అమల అక్కినేని
అక్కినేని అమల | |
---|---|
![]() | |
జననం | అమల ముఖర్జీ సెప్టెంబర్ 24, 1968 పశ్చిమ బెంగాల్ భారత దేశము |
వృత్తి | జంతు సంక్షేమ కార్యకర్త, బ్లూక్రాస్ హైదరాబాద్ కన్వీనర్. |
ప్రసిద్ధి | తెలుగు సినిమా నటి |
భార్య / భర్త | అక్కినేని నాగార్జున |
పిల్లలు | అక్కినేని అఖిల్ |
అమల అక్కినేని, తెలుగు సినిమా నటి, జంతు సంక్షేమ కార్యకర్త. మొదటి పేరు అమల ముఖర్జీ , తల్లి ఐర్లాండ్ దేశస్థురాలు. తండ్రి బెంగాళీ.[1] ఆమె పశ్చిమ బెంగాల్‌లో జన్మించింది, ఆమె తండ్రి ఇండియన్ నేవీలో అధికారి.అమల భారతదేశంలోని హైదరాబాద్‌లోని బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్[2] , భారతదేశంలోని జంతువుల సంక్షేమం మరియు జంతు హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే ప్రభుత్వేతర సంస్థ (NGO) సహ వ్యవస్థాపకురాలు .
నటనా వృత్తి[మార్చు]
అమల తొలిసారిగా రాజేందర్ దర్శకత్వం వహించిన మైథిలి ఎనై కథలి అనే తమిళ చిత్రం లో నటించినది . ఇది భారీ విజయం సాధించింది. 1987 లో విడుదలైన నిశ్శబ్ద చిత్రం పుష్పక విమానం లో కమల్ హాసన్‌తో కలిసి అమల ప్రధాన పాత్ర పోషించింది . ఆమె 1991 మలయాళ చిత్రం ఉలడక్కమ్‌లో తన పాత్రకు ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. చెన్నైలో ప్రముఖ నాట్యకారిణి రుక్మిణీదేవి అరండేల్ వద్ద శాస్త్రీయ నృత్య శిక్షణ పొందుతున్న అమల తమిళ దర్శకుడు భారతీరాజా దృష్టిలో పడి ఆయన దర్శకత్వం వహించిన వైశాలి అనే తమిళ చిత్రం ద్వారా కథానాయికగా సినీరంగంలోనికి ప్రవేశించింది. తెలుగులో ఈమె మొదటి చిత్రం డి.రామానాయుడు నిర్మించిన చినబాబు చిత్రం ఇందులో కథానాయకుడు నాగార్జున. నాగార్జునతో ఆ చిత్ర నిర్మాణ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వారిరువురూ 11 జూన్ 1992న వివాహబంధం ద్వారా ఒక్కటయ్యేలా చేసింది. వీరిరువురికీ 1994లో అక్కినేని అఖిల్ అనే కుమారుడు కలిగాడు 1992లో నాగార్జునను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు స్వస్తి చెప్పింది, అయితే 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే తెలుగు సినిమాతో తిరిగి వచ్చింది.
అమల నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]
- చినబాబు
- పుష్పక విమానం
- శివ
- ప్రేమ యుద్ధం
- ఘర్షణ (1988)
- నిర్ణయం
- రాజా విక్రమార్క
- మనం (అతిథి పాత్ర)
- లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
- హై ప్రీస్టెస్ 2019 (వెబ్ సిరీస్)
- ఒకే ఒక జీవితం (2022)
అవార్డులు, గౌరవాలు[మార్చు]
సినిమా అవార్డులు[మార్చు]
సంవత్సరం | అవార్డు | అవార్డు వర్గం & పని |
---|---|---|
1989 | సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డులు | ఇల్లం, అగ్ని నట్చాతిరం |
1991 | ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు - మలయాళం – ఉల్లడక్కం |
2012 | ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు – తెలుగు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ |
2012 | సినీమా అవార్డులు | అత్యుత్తమ నటి – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ |
సాంఘిక సంక్షేమ పురస్కారాలు[మార్చు]
- 2012: యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి జీవ్ దయా పురష్కర్
- 2017: మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుండి నారీ శక్తి అవార్డు
అక్కినేని వంశ వృక్షం[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ Animal-loving Amala - Times of India సెప్టెంబర్ 1, 2001
- ↑ superuser. "Who we are". Blue Cross of Hyderabad (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-02-16.
{{cite web}}
:|last=
has generic name (help)