పంజాబ్ అగర్తలలోని పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. తన తండ్రి యూకో బ్యాంక్ మేనేజర్ కావడంతో వారి కుటుంబ కాన్పూర్ కు ట్రాన్స్ ఫర్ పై వెళ్ళింది. 12వ తరగతి వరకు క్రైస్ట్ చర్చ్ కళాశాలలోనే చదువుకున్నారు. ఆ తరువాత పుణే లోని ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటన నేర్చుకునేందుకు చేరారు. కానీ సతీష్ షా, సురేష్ ఒబెరాయ్ వంటి వారిని చూసి, నటన తన వల్ల అవ్వదని భావించి, ఎడిటింగ్ నేర్చుకున్నారు డేవిడ్.
కెరీర్[మార్చు]
దర్శకత్వంలోకి రాకముందు ధావన్ ఎడిటర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టారు. కామెడీ సినిమాలు దర్శకత్వం చేయడంలో సిద్ధహస్తుడు ఆయన.[2] 1993లో విడుదలైన ఆంఖే ఆయన కెరీర్ లోనే అతి పెద్ద హిట్.[2] పార్టనర్ (2007) సినిమా కూడా మంచి విజయం సాధించింది.[3]
ఆసియా ఫిలిం & టెలివిజన్ అకాడమీ, ఆసియా స్కూల్ ఆఫ్ మీడియా స్టడీస్ బోర్డలలో డేవిడ్ సభ్యునిగా ఉన్నారు. ఆసియా స్కూల్ ఆఫ్ మీడియా స్టడీస్ నుండి సందీప్ మార్వా ధావన్ కు అకాడమీ అవార్డు ఇచ్చి గౌరవించారు. 2008లో స్టార్ ప్లస్ లో వచ్చే నచ్ బలియా 3 లోనూ, హన్స్ బలియా షోలలోనూ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు ఆయన.
గోవిందా తో కలసి..[మార్చు]
గోవిందా తో ఎన్నో సినిమాలు తీశారు డేవిడ్. తాకత్వర్ (1989) వీరీ కాంబినేషన్ లో మొదటి సినిమా. వీరిద్దరూ దాదాపు 17 కామెడీ సినిమాలు చేశారు. తాకత్వర్ (1989), స్వర్గ్ (1990), షోలాఔర్ షబ్నమ్ (1992), ఆంఖే (1993), రాజా బాబు (1996), కూలీ నెం.1 (1995), సాజన్ చలే ససురాల్ (1996), బనారసీబాబు (1997), దీవానా మస్తానా (1997), హీరో నెం.1 (1997), బడే మియాన్ చోటే మియాన్ (1998), హసీనా మాన్ జాయేగి (1999), కున్వారా (2000), జోడి నెం.1 (2001), ఏక్ ఔర్ ఏఖ్ గ్యారాహ్ (2003), పార్ట్ నర్ (2007), డు నాట్ డిస్టర్బ్ (2009) సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. ఇందులో పార్ట్ నర్ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా నటించారు. ఈ సినిమా 300 మిలియన్లు వసూలు చేసింది.[4] అదే సంవత్సరంలో ధావన్ ను, గోవిందాను తన షో 10 కా దమ్ కు అతిధులుగా పిలిచారు సల్మాన్.
వ్యక్తిగత జీవితం[మార్చు]
ధావన్ భార్య కరుణ[5][6]. వీరికి ఇద్దరు కుమారులు రోహిత్ ధావన్, వరుణ్ ధావన్. నటుడు అనిల్ ధావన్ డేవిడ్ సోదరుడు. అతని మేనల్లుడు సిద్దార్ధ్ ధావన్ కూడా నటుడే.[7]
సినిమాలు[మార్చు]
సంవత్సరం | చిత్రం |
---|---|
1989 | ఆంధియాన్ |
తాకత్వార్ | |
గోలా బరోడ్ | |
1990 | స్వర్గ్ |
ఆగ్ కా గోలా | |
జర్రత్ | |
1992 | షోలా ఔర్ షబ్నమ్ |
బోల్ రాధా బోల్ | |
1993 | ఆంఖే |
1994 | రాజా బాబు |
ఏనా మీనా డీకా | |
అందాజ్ | |
1995 | యరానా |
కూలీ నెం.1 | |
1996 | లోఫర్ |
సాజన్ చలే ససురాల్ | |
1997 | మిస్టర్ & మిసెస్ ఖిలాడి |
బనారసీ బాబు | |
జుద్వా | |
దీవానా మస్తానా | |
హీరో నెం.1 | |
1998 | ఘర్ వాలీ భర్ వాలీ |
బడే మియాన్ చోటే మియాన్ | |
1999 | బీవీ నెం.1 |
హసీనా మాన్ జాయేగా | |
2000 | దుల్హన్ హమ్ లే జాయేంగే |
కున్వారా | |
చల్ మేరే భాయ్ | |
2001 | జోడి నెం.1 |
2002 | చోర్ మచాయే షోర్ |
యే హై జ్వాలా | |
హమ్ కసీ సే కమ్ నహీ | |
2003 | ఏక్ ఔర్ ఏక్ గ్యారహ్ |
2004 | ముజ్సే షాదీ కరోగీ |
2005 | షాదీ నెం.1 |
మైనే ప్యార్ క్యూ కియా | |
2007 | పార్ట్ నర్ |
2009 | డు నాట్ డిస్టర్బ్ |
2011 | రాస్కెల్స్ |
2013 | చష్మే బుడ్డోర్ |
2014 | మై తేరా హీరో |
అవార్డులు, నామినేషన్లు[మార్చు]
సంవత్సరం | చిత్రం | పురస్కారాలు | కేటగిరి | ఫలితం |
---|---|---|---|---|
1994 | ఆంఖే | ఫిలింఫేర్ అవార్డులు | ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు అవార్డు | నామినేషన్ |
2000 | బీవీ నెం.1 | ఫిలింఫేర్ అవార్డులు | ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు అవార్డు | నామినేషన్ |
ఫిలింఫేర్ ఉత్తమ చిత్రం అవార్డు | నామినేషన్ | |||
2005 | ముజ్సే షాదీ కరోగీ | అంతర్జాతీయ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డులు | ఐఫా ఉత్తమ దర్శకుడు అవార్డు | నామినేషన్ |
2014 | మై తేరీ హీరో | స్టార్ డస్ట్ అవార్డులు | స్టార్ డస్ట్ అవార్డ్ ఫర్ డ్రీం డైరెక్టర్ | నామినేషన్ |
బిగ్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ అవార్డులు | బిగ్ స్టార్ మోస్ట్ ఎంటర్టైనింగ్ కామెడీ ఫిలిం | గెలుచుకుంది |
మూలాలు[మార్చు]
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>
కాదు;timesofindia.indiatimes.com
అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 2.0 2.1 David Dhawan > Biography. Yahoo! Movies. URL accessed on 7 December 2010.
- ↑ Box Office 2007. BoxofficeIndia.com. URL accessed on 7 December 2010.
- ↑ indiaglitz.com. indiaglitz.com. URL accessed on 6 July 2010.
- ↑ Baddhan, Raj (3 April 2014). Varun Dhawan's grandmother passes away. Biz Asia. URL accessed on 20 April 2014.
- ↑ Muthanna, Anjali (3 April 2014). Bangalore girls go selfie-crazy with Varun Dhawan. Times of India. URL accessed on 20 April 2014.
- ↑ Rajiv Vijayakar (26 July 2012). Numero Unos: A Survey Of The Top Hit Films – Part 5: Whizkid directors. Bollywood Hungama. URL accessed on 20 August 2012.