మోసగాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోసగాడు
(1980 తెలుగు సినిమా)
Mosagadu poster.jpg
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం క్రాంతి కుమార్
కథ సత్యానంద్ (మూలం: సుభాష్ ఘాయ్)
తారాగణం శోభన్ బాబు,
చిరంజీవి,
శ్రీదేవి
సంగీతం చక్రవర్తి
ఛాయాగ్రహణం కె.ఎస్.ప్రకాష్
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

మోసగాడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1980 లో వచ్చిన తెలుగు సినిమా. ఈ చిత్రంలో శోభన్ బాబు, చిరంజీవి, శ్రీదేవి కపూర్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.[1] ఈ చిత్రాన్ని రాజ్ కపూర్ - శత్రుఘన్ సిన్హా నటించిన ఖాన్ దోస్త్ ఆధారంగా రూపొందించారు . ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది. తన కెరీర్‌లో తొలిసారిగా చిరంజీవి ఈ చిత్రంలో విలన్‌గా నటించాడు.

కథ[మార్చు]

ప్రేమికులైన శోభన్ బాబు, శ్రీదేవి త్వరలో వివాహం చేసుకోవాలని యోచిస్తున్నారు. చిరు స్థానిక రౌడీ షీటర్. ఇతడికి శ్రీదేవి కవల సోదరి (ద్వంద్వ పాత్ర) తో సంబంధం ఉంది. శ్రీదేవి తన కవల సోదరి పద్ధతికి దూరంగా ఉంటుంది. శోభన్ ఆమెను పెళ్ళి చేసుకుని ఆమెకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. కానీ, చిరుకు శ్రీదేవిపైన కూడా కన్నుంది. ఈ విషయమై శోభన్ చేతిలో కొన్ని సార్లు దెబ్బలు తిన్నాడు. అతను వారిపై పగ పెంచుకుంటాడు. ఒక రోజు, శోభన్ శ్రీదేవి ఒక ఆలయంలో పెళ్ళి చేసుకోబోతున్నప్పుడు, ఆమె ఒంటరిగా శోభన్ కోసం ఎదురు చూస్తుండడం గమనిస్తాడు. అతను ఆమెపై అత్యాచారం చేస్తాడు. ఈ అవమానాన్ని భరించలేక, ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె చనిపోయే ముందు, శోభన్ అక్కడకు చేరుకుంటాడు. ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. చివరికి, శోభన్ చిరును చంపేస్తాడు. అతడికి మరణశిక్ష పడుతుంది. సినిమా చివర్లో శోభన్ శ్రీదేవి స్వర్గంలో కలుసుకున్నట్లు చూపిస్తారు.

తారాగణం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Mosagadu Preview, Mosagadu Story & Synopsis, Mosagadu Telugu Movie". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-08-22.
"https://te.wikipedia.org/w/index.php?title=మోసగాడు&oldid=3717677" నుండి వెలికితీశారు