Jump to content

సత్య రాణి ఛద్దా

వికీపీడియా నుండి
సత్య రాణి ఛద్దా
స్త్రీ శక్తి పురస్కార గ్రహీత సత్యరాణి ఛద్దా
జననం1933
మరణం2014 జూలై 1(2014-07-01) (వయసు 81)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
శక్తి శాలిని స్వచ్ఛంద సంస్థ
పిల్లలుశశిబాల ఉరఫ్ కాంచనబాల
పురస్కారాలు కన్నగి స్త్రీ శక్తి పురస్కారం,
నీరజా భానోత్ అవార్డు

సత్య రాణి ఛద్దా (Satya Rani Chadha) (1933 - 1 జూలై 2014) ఒక మహిళా హక్కుల కార్యకర్త. ఈమె 1980 దశకంలో తోటి కార్యకర్త షాజహాన్ ఆపతో కలిసి భారతదేశంలో వరకట్న వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించినందుకు ప్రసిద్ధి చెందింది. వరకట్న వివాదాల ఫలితంగా ఈ ఇద్దరు మహిళల కుమార్తెలు హత్య గావించబడ్డారు. వీరు దేశంలో వరకట్నదురాచారాన్ని రూపుమాపడానికి కొన్ని దశాబ్దాల పాటు పోరాడారు. [1] [2] 1987లో వీరిద్దరూ శక్తి శాలిని అనే సంస్థను స్థాపించారు. ఢిల్లీకి చెందిన ఈ సంస్థ వరకట్న బాధితులను, లైంగిక హింసకు గురైన స్త్రీలను చేరదీసి మహిళల హక్కుల హక్కులకోసం పోరాటాలను చేసింది. [3] శక్తి శాలిని సంస్థ వరకట్నానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలను, ర్యాలీలను, సెమినార్లను, నిరసన కార్యక్రమాలను నిర్వహించింది. సత్య రాణి ఛద్దా నీరజా భానోత్ అవార్డు గ్రహీత. [4] [5] [6] [7] [8]

శశిబాల హత్య , న్యాయపోరాటం

[మార్చు]

సత్య రాణి ఛద్దా ఇరవై ఏళ్ల కుమార్తె, శశి బాల (కాంచనబాల అని కూడా పిలుస్తారు) ఢిల్లీలోని లక్ష్మీబాయి కళాశాల నుండి పట్టభద్రురాలు. ఆమెకు సుభాష్ చంద్ర అనే వ్యక్తితో వివాహం జరిగింది. సుభాష్ చంద్ర బాటా షూ కంపెనీలో మేనేజర్‌గా పని చేసేవాడు. శశి బాల వరకట్న దాహానికి బలియైన బాధితురాలు. ఇంట్లో ఉన్నప్పుడు కిరోసిన్ స్టవ్ పేలి తీవ్రమైన కాలిన గాయాలతో మరణించింది. ఆమె వివాహం జరిగిన ఒక సంవత్సరం లోపే ఈ దుర్ఘటన జరిగింది. ఆమె మరణించే సమయానికి ఆరు నెలల గర్భవతి. [9] స్కూటర్, టెలివిజన్, రిఫ్రిజిరేటర్ డిమాండ్ల కూడిన కట్నం డిమాండును ఛద్దా పూర్తి చేయలేక పోయింది. అయినప్పటికీ, ఈమె టెలివిజన్ కోసం కొంత డబ్బు చెల్లించి, రిఫ్రిజిరేటర్ ను సమకూర్చింది. అయినప్పటికీ, ఈమె కుమార్తె మరణానికి రెండు రోజుల ముందు, ఈమె అల్లుడు సుభాష్ చంద్ర, మిగిలిన కట్నం (స్కూటర్) కోసం డిమాండ్ చేశాడు. త్వరగా ఇవ్వక పోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. అతడు శశిబాల మరణంలో తన ప్రమేయాన్ని ఖండించాడు, కానీ పాక్షికంగా నెరవేరని కట్నం అభ్యర్థన కారణంగా తన కుమార్తె చంపబడిందని అనుమానిస్తూ, ఛద్దా ఈ మరణాన్ని హత్యగా పోలీసులకు రిపోర్టు చేసింది. [10] [11]

ప్రాథమిక ఆధారాలు సేకరించడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించి సుభాష్ చంద్రపై హత్యా నేరం కాకుండా వరకట్న నిషేధ చట్టం కింద కేసు పెట్టారు. దీంతో "వివాహం జరిగిన పది నెలల తర్వాత చంద్ర నుండి స్కూటర్ డిమాండ్ వచ్చినందున, దానిని మరణానికి అనుసంధానం చేయడం సాధ్యం కాదు" అని 1980లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే చద్దా ఈ హత్యకు సంబంధించిన దావాను కొనసాగించింది. ఈమెకు ఢిల్లీకి చెందిన లాయర్స్ కలెక్టివ్ న్యాయసహాయాన్ని అందించింది. ఆ సంస్థకు చెందిన సంజయ్ ఘోష్ ఈమె తరఫున న్యాయస్థానంలో తన వాదనలను వినిపించాడు. చివరకు హత్య జరిగిన 11 సంవత్సరాల తరువాత 1991లో సుభాస్ చంద్రపై ఐ.పి.సి. సెక్షన్ 306 క్రింద ఛార్జ్ షీట్ నమోదయ్యింది. సెషన్స్ కోర్టులో ఈ కేసు విచారణకు 2000 వరకు సమయం పట్టింది. 2000లో ఆత్మహత్యకు ప్రేరేపించిన తక్కువ అభియోగంతో సుభాష్ చంద్ర చివరికి దోషిగా నిర్ధారించబడ్డాడు. సుభాష్ చంద్ర అప్పీల్‌తో అతని నేరం 2013 వరకు నిలువరించబడింది. 2013లో ఏడేళ్ల శిక్షను అనుభవించాలని ఆదేశించింది. అయితే అతడు తప్పించుకుని ఎటువంటి శిక్షను అనుభవించలేదు. [12]

ఈమె చేసిన న్యాయపోరాటం వల్ల వరకట్నం నిర్వచనాన్ని 1983లో సవరించారు. అంతకు ముందు వివాహానికి ముందు డబ్బును డిమాండ్ చేయడాన్ని వరకట్నంగా పరిగణించేవారు. నగదు రూపంలో కాకుండా వస్తు రూపంలో ఇచ్చిన బహుమతులను కట్నం క్రింద పరిగణించే వారు కాదు. అయితే ఛద్దా చేసిన పోరాటం వల్ల వివాహం తరువాత ఎప్పుడు ధనాన్ని లేదా వస్తువులను డిమాండ్ చేసినా దానిని "వరకట్నం"గా పరిగణిస్తారు. ఈ సవరణ వరకట్న నిరోధక చట్టంలో పెనుమార్పులను తెచ్చింది.

గుర్తింపు

[మార్చు]
  • ఈమెను 1992లో నీరజా భానోత్ అవార్డుతో గౌరవించారు.
  • వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా ఛద్దా చేసిన న్యాయపోరాటానికి గుర్తింపుగా ఈమెకు భారత ప్రభుత్వం 2003లో కన్నగి స్త్రీ శక్తి పురస్కారం (2001)ని అందజేసింది.[13]

మూలాలు

[మార్చు]
  1. "Remembering Satya Rani Chadha: The Face Of India's Anti-Dowry Movement - ANOKHI MEDIA". ANOKHI MEDIA (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-07-14. Archived from the original on 2018-08-28. Retrieved 2018-05-25.
  2. "Satya Rani Chadha: The face of India's anti-dowry movement". Namita Bhandare. Livemint. 2 July 2014. Retrieved 24 May 2018.
  3. "Celebrating Women Who Fought The Much Needed Fight Against Dowry". sheroes.com. Archived from the original on 2023-03-09. Retrieved 2018-05-25.
  4. "Battle won for daughter in 34-yr dowry fight". Abantika Ghosh. Indian Express. 18 May 2018. Retrieved 24 May 2018.
  5. Farah Faizal; Swarna Rajagopalan (3 October 2005). Women, Security, South Asia: A Clearing in the Thicket. SAGE Publications. pp. 37–. ISBN 978-0-7619-3387-8. Retrieved 24 May 2018.
  6. Bishakha Datta (31 December 2012). Nine Degrees of Justice: New Perspectives on Violence against Women in India. Zubaan. pp. 32–. ISBN 978-93-81017-34-0. Retrieved 24 May 2018.
  7. Murlidhar C. Bhandare (2010). Struggle for Gender Justice: Justice Sunanda Bhandare Memorial Lectures. Penguin Books India. pp. 25–. ISBN 978-0-670-08426-5. Retrieved 24 May 2018.
  8. Snehendu B. Kar (18 May 2018). Empowerment of Women for Promoting Health and Quality of Life. Oxford University Press. pp. 243–. ISBN 978-0-19-938468-6. Retrieved 24 May 2018.
  9. "After 34 years, a measure of justice in India". Retrieved 2018-05-25.
  10. "After 34 years, a measure of justice in India". STEPHANIE NOLEN. The Globe and Mail. 6 May 2013. Retrieved 24 May 2018.
  11. "Delhi High Court Subhash Chandra vs State on 7 March, 2013". Indian Kanoon. Retrieved 24 May 2018.
  12. "After 34 years, a measure of justice in India". Retrieved 2018-05-25.
  13. Annual Report, 2003–04 (PDF). Ministry of Women and Child Development. 2004. p. 15.