Jump to content

నీనా గుప్తా (గణిత శాస్త్రవేత్త)

వికీపీడియా నుండి
నీనా గుప్తా
నివాసంభారతదేశము
పౌరసత్వంభారతీయులు
జాతీయతభారతీయులు
రంగములుగణితం, కమ్యూనికేటిల్ ఆల్జీబ్రా, అఫైన్ ఆల్జీబ్రా జామెట్రీ
వృత్తిసంస్థలుISI, TIFR
చదువుకున్న సంస్థలుISI, బెతూన్ కళాశాల
పరిశోధనా సలహాదారుడు(లు)ప్రొఫెసర్ అమర్త్య దత్తా
ప్రసిద్ధిProviding a counter-example over a field of positive characteristic to the special Zariski Cancellation Problem

నీనా గుప్తా భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. ఆమె కోల్ కతా లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లోని గణాంక, గణిత శాస్త్ర విభాగంలో అసిస్టెంటు ప్రొఫెసరుగా ఉన్నారు. ఆమెకు  యిష్టమైన  గణిత  విభాగం  కమ్యూటేటివ్  ఆల్జీబ్రా ,   అఫైన్  ఆల్జీబ్రా  జామెట్రీ.  ఆమె ఐ.ఎస్.ఐ లో,  టాటా ఇనిస్టిట్యూట్  ఆఫ్  ఫండమెంటల్  రీసెర్చ్  లో  విజిటింగ్  ప్రొఫెసరుగా  పనిచేసారు.

2006లో ఆమె బెటూన్ కళాశాల నుండి గణిత శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసారు. 2008 లో ఐ.ఎస్.ఐ నుండి గణిత శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసారు.[1] తరువాత ఆమె పి.హెచ్.డి ని 2011 లో ఆల్జీబ్రా జామెట్రీ విభాగంలో పూర్తిచేసారు. ఆమె పి.హెచ్.డిని ప్రొఫెసర్ అమర్త్య కుమార్ దత్తా అధ్వర్యంలో పూర్తి చేసారు.[2] ఆమె యొక్క పి.హెచ్.డి లో "లారెంట్ పోలినామియల్స్ లో కొన్ని ఫలితాలు", "ఖాసీ ఎ. ఆల్జీబ్రాస్" పై పరిశోధనలు చేసారు.[3]

ఆమెకు 2014 లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ నుండి యంగ్ సైంటిస్టు పురస్కారం లభించింది.[4] ఈ పురస్కారం జారిస్కీ కాన్సిలేషన్ సమస్యపై చేసిన సాధనకు గానూ అందజేసారు. [5] ఆమె కంజెక్చర్ పై చేసిన కృషికి గానూ సరస్వతీ కౌశిక్ మెడల్ ను 2013 లో అందుకున్నారు. దీనిని టి.ఐ.ఎఫ్.ఆర్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ అందజేసింది. [6] అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన యువ గణిత శాస్త్రవేత్తలకు ఇచ్చే రామానుజన్ బహుమతిని 2021 లో నీనా గుప్తా అందుకుంది.[7]

వివిధ పదవులు

[మార్చు]
  • అసిస్టెంట్ ప్రొఫెసర్, స్టాటిస్టికల్, మాథమటిక్స్ విభాగం, ఐ.ఎస్.ఐ కోల్‌కటా (జూన్ 2014 -)
  • ఐ.ఎస్.ఐ కోల్‌కటా లో INSPIRE ఫాకల్టీ (డిసెంబరు 2012 - జూన్ 2014)[8]
  • ముంబయి నందలి టి.ఐ.ఎఫ్.ఆర్ నంది విజిటింగ్ ఫెలో (మే 2012 - డిసెంబరు 2012)
  • ఐ.ఎస్.ఐ కోల్‌కతా లోని విజిటింగ్ సైంటిస్టు (ఫిబ్రవరి 2012 - ఏప్రిల్ 2012)
  • ఐ.ఎస్.ఐ, కోల్‌కతా లో శ్యాం ప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఫెలో (సెప్టెంబరు 2008 -ఫిబ్రవరి 2012)

పురస్కారాలు, గౌరవాలు

[మార్చు]
  • యువ శాస్త్రవేత్తలకు ఇచ్చే DST-ICTP-IMU రామానుజన్ బహుమతి బ్(2021)[9]
  • స్వర్ణ జయంతి ఫెలోషిప్ పురస్కారం, భారత శాస్త్ర, సాంకేతిక విభాగం (2015)[10]
  • ఎ.కె.అగర్వాల్ పురస్కారం, ఇండియన్ మేథమెటికల్ సొసైటీలో ఉత్తమ పరిశోధనా పత్ర ప్రచురణకు గానూ, (2014)[11]
  • INSA యంగ్ సైంటిస్టు పురస్కారం (2014)[4]
  • రామానుజన్ ప్రైజ్, మద్రాసు విశ్వవిద్యాలయం (2014)[12]
  • ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో అసోసియేట్‌షిప్ (2013)[13]
  • సరస్వతీ కౌశిక్ మెడల్ (2013)[14]
  • INSPIRE ఫాకల్టీ ఫెలోషిప్ పురస్కారం (2012)[8]
  • శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఫెలోషిప్, కౌన్‌సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (2008)
  • PC పానేసర్ గోల్డు మెడల్, (2008)
  • 2006లో మెటూన్ కళాశాల నుండి అత్యంత ప్రతిభావంతురాలిగా ఆరు పురస్కారాలు పొందిన మొదటి వ్యక్తి.
  • కలకత్తా విశ్వవిద్యాలయం నుండి గణితం లో బి.యస్సీ ఆనర్స్ లో మొదటి స్థానం (2006)[1]
  • 2019లో భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా నారీశక్తి పురస్కారం

ప్రచురణలు

[మార్చు]
  • A Survey on Zariski Cancellation Problem, Indian Journal of Pure and Applied Mathematics, December 2015[15]
  • On Faithfully Flat Fibrations by a Punctured Line, Journal of Algebra, October 2014[16]
  • On the family of affine threefolds x^m y= F(x, z, t), Compositio Mathematica, June 2014[17]
  • With Dhvanita R. Rao, On the non-injectivity of the Vaserstein symbol in dimension three, Journal of Algebra, February 2014
  • On Zariski's Cancellation Problem in Positive Characteristic, Advances in Mathematics, September 2013
  • A Counter-example to the Cancellation Problem for the Affine Space A^3 in Characteristic p, Inventiones Mathematicae, August 2012
  • With Amartya K. Dutta and Nobuharu Onoda, Some Patching Results on Algebras over Two-dimensional Factorial Domains, Journal of Pure and Applied Algebra, July 2012
  • With S.M. Bhatwadekar, The Structure of a Laurent Polynomial Fibration in n Variables, Journal of Algebra, March 2012
  • With S.M. Bhatwadekar, On Locally Quasi A ∗ Algebras in Codimension-one over a Noetherian Normal Domain, Journal of Pure and Applied Algebra, September 2011

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Alumnus Page". Bethune College. Retrieved 5 Sep 2016.
  2. "Amartya Dutta Page". Mathematics Genealogy Project. Archived from the original on 10 ఆగస్టు 2018. Retrieved 5 Sep 2016.
  3. "ISI Stat-Math Unit Annual Report 2011-12". ISI. Retrieved 29 Aug 2016.
  4. 4.0 4.1 "Young Scientists Awards". INSA. Archived from the original on 11 అక్టోబరు 2013. Retrieved 28 Aug 2016.
  5. "On the Zariski Cancellation Problem". Bar-Ilan University. Archived from the original on 28 ఆగస్టు 2016. Retrieved 28 Aug 2016.
  6. "TIFR Endowment Fund Awards". TIFR. Retrieved 28 Aug 2016.
  7. "ICTP - Mathematics Prize Announced". www.ictp.it. Retrieved 2021-12-01.
  8. 8.0 8.1 "INSA 2012 INSPIRE Fellowships". INSA. Archived from the original on 28 ఆగస్టు 2016. Retrieved 28 Aug 2016.
  9. "ICTP - Mathematics Prize Announced". www.ictp.it. Retrieved 2021-12-01.
  10. "DST SJF Awards 2014-15" (PDF). DST. Retrieved 28 Aug 2016.
  11. "IMS Newsletter" (PDF). IMS. Archived from the original (PDF) on 10 సెప్టెంబరు 2016. Retrieved 28 Aug 2016.
  12. "ISI Awards and Honours". ISI. Retrieved 28 Aug 2016.
  13. "IASc Associates". IASc. Retrieved 5 Sep 2016.
  14. "TIFR School of Math News". TIFR. Retrieved 28 Aug 2016.
  15. "Indian Journal of Pure and Applied Mathematics Volume 46 Extract" (PDF). INSA. Retrieved 28 Aug 2016.
  16. "ResearchGate Neena Gupta Publications". ResearchGate. Retrieved 28 Aug 2016.
  17. "Compositio Mathematica Abstract". Cambridge Journals. Retrieved 29 Aug 2016.[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]