నారీశక్తి పురస్కారాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నారీశక్తి పురస్కారాలు
2019 పురస్కార గ్రహీతలతో మాజీ భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
Awarded forమహిళా సాధికారత కోసం చేసిన విశేష కృషికి గుర్తింపుగా జాతీయ అవార్డు
Sponsored byమహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం
Formerly calledస్త్రీ శక్తి పురస్కారం
Reward(s) 1–2 లక్షలు
మొదటి బహుమతి1999

నారీశక్తి పురస్కారం భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా వ్యక్తిగతంగా మహిళలకు లేదా మహిళా సాధికారత కోసం కృషి చేసే సంస్థలకు ఇచ్చే వార్షిక పురస్కారం.[1] భారతదేశంలో మహిళలకు అత్యున్నత పౌర గౌరవమిది. ఈ పురస్కారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) రోజున న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతిచే అందజేయబడుతుంది. 1999లో ఈ అవార్డును 'స్త్రీ శక్తి పురస్కారం' పేరుతో స్థాపించారు. 2015లో పేరు మార్చి పునర్వ్యవస్థీకరించారు. ఆరు సంస్థాగత, రెండు వ్యక్తిగత విభాగాలలో అందించబడుతుంది. 200000, 100000 రూపాయల నగదు బహుమతిని కలిగి ఉంటాయి.[1][2]

2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు నిర్భయకు మరణానంతరం, 2012 రాణి లక్ష్మీబాయి స్త్రీ శక్తి పురస్కారాన్ని అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. [3][4]

కేటగిరీలు

[మార్చు]

నారీశక్తి పురస్కారం ఆరు సంస్థాగత విభాగాలు, వ్యక్తిగత మహిళలకు రెండు విభాగాలలో ఇవ్వబడుతుంది.[1]

సంస్థాగత విభాగాలు

[మార్చు]

ఆరు సంస్థాగత విభాగాలకు భారతీయ చరిత్రలో ఒక ప్రముఖమైన మహిళ పేరు పెట్టబడింది.[5]

 • మహిళల సంక్షేమం, సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో ఉత్తమ ప్రైవేట్ రంగ సంస్థ లేదా ప్రభుత్వ రంగ సంస్థకు దేవి అహల్యా బాయి హోల్కర్ అవార్డు. మాల్వా రాజ్యం యొక్క 18వ శతాబ్దపు పాలకురాలు అహల్యాబాయి హోల్కర్ పేరు పెట్టారు.
 • పిల్లల లింగ నిష్పత్తిను మెరుగుపరిచిన ఉత్తమ రాష్ట్రానికి కన్నగి దేవి అవార్డు. తమిళ ఇతిహాసం శిలపతికారంలో ప్రధాన పాత్ర అయిన కన్నగి పేరు మీదుగా పేరు పెట్టారు.
 • మహిళలకు సేవలు, సౌకర్యాలను అందించినందుకు ఉత్తమ పట్టణ స్థానిక సంస్థగా మాతా జీజాబాయి అవార్డు. 17వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ తల్లి మాతా జిజాబాయి పేరు పెట్టారు.
 • మహిళల సంక్షేమం, శ్రేయస్సు కోసం అత్యుత్తమ కృషి చేస్తున్న పౌర సమాజ సంస్థకి రాణి గైడిన్లియు జెలియాంగ్ అవార్డు. 20వ శతాబ్దానికి చెందిన నాగా ఆధ్యాత్మిక, రాజకీయ నాయకురాలు రాణి గైడిన్లియు పేరు పెట్టారు.
 • మహిళా సాధికారత రంగంలో పరిశోధన, అభివృద్ధి కోసం ఉత్తమ సంస్థకు రాణి లక్ష్మీ బాయి అవార్డు. 1857 నాటి భారతీయ తిరుగుబాటులో ప్రముఖులలో ఒకరు, ఝాన్సీ రాణి అయిన లక్ష్మీబాయి పేరు పెట్టారు.
 • బేటీ బచావో, బేటీ పఢావో యోజనకు సంబంధించి మహిళా సంక్షేమ రంగంలో పని చేసినందుకు రెండు జిల్లా పంచాయతీలు, రెండు గ్రామ పంచాయతీలకు రాణి రుద్రమ్మ దేవి అవార్డు. 13వ శతాబ్దపు దక్కన్ పీఠభూమి పాలకురాలు రుద్రమ దేవి పేరు పెట్టారు.

వ్యక్తిగత విభాగాలు

[మార్చు]
 • ధైర్యం, ధైర్యసాహసాలకు అవార్డు
 • మహిళల ప్రయత్నానికి, కమ్యూనిటీ పనికి, లేదా ఒక మార్పు లేదా మహిళా సాధికారతకు అత్యుత్తమ సహకారం అందించినందుకు అవార్డులు.[6]]]
2014 మార్చి 8న న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా రాణి లక్ష్మీబాయి స్త్రీ శక్తి పురస్కారం (2013) మానసి ప్రధాన్‌కి పురస్కార ప్రదానం
గార్గి గుప్తా, ఇతర నారీ శక్తి పురస్కార గ్రహీతల (2017)తో మంత్రి మేనకా గాంధీ
అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా గ్రహీతలతో నరేంద్ర మోదీ

చరిత్ర

[మార్చు]

ఈ పురస్కారం 1999లో స్త్రీ శక్తి పురస్కారం పేరుతో స్థాపించబడింది.[7] ఇందులో 100,000 నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందించబడుతాయి. స్త్రీ శక్తి పురస్కారం నారీ శక్తి అవార్డు వలె ఆరు విభాగాలలో ఇవ్వబడింది.[8][9]

1999 to 2015 స్త్రీ శక్తి పురస్కారం
సంవత్సరం కన్నగి దేవి అవార్డు మాతా జీజాబాయి అవార్డు దేవి అహల్యాబాయి హోల్కర్ అవార్డు ఝాన్సీ కీ రాణి లక్ష్మీబాయి అవార్డు రాణి గైడిన్లియు అవార్డు రాణి రుద్రమ్మ దేవి అవార్డు
1999 కె. వి. రబియా[10] చిన్న పిళ్లై[11] బ్రహ్మచారిణి కమలా బాయి[12] కింక్రీ దేవి[13] కుమారి లలితా ప్రద్కర్
2001[14] సత్య రాణి ఛద్దా ముక్తా పి. దగ్లీ తమ్మా పవార్ మహ్-నాజ్ వార్సీ సుమని జోడియా
2002[15][16] మహజాబీ సర్బర్ సునీతా యాదవ్ శాంతా త్రివేది యమునా సరోజినీ దేవి ఆడా వీగాస్
2003[15][16] వందనా గోపీకుమార్ కమలా ఖోరా సునీతా కృష్ణన్ గోపా కొఠారి భాగీరథి దత్తా
2004[17][18] పింకీ విరాణి శంషాద్ బేగం కవితా శ్రీవాస్తవ త్రివేణి బాలకృష్ణ ఆచార్య మోన్మోహని దేబ్నాథ్
2005[17][18] షేక్ శంషాద్ బేగం సంధ్య రామన్ నీతా బహదూర్ రాణి బాంగ్ సాల్మిన్ లింగ్డో
2006[17][18] కల్పనా సర్కార్ నిఘత్ షఫీ పండిట్ డి. శాంతి వంగూరి సువార్త సేను సుహా
2007[19] అరుణ తార వి. విజయ వైష్ణవి జయకుమార్ రాణి దేవి బువాంగి సైలో
2008[20] మహే జబీన్ హీనా షా సునీతా దేవి జింగుబాయి శ్రావణ్ బోలాకే
2009[20] ఫూల్బసన్ బాయి యాదవ్ రష్మీ సింగ్ ఎం. విజయ వేద్ కుమారి ఘాయ్ సుగత కుమారి
2010[21] తాగు మాయ బర్దేవా మోనికా ఎస్. గార్గ్ పొట్టబతిని పద్మావతి రత్నమ్మ
2011[22] కన్వల్జిత్ కౌర్ జగమతి మాలిక్ హిప్నో పద్మ కమలాకర్ సంధ్యా పాండే ద్రౌపది ఘిమిరాయ్ రాఖీ గుప్త భండారీ
2012[23] గురమ్మ హెచ్ సంకిన సోనికా అగర్వాల్ ఓల్గా డి'మెల్లో ఓమన టికె ప్రణిత తాలూక్దార్
2013[24][25] టి. రాధా కె. ప్రశాంతి బీనా షేత్ లష్కరీ సీమా సఖారే మానసి ప్రధాన్ వర్తికా నంద ఎం. వెంకయ్య
2014[26][27] పి భానుమతి చంద్రప్రభ బోకీ అన్యాయ్ రాహిత్ జిందగీ (ఎన్జీవో) సీమా ప్రకాష్ సోదరి మారియోలా అస్తా సంస్థాన్ (ఎన్జీవో)
2015[28] హర్యానా రాష్ట్రం కోనోక్లోటా మహిళా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, అస్సాం టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, ఫోర్‌కాస్టింగ్ & అసెస్‌మెంట్ కౌన్సిల్ గురియా స్వయం సేవి సంస్థాన్ అంగడిపురం గ్రామ పంచాయితీ, కేరళ

1999 గ్రహీతలు

[మార్చు]

2001 జనవరి 4న న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ద్వారా మొదటి స్త్రీ శక్తి పురస్కారాలను ఐదుగురు మహిళలకు అందించారు:[29]

 • కన్నగి స్త్రీ శక్తి పురస్కారం: కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన కెవి రబియాకు లభించింది. శారీరక/మానసిక వైకల్యాలున్న పిల్లల విద్యను ప్రోత్సహించడానికి కృషి చేసింది.[30]
 • మాతా జీజాబాయి స్త్రీ శక్తి పురస్కారం: తమిళనాడులోని మధురైకి చెందిన చిన్న పిళ్లైకి లభించింది. మైక్రోక్రెడిట్ ఉద్యమాన్ని ప్రారంభించి, పేదరికంలో ఉన్న మహిళల జీవితాలను మార్చడం కోసం కృషి చేసింది.[31]
 • దేవి అహల్యాబాయి హోల్కర్ స్త్రీ శక్తి పురస్కారం: రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాకు చెందిన బ్రహ్మచారిణి కమలా బాయికి లభించింది. బాలికల కోసం పాఠశాలలను స్థాపించింది.[32]
 • ఝాన్సీ కి రాణి లక్ష్మీబాయి స్త్రీ శక్తి పురస్కారం: హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాకు చెందిన కింక్రీ దేవికి లభించింది. అక్రమ మైనింగ్‌పై ప్రజా వ్యతిరేకతకు నాయకత్వం వహించింది.[33]
 • రాణి గైడిన్లియు స్త్రీ శక్తి పురస్కారం: మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన కుమారి లలితా ప్రద్కర్‌కు లభించింది.

2001 గ్రహీతలు

[మార్చు]

2003 మార్చి 26న ఐదుగురు మహిళలకు 2001 స్త్రీ శక్తి పురస్కారం అందించబడింది:[34]

 • కన్నగి స్త్రీ శక్తి పురస్కారం: సత్య రాణి ఛద్దా
 • మాతా జీజాబాయి స్త్రీ శక్తి పురస్కారం: ముక్తా పి. దగ్లీ
 • దేవి అహల్యాబాయి హోల్కర్ స్త్రీ శక్తి పురస్కారం: తమ్మా పవార్‌
 • రాణి లక్ష్మీబాయి స్త్రీ శక్తి పురస్కారం: మహ్-నాజ్ వార్సీకి ఝాన్సీ
 • రాణి గైడిన్లియు స్త్రీ శక్తి పురస్కారం: సుమణి జోడియా

2002 గ్రహీతలు

[మార్చు]

2016 నవంబరు 19న 2002 స్త్రీ శక్తి పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటించారు.[35][36]

 • కన్నగి అవార్డు: మహజాబీ సర్బర్‌
 • మాతా జీజాబాయి అవార్డు: సునీతా యాదవ్‌
 • దేవి అహల్యా బాయి హోల్కర్ అవార్డు: శాంతా త్రివేది
 • ఝాన్సీ కీ రాణి లక్ష్మీ బాయి అవార్డు: యమునా సరోజినీ దేవి
 • రాణి గైడిన్లియు జెలియాంగ్ అవార్డు: ఆడా వీగాస్‌క

2003 గ్రహీతలు

[మార్చు]

2016 నవంబరు 19న 2003 స్త్రీ శక్తి పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటించారు.[35][36]

 • వందనా గోపీకుమార్‌కు కన్నగి అవార్డు
 • కన్నగి అవార్డు: వందనా గోపీకుమార్‌
 • మాతా జీజాబాయి అవార్డు: కమలా ఖోరా
 • దేవి అహల్యా బాయి హోల్కర్ అవార్డు: సునీతా కృష్ణన్‌
 • ఝాన్సీ కీ రాణి లక్ష్మీ బాయి అవార్డు: గోపా కొఠారి
 • రాణి గైడిన్లియు జెలియాంగ్ అవార్డు: భాగీరథి దత్తా

2004 గ్రహీతలు

[మార్చు]

2008, మార్చి 8న 2004 స్త్రీ శక్తి పురస్కార గ్రహీతలను ప్రకటించారు.[37][38]

 • కన్నగి అవార్డు: పింకీ విరాణి (ఢిల్లీ)
 • మాతా జీజాబాయి అవార్డు: షంషాద్ బేగం (ఛత్తీస్‌గఢ్‌)
 • దేవి అహల్యా బాయి హోల్కర్ అవార్డు: కవితా శ్రీవాస్తవ (రాజస్థాన్‌)
 • ఝాన్సీ కీ రాణి లక్ష్మీ బాయి అవార్డు: త్రివేణి బాలకృష్ణ ఆచార్య (మహారాష్ట్ర)
 • రాణి గైడిన్లియు జెలియాంగ్ అవార్డు: మోన్‌మోహని దేబ్‌నాథ్‌ (త్రిపుర)

2005 గ్రహీతలు

[మార్చు]

2008, మార్చి 8న 2005 స్త్రీ శక్తి పురస్కార గ్రహీతలను ప్రకటించారు.[37]

 • కన్నగి అవార్డు: షేక్ శంషాద్ బేగం (ఆంధ్రప్రదేశ్)
 • మాతా జీజాబాయి అవార్డు: సంధ్యా రామన్‌ (ఢిల్లీ)
 • దేవి అహల్యా బాయి హోల్కర్ అవార్డు: నీతా బహదూర్‌ (ఉత్తరప్రదేశ్‌)
 • ఝాన్సీ కీ రాణి లక్ష్మీ బాయి అవార్డు: రాణి బాంగ్‌ (మహారాష్ట్ర)
 • రాణి గైడిన్లియు జెలియాంగ్ అవార్డు: సల్మిన్ లింగ్డో (మేఘాలయ)

2006 గ్రహీతలు

[మార్చు]

2008, మార్చి 8న 2006 స్త్రీ శక్తి పురస్కార గ్రహీతలను ప్రకటించారు.[37][38]

 • కన్నగి అవార్డు: కల్పనా సర్కార్‌ (మధ్యప్రదేశ్‌)
 • మాతా జీజాబాయి అవార్డు: నిఘట్ షఫీ పండిట్‌ (జమ్మూ కాశ్మీర్‌)
 • దేవి అహల్యా బాయి హోల్కర్ అవార్డు: డి. శాంతి (తమిళనాడు)
 • ఝాన్సీ కి రాణి లక్ష్మీ బాయి అవార్డు: వంగూరి సువార్త (ఆంధ్రప్రదేశ్)
 • రాణి గైడిన్లియు జెలియాంగ్ అవార్డు: సెను సుహా (నాగాలాండ్‌)

2007 గ్రహీతలు

[మార్చు]

2009 ఫిబ్రవరి 28న 2007 స్త్రీ శక్తి పురస్కార గ్రహీతలను ప్రకటించారు:[39]

 • కన్నగి అవార్డు: అరుణ తార (ఆంధ్రప్రదేశ్)
 • మాతా జీజాబాయి అవార్డు: వి.విజయ (ఆంధ్రప్రదేశ్)
 • దేవి అహల్యా బాయి హోల్కర్ అవార్డు: వైష్ణవి జయకుమార్‌ (తమిళనాడు)
 • ఝాన్సీ కీ రాణి లక్ష్మీ బాయి అవార్డు: రాణి దేవి (హర్యానా)
 • రాణి గైడిన్లియు జెలియాంగ్ అవార్డు: బువాంగి సైలో (మిజోరాం)

2008 గ్రహీతలు

[మార్చు]

2010 మార్చి 8న 2008 స్త్రీ శక్తి పురస్కార గ్రహీతలను ప్రకటించారు.[40]

 • కన్నగి అవార్డు: మహీ జబీన్ (ఆంధ్రప్రదేశ్‌)
 • దేవి అహల్యా బాయి హోల్కర్ అవార్డు: హినా షా (గుజరాత్‌)
 • ఝాన్సీ కీ రాణి లక్ష్మీ బాయి అవార్డు: సునీతా దేవి (హర్యానా)
 • రాణి గైడిన్లియు జెలియాంగ్ అవార్డు: జింగుబాయి శ్రావణ్ బోలాకే (మహారాష్ట్ర)

2009 గ్రహీతలు

[మార్చు]

2010 మార్చి 8న 2009 స్త్రీ శక్తి పురస్కార గ్రహీతలను ప్రకటించారు. [40]

 • కన్నగి అవార్డు: ఫూల్‌బాసన్ బాయి యాదవ్‌ (ఛత్తీస్‌గఢ్‌)
 • దేవి అహల్యా బాయి హోల్కర్ అవార్డు: రష్మీ సింగ్‌ (ఢిల్లీ)
 • ఝాన్సీ కి రాణి లక్ష్మీ బాయి: ఎం. విజయ (కర్ణాటక)
 • రాణి గైడిన్లియు జెలియాంగ్ అవార్డు: వేద్ కుమారి ఘాయ్ (జమ్మూ & కాశ్మీర్‌)
 • రాణి రుద్రమ్మ దేవి అవార్డు: సుగత కుమారి (కేరళ)

2010 గ్రహీతలు

[మార్చు]

2010లో నలుగురు మహిళలకు స్త్రీ శక్తి పురస్కారం అందించబడింది:[41]

 • కన్నగి అవార్డు: ఠాగు మాయా బర్దేవా (సిక్కిం)
 • దేవి అహల్యా బాయి హోల్కర్ అవార్డు: మోనికా ఎస్. గార్గ్‌ (ఉత్తరప్రదేశ్‌)
 • రాణి లక్ష్మీబాయి అవార్డు: పొట్టబత్తిని పద్మావతి (ఆంధ్ర ప్రదేశ్)
 • రాణి గైడిన్లియు జెలియాంగ్ అవార్డు: రత్నమ్మ (కర్ణాటక)

2011 గ్రహీతలు

[మార్చు]

2011లో ఆరుగురు మహిళలకు స్త్రీ శక్తి పురస్కారం అందించబడింది:[42]

 • కన్నగి అవార్డు: కన్వల్‌జిత్ కౌర్‌ (చండీగఢ్‌)
 • మాతా జీజాబాయి అవార్డు: జగ్మతి మాలిక్‌ (హర్యానా)
 • దేవి అహల్యా బాయి హోల్కర్ అవార్డు: హిప్నో పద్మ కమలాకర్ (ఆంధ్ర ప్రదేశ్)
 • రాణి లక్ష్మీ బాయి అవార్డు: సంధ్యా పాండే (ఛత్తీస్‌గఢ్‌)
 • రాణి గైడిన్లియు జెలియాంగ్ అవార్డు: ద్రౌపది ఘిమిరాయ్‌ (సిక్కిం)
 • రాణి రుద్రమ్మ దేవి అవార్డు: రాఖీ గుప్తా భండారీ (ఢిల్లీ)

2012 గ్రహీతలు

[మార్చు]

2012లో స్త్రీ శక్తి పురస్కారం ఐదుగురు మహిళలకు అందించబడింది. అదనంగా, రాణి లక్ష్మీ బాయి అవార్డు మరణానంతరం "స్పిరిట్ ఆఫ్ నిర్భయ"కి అంకితం చేయబడింది.[43]

 • కన్నగి అవార్డు: గురమ్మ హెచ్.సంకిన (కర్నాటక)
 • మాతా జీజాబాయి అవార్డు: సోనికా అగర్వాల్‌ (ఢిల్లీ)
 • దేవి అహల్యా బాయి హోల్కర్ అవార్డు: ఓల్గా డిమెల్లో (మహారాష్ట్ర)
 • రాణి గైడిన్లియు జెలియాంగ్ అవార్డు: ఒమన టికె (కేరళ)
 • రాణి రుద్రమ్మ దేవి అవార్డు: ప్రణిత తాలూక్దార్ (అస్సాం)

2013 గ్రహీతలు

[మార్చు]

2013లో స్త్రీ శక్తి పురస్కారం ఆరుగురు మహిళలకు అందించబడింది:[44][45]

2014 గ్రహీతలు

[మార్చు]

2014లో స్త్రీ శక్తి పురస్కారం నలుగురు మహిళలకు, రెండు సంస్థలకు అందించబడింది:[46][47]

2015 గ్రహీతలు

[మార్చు]

22 మంది గ్రహీతలకు (7 సంస్థలు, 15 మంది మహిళలకు) స్త్రీ శక్తి పురస్కారం అందించబడింది:[49]

2016 గ్రహీతలు

[మార్చు]

33మంది (6 సంస్థలు, 27 మహిళలు) గ్రహీతలకు స్త్రీ శక్తి పురస్కారం అందించబడింది:[50]

2017 గ్రహీతలు

[మార్చు]

39 మహిళలకు, సంస్థలకు స్త్రీ శక్తి పురస్కారం అందించబడింది:[51][52]

2018 గ్రహీతలు

[మార్చు]

2020 మార్చి 9న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదిహేనుమంది మహిళా సాధకులకు నారీశక్తి పురస్కారాన్ని అందజేశాడు.[53][54] అవార్డు గ్రహీతల జాబితా:[55][56]

2019 గ్రహీతలు

[మార్చు]

2020 మార్చి 9న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదిహేనుమంది మహిళా సాధకులకు నారీశక్తి పురస్కారాన్ని అందజేశాడు.[57][58] అవార్డు గ్రహీతల జాబితా:[59][60]

2020 గ్రహీతలు

[మార్చు]

2022, మార్చి 8న అందించబడిన అవార్డుల వివరాలు.[61]

2021 గ్రహీతలు

[మార్చు]

2022 మార్చి 8న అందించబడిన అవార్డుల వివరాలు.[61]

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 1.2 "Nari Shakti Puruskars-National Award for Women-Guidelines"]" (PDF). Ministry of Women and Children, Government of India. Archived (PDF) from the original on 20 September 2018. Retrieved 2022-07-26.
 2. "The prestigious Nari Shakti Puraskars, 2016 to be given away by the President tomorrow". Press Information Bureau. Government of India. 2017-03-07. Archived from the original on 8 March 2017. Retrieved 2022-07-26.
 3. "President gives Stree Shakti awards on International Women's Day". Yahoo News India. 8 March 2013. Archived from the original on 2016-03-13. Retrieved 2022-07-26.
 4. "Stree Shakti Award for Nirbhaya". Daily News and Analysis. 7 March 2013. Archived from the original on 25 September 2015. Retrieved 2022-07-26.
 5. "Nari Shakti Puruskars-National Award for Women-Guidelines"]" (PDF). Ministry of Women and Children, Government of India. Archived (PDF) from the original on 20 September 2018. Retrieved 2022-07-26.
 6. "Laws alone cant come to women's rescue:Pranab". The Hindu. 9 March 2014. Archived from the original on 11 March 2014. Retrieved 2022-07-26.
 7. "Worthy women, please stand up". The Telegraph (Kolkata). Calcutta. 14 February 2013. Archived from the original on 2017-09-25. Retrieved 2022-07-26.
 8. "Women's Award (Press release)". Ministry of Women and Child Development, Government of India. Archived from the original on 21 May 2009. Retrieved 2022-07-26.
 9. "Stree Shakti Puraskar" (PDF). Ministry of Women and Child Development, Government of India. Archived from the original (PDF) on 10 January 2012. Retrieved 2022-07-26.
 10. "a face in the crowd: K.M.Rabiya". softronindia.com. Archived from the original on 6 February 2004. Retrieved 2022-07-26.
 11. Rajachandrasekaran, Anitha (5 March 2005). "On an EQUAL footing". The Hindu. Archived from the original on 2020-06-01. Retrieved 2022-07-26.
 12. "a face in the crowd: Brahmacharini Kamala Bai". softronindia.com. Archived from the original on 10 January 2021. Retrieved 2022-07-26.
 13. Gulati, Vishal (2006-02-23). "Fight, a byword for Kinkri Devi". The Tribune (Chandigarh). Archived from the original on 10 January 2021. Retrieved 2022-07-26.
 14. Annual Report, 2003–04 (PDF). Ministry of Women and Child Development. 2004. p. 15. Archived from the original (PDF) on 20 August 2019.
 15. 15.0 15.1 "Rashtriya Stree Shakti Puraskars presented". Press Information Bureau. Government of India. 19 November 2006. Archived from the original on 6 May 2021. Retrieved 2022-07-26.
 16. 16.0 16.1 "Programmes for Women". Annual Report 2005-06 (PDF). Ministry of Women and Child Development. p. 41. Archived from the original (PDF) on 2020-09-24.
 17. 17.0 17.1 17.2 "Stree Shakti Puraskar for outstanding achievements in area of women empowerment presented". Press Information Bureau. Government of India. 2008-03-08. Archived from the original on 11 January 2021. Retrieved 2022-07-26.
 18. 18.0 18.1 18.2 "Programmes for Women". Annual Report 2007-08 (PDF). Ministry of Women and Child Development. p. 41. Archived from the original (PDF) on 2020-09-24.
 19. "Women Development". Annual Report 2008-09 (PDF). Ministry of Women and Child Development. pp. 37–38. Archived from the original (PDF) on 2020-11-10.
 20. 20.0 20.1 "National Mission for Empowerment of Women launched; President Presents Stree Shakti Puruskar". Press Information Bureau. Government of India. 2010-03-08. Archived from the original on 10 January 2021. Retrieved 2022-07-26.
 21. "Women and Child Development Ministry Presented 'Stree Shakti Puraskar' 2010 on International Women's Day". Press Information Bureau. Government of India. 2011-03-08. Archived from the original on 11 January 2021. Retrieved 2022-07-26.
 22. "International Women's Day: President of India Shrimati Pratibha Devisingh Patil Gives away Stree Shakti Puraskar 2011 in New Delhi". Press Information Bureau. Government of India. 2012-03-07. Archived from the original on 10 January 2021. Retrieved 2022-07-26.
 23. "Hon. President of India, Sh. Pranab Mukherjee, Confers Rani Lakshimibai Award to 'Spirit of Nirbhaya'; National 'Stree Shakti Puruskar' Conferred to Five Women Achievers". Press Information Bureau. Government of India. 2013-03-08. Archived from the original on 11 January 2021. Retrieved 2022-07-26.
 24. "Laws alone cant come to women's rescue:Pranab". The Hindu. 9 March 2014. Archived from the original on 11 March 2014. Retrieved 2022-07-26.
 25. "President Confers Stree Shakti Puruskar on International Women's Day". Press Information Bureau. Government of India. 2014-03-08. Archived from the original on 6 May 2021. Retrieved 2022-07-26.
 26. "Stree Shakti Puraskar and Nari Shakti Puraskar presented to 6 and 8 Indian women respectively". India Today. Archived from the original on 15 October 2019. Retrieved 2022-07-26.
 27. Nari Shakti Puraskar 2014–2018 Coffee Table Book. Ministry of Women and Child Development. Archived from the original on 14 January 2021. Retrieved 2022-07-26.
 28. "'Nari Shakti Puraskar-2015' conferred on 22 Institutions/Individuals by the President". archive.pib.gov.in. 2016-03-08. Archived from the original on 10 January 2021. Retrieved 2022-07-26.
 29. Annual Plan 2001–2002. Planning Commission of India. Retrieved 2022-07-26.
 30. "a face in the crowd: K.M.Rabiya". softronindia.com. Archived from the original on 6 February 2004. Retrieved 2022-07-26.
 31. Rajachandrasekaran, Anitha (5 March 2005). "On an EQUAL footing". The Hindu. Archived from the original on 2020-06-01. Retrieved 2022-07-26.
 32. "a face in the crowd: Brahmacharini Kamala Bai". softronindia.com. Archived from the original on 10 January 2021. Retrieved 2022-07-26.
 33. Gulati, Vishal (2006-02-23). "Fight, a byword for Kinkri Devi". The Tribune (Chandigarh). Archived from the original on 10 January 2021. Retrieved 2022-07-26.
 34. Annual Report, 2003–04 (PDF). Ministry of Women and Child Development. 2004. p. 15.
 35. 35.0 35.1 "Rashtriya Stree Shakti Puraskars presented". Press Information Bureau. Government of India. 19 November 2006. Archived from the original on 6 May 2021. Retrieved 2022-07-26.
 36. 36.0 36.1 Annual Report 2005-06 (PDF). Ministry of Women and Child Development.
 37. 37.0 37.1 37.2 "Stree Shakti Puraskar for outstanding achievements in area of women empowerment presented". Press Information Bureau. Government of India. 2008-03-08. Archived from the original on 11 January 2021. Retrieved 2022-07-26.
 38. 38.0 38.1 Annual Report 2007-08 (PDF). Ministry of Women and Child Development.
 39. "Women Development". Annual Report 2008-09 (PDF). Ministry of Women and Child Development. pp. 37–38.
 40. 40.0 40.1 "National Mission for Empowerment of Women launched; President Presents Stree Shakti Puruskar". Press Information Bureau. Government of India. 2010-03-08. Archived from the original on 10 January 2021. Retrieved 2022-07-26.
 41. "Women and Child Development Ministry Presented 'Stree Shakti Puraskar' 2010 on International Women's Day". Press Information Bureau. Government of India. 2011-03-08. Archived from the original on 11 January 2021. Retrieved 2022-07-26.
 42. "International Women's Day: President of India Shrimati Pratibha Devisingh Patil Gives away Stree Shakti Puraskar 2011 in New Delhi". Press Information Bureau. Government of India. 2012-03-07. Archived from the original on 10 January 2021. Retrieved 2022-07-26.
 43. "Hon. President of India, Sh. Pranab Mukherjee, Confers Rani Lakshimibai Award to 'Spirit of Nirbhaya'; National 'Stree Shakti Puruskar' Conferred to Five Women Achievers". Press Information Bureau. Government of India. 2013-03-08. Archived from the original on 11 January 2021. Retrieved 2022-07-26.
 44. "Laws alone cant come to women's rescue:Pranab". The Hindu. 9 March 2014. Archived from the original on 11 March 2014. Retrieved 2022-07-26.
 45. "President Confers Stree Shakti Puruskar on International Women's Day". Press Information Bureau. Government of India. 2014-03-08. Archived from the original on 6 May 2021. Retrieved 2022-07-26.
 46. "Stree Shakti Puraskar and Nari Shakti Puraskar presented to 6 and 8 Indian women respectively". India Today. Archived from the original on 15 October 2019. Retrieved 2022-07-26.
 47. Nari Shakti Puraskar 2014–2018 Coffee Table Book. Ministry of Women and Child Development. Archived from the original on 14 January 2021. Retrieved 2022-07-26.
 48. "Awards". C. P. Ramaswami Aiyar Foundation. Archived from the original on 12 November 2020. Retrieved 2022-07-26.
 49. "'Nari Shakti Puraskar-2015' conferred on 22 Institutions/Individuals by the President". archive.pib.gov.in. 2016-03-08. Archived from the original on 10 January 2021. Retrieved 2022-07-26.
 50. "Prestigious Nari Shakti Puraskars given away to 33 women by the President". archive.pib.gov.in. 2017-03-08. Archived from the original on 6 May 2021. Retrieved 2022-07-26.
 51. "Nari Shakti Puraskar". The Times of India. 7 March 2018. Archived from the original on 11 March 2018. Retrieved 2022-07-26.
 52. "On International Women's Day, the President conferred the prestigious Nari Shakti Puraskars to 30 eminent women and 9 distinguished Institutions for the year 2017". archive.pib.gov.in. 2018-03-08. Archived from the original on 6 May 2021. Retrieved 2022-07-26.
 53. "President of India Confers Nari Shakti Puraskar for 2019". pib.gov.in. 8 March 2020. Archived from the original on 6 May 2021. Retrieved 2022-07-26.
 54. "President gives Nari Shakti Puraskar". DD News. Archived from the original on 17 March 2020. Retrieved 2022-07-26.
 55. "Meet The Women Who Were Awarded With Nari Shakti Puraskar 2020". SheThePeople.TV. Archived from the original on 10 March 2020. Retrieved 2022-07-26.
 56. "President of India Presents Nari Shakti Puraskar". pib.gov.in. 8 March 2020. Archived from the original on 6 May 2021. Retrieved 2022-07-26.
 57. "President of India Confers Nari Shakti Puraskar for 2019". pib.gov.in. 8 March 2020. Archived from the original on 6 May 2021. Retrieved 2022-07-26.
 58. "President gives Nari Shakti Puraskar". DD News. Archived from the original on 17 March 2020. Retrieved 2022-07-26.
 59. "Meet The Women Who Were Awarded With Nari Shakti Puraskar 2020". SheThePeople.TV. Archived from the original on 10 March 2020. Retrieved 2022-07-26.
 60. "President of India Presents Nari Shakti Puraskar". pib.gov.in. 8 March 2020. Archived from the original on 6 May 2021. Retrieved 2022-07-26.
 61. 61.0 61.1 "On International Women's Day, The Honourable President Will Confer Prestigious Nari Shakti Puraskars To 29 Outstanding Individuals For The Years 2020 and 2021". Ministry of Women and Child Development, Press Information Bureau, Government of India. 7 March 2022. Archived from the original on 8 June 2022. Retrieved 2022-07-26.

బయటి లింకులు

[మార్చు]