కొండవీటి రాజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొండవీటి రాజా
దర్శకత్వంకె.రాఘవేంద్రరావు
రచనపరుచూరి సోదరులు (కథ/మాటలు)
నిర్మాతదేవి వరప్రసాద్
తారాగణంచిరంజీవి,
విజయశాంతి,
రాధ
ఛాయాగ్రహణంకె. ఎస్. ప్రకాష్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
దేవి ఫిలిం ప్రొడక్షన్స్
విడుదల తేదీ
1986 జనవరి 31 (1986-01-31)
భాషతెలుగు

కొండవీటి రాజా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తెలుగు చిత్రం. ఈ సినిమా 1986 జనవరి 31న విడుదలైంది.[1] గద్వాల ప్రాంతానికి చెందిన సినీ ఫైనాన్షియర్, నిర్మాత బుర్రి వెంకట్రామిరెడ్డి నిర్మాణంలో ఈ చిత్రం వచ్చింది.

కథ[మార్చు]

రాజా అనే వ్యక్తి రత్నగరి అనే గ్రామానికి పని కోసం వెతుక్కుంటూ వస్తాడు. ఈ గ్రామంలో ఒక పురాతనమైన కోట, జలదుర్గం లాంటి చారిత్రక ప్రదేశాలు ఉంటాయి. బస్సు దిగగానే రాజాకి ఆ ఊరి పోస్టు మాస్టరు కూతురు రాణి పరిచయమై వాళ్ళ ఇంట్లో అద్దెకు దిగుతాడు. అదే ఊళ్లో ఉన్న వెంకట్రాయుడికి పద్మ అనే కూతురు ఉంటుంది. ఈమె అతనికి మొదటి భార్య కూతురు. పద్మ సవతి తల్లి చేతిలో బాధలు పడుతూ ఉంటుంది. తండ్రి కూడా ఆమెను ఎదిరించలేకుండా ఉంటాడు.

చిత్రీకరణ[మార్చు]

నిర్మాత గద్వాల ప్రాంతానికి చెందిన వారైనందున సినిమాలో చాలా సన్నివేశాలు గద్వాల పరిసరప్రాంతాల్లో చిత్రీకరించారు. దాదాపు నెలరోజులకు పైగా గద్వాల కోటలో షూటింగు జరిగింది. కోట చుట్టూ ఉండిన కందకంలో, కోటలోపలి బావి దగ్గర ఫైటింగ్‌లు చిత్రీకరించారు. కోటలోపల ఆలయ సముదాయంలో అంగాంగ వీరాంగమే పాట చిత్రీకరణ జరిగింది. దాదాపు సినిమా చివరి ఘట్టాలన్నీ కోటలోనే చిత్రీకరించారు. గద్వాల పరిసరాల్లోని అనంతపూర్ గ్రామంలోని ప్రధాన కూడలి అయిన గాంధీ విగ్రహం వద్ద, బిసి కాలనీలోని చెట్టు కింద ఉన్న తులసి మొక్కకు పూజలు, పరిసర కాలనీల్లోని రహదారులలో పలు దృశ్యాలు చిత్రీకరించారు.[2]

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

చక్రవర్తి సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలన్నీ వేటూరి సుందరరామ్మూర్తి రాశాడు.

  1. అంగాంగ వీరంగమే అమ్మమ్మో చదరంగమే
  2. కొమ్మలకి కోయిలకి పాటలకి పల్లవికి కొండ కోన సందిట్లోన పెళ్ళీ
  3. మంచమేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను రారా రారా
  4. నా కోక బాగుందా నా రైక బాగుందా హొయ్ హొయ్ హొయ్
  5. ఊరికంత నీటుగాడె ఢాం ఢాం ఢాం
  6. యాల యాల ఉయ్యాలలోన యెల్లాకిల్లా జంపాలలోన

మూలాలు[మార్చు]

  1. "కొండవీటి రాజా". youtube.com. ఓల్గా వీడియో. Retrieved 8 April 2018.
  2. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, తేది 28.02.2009 పేజీ 2