స్త్రీ శక్తి పురస్కారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశ స్వాతంత్ర్యానికి పూర్వం, ఆ తర్వాత మహిళల కోసం విశేష కృషి చేసిన సాహస నారీమణుల స్ఫూర్తిని భావితరాలకు పంచడానికి భారతదేశ ప్రభుత్వం స్త్రీ శక్తి పురస్కారాలను 1991లో నెలకొల్పింది. మొత్తం ఆరు విభాగాలలో ఈ అవార్డులను కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రదానం చేస్తుంది. ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినాన ఈ పురస్కారాలను రాష్ట్రపతి చేతులమీదుగా బహుకరిస్తారు.

ఈ అవార్డులకు ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన నారీమణుల పేర్ల మీద పెట్టడం జరిగింది. అవి

అహల్యా బాయి హోల్కర్

కన్నగి

జిజాబాయి

రాణీ గైడెన్ల్యు జెలియాంగ్

ఝాన్సీ లక్ష్మీబాయి,

రుద్రమదేవి (దీనిని స్త్రీ/ పురుషులకు ఇస్తారు)

ఈ అవార్డు కింద 3 లక్షల రూపాయల నగదుతోపాటు, ప్రశంసాపత్రాన్ని బహుకరిస్తారు.

రంగాలు

[మార్చు]

మొదటి 4 స్త్రీ శక్తి పురస్కారాలను ఈ కింది రంగాల్లో కృషి చేసిన వారికి అందజేస్తారు.

• మహిళలు, బాలికలకు పునరావాసం, తోడ్పాటు

• దిక్కులేని మహిళలు, పిల్లలు, వితంతువులు, అఘాయిత్యానికి గురైన బాధితులు, వృద్ధ మహిళలు, వికలాంగ మహిళలు చిన్నారులకు చేయూత

• విద్య, శిక్షణ

• స్వశక్తి మహిళా సంఘాలకు ప్రాచుర్యం

• వ్యవసాయం గ్రామీణ పరిశ్రమలలో మహిళలకు చేయూతనిచ్చి వారిని వెట్టిచాకిరీల నుంచి దూరం చేయడం.

• పర్యావరణ పరిరక్షణ

• సంఘాలు, రాజకీయ అంశాల్లో మహిళల సాధికారతకు కృషి చేయడం.

• దేశీయ వైద్య పద్ధతులను పెంపొందించి స్త్రీల ఆరోగ్యం కోసం కృషి చేయటం.

•కళలు, మీడియా సాయంతో స్త్రీ సంబంధిత అంశాల పై స్పృహను, అవగాహనను కల్పించడం.

వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితంలోని కష్టాలను, అడ్డంకులను ధైర్యం, ఆత్మవిశ్వాసాలతో ఎదుర్కొని తమను తాము నిరూపించుకున్న ధీరవనితలకు రాణి లక్ష్మీబాయి పురస్కారం అందిస్తారు. చివరగా చేర్చిన రాణి రుద్రమ పురస్కారాన్ని అపార ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలు, పరిపాలనా దక్షత ఉన్న స్త్రీ/పురుషులకు ఇస్తారు.

2013 పురస్కార గ్రహీతలు

[మార్చు]

అహల్యా బాయి హోల్కర్ అవార్డ్ ---డా. సీమ సఖారే (మహారాష్ట్ర

కన్నగి అవార్డ్ ---శ్రీమతి టి. రాధా.కె.ప్రశాంతి (ఆంధ్ర ప్రదేశ్)

జిజాబాయి అవార్డ్ --- శ్రీమతి బీన సేథ్ లష్కరి (మహారాష్ట్ర)

రాణీ గైడెన్ల్యు జెలియాంగ్ అవార్డ్ --- డా. వర్తికా నంద (ఢిల్లి)

ఝాన్సీ లక్ష్మీబాయి అవార్డ్ --- శ్రీమతి మానసి ప్రధాన్ (ఒడిషా)

రుద్రమదేవి అవార్డ్ ---డా. ఎం. వెంకయ్య (ఆంధ్ర ప్రదేశ్)