నిర్ణయం (సినిమా)
నిర్ణయం (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ప్రియదర్శన్ |
---|---|
తారాగణం | అక్కినేని నాగార్జున , అమల సుకుమారి |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నిర్ణయం 1991లో వచ్చిన తెలుగు చిత్రం. మలయాళీ దర్శకుడు ప్రియదర్శన్ ఈ చిత్రముతో తెలుగులో అరంగ్రేటం చేసారు. మురళీమోహన్ సమర్పణలో జయభేరీ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.కిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ వారికి ఇది మొదటి చలన చిత్రము. నాగార్జునా అమలలు నాయికానాయకులుగా నటించగా, ఇళయరాజా స్వరాలు సమకూర్చారు.[1][2][3][4][5]
ఈ చిత్రం 1989లో ప్రియదర్శన్ దర్శకత్వములో మోహన్‌లాల్ నటించిన వందనం అనే మలయాళీ చిత్రానికి పునర్నిర్మాణము. వందనం చిత్రం 1987లో వచ్చిన స్టేక్ ఔట్ (Stakeout) అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా తీయబడింది. నిర్ణయం చిత్రాన్ని తమిఴంలో (తమిళంలో) 'సంబవం'గా, హిందీలో గిరఫ్తారీగా అనువదించారు.[6]
కథ
[మార్చు]వంశీకృష్ణ (నాగార్జున) నిజాయితీపరుడైన పోలీసు అధికారి. రఘురామ్ (మురళీమోహన్) అనే ఒక భయంకరమైన నేరస్తుణ్ణి పట్టుకునేందుకు అతన్నీ, ఇంకో ఇద్దరు పోలీసు అధికారులనూ అండర్‌కవర్‌లో పంపిస్తారు పోలీసు కమీషనర్ (గిరిబాబు). ఆ ఇద్దరిలో ఒకడు తనకు చదువుకునే రోజులనుండీ మిత్రుడైన శివరాం (శుభలేఖ సుధాకర్). వంశీ రఘురామ్ కూతురు గీత (అమల) ఉన్న ఇంటికి ఎదురింట్లో ఉంటూ ఆమెపై నిఘా పెడతాడు. గీత జోలీ (సుకుమారి) అనే పెద్దావిడతో పాటు ఆ ఇంట్లో ఉంటోంది. వంశీ టెలిఫోన్ ఇన్స్పెక్టర్‌గా తనను తాను గీతకు పరిచయం చేసుకుని స్నేహం పెంచుకుంటాడు. క్రమంగా వారిరువురూ ప్రేమించుకుంటారు. ఐతే వంశీ తన తండ్రిని పట్టుకోవడానికి వచ్చిన పోలీసు అని తెలిసాక, గీత అతన్ని దూరం పెడుతుంది. ఐనప్పటికీ చివరికి గీత ద్వారా రఘురామ్‌ని పట్టుకున్న వంశీ అతను నిరపరాధి అని తెలుసుకుంటాడు. అసలు నేరస్తుడు ప్రహ్లాద్ (శరత్ సక్సేనా) రఘురామ్‌ను మోసం చేసి ఈ కేసులో ఇరికించాడని అర్థం చేసుకుంటాడు. ఈ దర్యాప్తు క్రమంలో చనిపోయిన తన మిత్రుడు శివరాంని హత్య చేసింది కూడా ప్రహ్లాద్ అని కనిపెట్టిన వంశీ, అతనిపై పగ తీర్చుకోవాలని నిశ్చయించుకుంటాడు. ప్రహ్లాద్ ఒకరోజు స్టేడియంలో ఉండగా, అక్కడ బాంబు ఉందని వంశీ వదంతిని సృష్టిస్తాడు. అప్పుడు జరిగిన గందరగోళంలో రఘురాం ప్రహ్లాద్‌ను చంపేస్తాడు. వంశీ గీతలు మళ్ళీ కలవడంతో కథ సుఖాంతమవుతుంది.
తారాగణం
[మార్చు]- ఇన్స్పెక్టర్ వంశీకృష్ణగా నాగార్జున
- గీతగా అమల
- రఘురామ్‌గా మురళీమోహన్
- ప్రహ్లాద్ రావ్‌గా శరత్ సక్సేనా
- ఇన్స్పెక్టర్ శివరాంగా శుభలేఖ సుధాకర్
- పోలీసు కమిషనర్ నరహరిగా గిరిబాబు
- వంశీకి అమ్మగా అన్నపూర్ణా
- జోలీగా సుకుమారీ
- నళినీగా జ్యోతీ
- యాదగిరిగా సుత్తివేలు
- చిన్ని జయంత్
- అల్లు రామలింగయ్య
- అతిథి పాత్రలో చారుహాసన్
- ఛోటా కె. నాయుడు
- ప్రధానోపాధ్యాయుడిగా భీమేశ్వర్రావు
- వినోద్‌గా ప్రసన్నకుమార్
- అనార్కలిగా రాజీవీ
- పొట్టి వీరయ్య
- హుస్సేన్
ఇతర చిత్ర బృందం
[మార్చు]- కళా దర్శకత్వం: తోటా తరణి
- నృత్య దర్శకత్వం: సుందరం మాస్టర్, పులియూరు సరోజా, తారా
- స్టిల్స్: కె. సత్యనారాయణ
- పోరాటాలు: త్యాగరాజన్
- ఉప దర్శకుడు: ఆర్. ఆర్. షిండే
- సంభాషణలు: గణేశ్ పాత్రో
- ఎడిటింగ్: ఎన్. గోపాలకృష్ణన్
- ఛాయాగ్రహణము: ఎస్.కుమార్
- సంగీతము: ఇళయరాజా
- సమర్పకులు: మురళీమోహన్
- నిర్మాత: డి.కిశోర్
- కథా, స్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రియదర్శన్
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని "హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం" అనే బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట బహుళ ప్రజాదరణ పొందినది.
- ఎంత ఎంత దూరం (గాయకులు: బాలు, చిత్ర)
- ఎపుడెపుడండీ (గాయకులు: బాలు, జానకి)
- ఓ పాపలూ పాపలు ఐ లవ్ యూ (గాయకులు: బాలు, స్వర్ణలత)
- మిల మిల మెరిసెను తార (గాయకులు: మనో, జానకి)
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telugu star Nagarjuna's wife Amala roped in for cameo in Bollywood film". Mid-Day. 16 December 2014. Retrieved 4 October 2016.
- ↑ James, Anu (7 September 2016). "'Oppam': 5 reasons to watch Mohanlal and Priyadarshan's movie". International Business Times. Retrieved 4 October 2016.
- ↑ "Legacy continues". The Hindu. 22 September 2012. Retrieved 4 October 2016.
- ↑ "Happy Birthday Nagarjuna. Still Captain Of Hearts @57". NDTV Movies. 29 August 2016. Retrieved 4 October 2016.
- ↑ "Nagarjuna completes 30 years today". Telugu Cinema. 23 May 2016. Archived from the original on 5 అక్టోబరు 2016. Retrieved 4 October 2016.
- ↑ https://www.m.timesofindia.com/entertainment/kannada/movies/did-you-know/did-you-know-mohanlals-1989-malayalam-hit-vandanam-was-extensively-shot-in-bengaluru/amp_articleshow/82826287.cms