సి. కె. దుర్గా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి.కె.దుర్గా
రాష్ట్రపతి భవన్లో భారత అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా 2017 సంవత్సరానికి నారీ శక్తి పురస్కారం అందుకుంటున్న సి.కె. దుర్గ
జాతీయతభారతీయురాలు
విద్యఎంబీబీఎస్
ఎం.ఎస్ (సర్జరీ)
వృత్తిసర్జన్, ఆంకాలజిస్ట్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్స సాంకేతికత అభివృద్ధి
పురస్కారాలునారీ శక్తి పురస్కార్ (2018)

డాక్టర్ సి. కె. దుర్గా ఒక భారతీయ శస్త్రవైద్యురాలు, ఆంకాలజిస్ట్. ఆమె రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్స సాంకేతికతను అభివృద్ధి చేసింది, ఇది ఏకకాలంలో క్యాన్సర్ ను తొలగిస్తుంది. అంతేకాకుండా, రోగి సొంత కణజాలాన్ని ఉపయోగించి రొమ్మును పునర్నిర్మిస్తుంది, దీనిని ప్రపంచవ్యాప్తంగా శస్త్రవైద్యులు విస్తృతంగా స్వీకరించారు. మహిళల ఆరోగ్యానికి ఆమె చేసిన కృషికి, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ పై ఆమె చేసిన విస్తృతమైన పరిశోధన ద్వారా ఆమె ప్రసిద్ధి చెందింది.[1][2]

ఆమె భారత ప్రభుత్వం ప్రదానం చేసిన భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన 2017 నారి శక్తి పురస్కార్ గ్రహీత.[3][4]

కెరీర్

[మార్చు]

ఆమె బ్యాచిలర్ ఆఫ్ మెడిసన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ(ఎంబీబీఎస్) పట్టా పొందింది. ఆ తరువాత, ఆమె 1981లో ఎంఎస్ (సర్జరీ) పూర్తి చేసింది [5] ఆమె డా. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్‌గా తన వృత్తిని ప్రారంభించింది. ఆ తర్వాత 1987లో ఆమె స్పెషలిస్ట్‌గా మారింది [6]

ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో సర్జరీలో ప్రొఫెసర్‌గా ఉంది. న్యూ ఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, కన్సల్టెంట్ అండ్ సర్జరీ విభాగానికి అధిపతిగా వ్యవహరిస్తోంది. ఆమె ఇండియన్ జర్నల్ ఆఫ్ సర్జరీకి అసోసియేట్ ఎడిటర్‌గా కూడా పనిచేస్తోంది. 2018 నుండి ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియాలో కో-ఆప్టెడ్ జీసి మెంబర్‌గా ఉంది.[7]

2017లో, సి. కె. దుర్గా అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఢిల్లీ చాప్టర్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యింది.[8] అదే సంవత్సరం అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా నుండి ఆమె బెస్ట్ స్టేట్ ఛాప్టర్ అవార్డును అందుకుంది.[7] ఆమె క్యాన్సర్ పరిశోధనలో అనేక మంది వైద్యరంగంలో విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించింది. క్యాన్సర్ రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి రూపొందించిన అవగాహన కార్యక్రమాలను విరివిగా నిర్వహించింది.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 @PIB_India (March 7, 2018). "Meet Dr. C.K. Durga, #NariShakti Puraskar 2017 awardee. She has contributed immensely in the field of women's health through her extensive research on Breast Cancer and developed a path-breaking technique in Breast Cancer Surgery" (Tweet). Retrieved May 31, 2024 – via Twitter.
  2. Ministry of Women & Child Development (March 10, 2018). "Dr. C.K. Durga, Consultant, Professor & HOD (Surgery) at Dr.R.M.L Hospital. has done prolific work to counter Breast Cancer. Our #NariShakti Puraskar 2017 Awardee says, My passion towards my work keeps me going !". Facebook. Retrieved May 31, 2024.
  3. "Nari Shakti Puraskar". The Times of India. 7 March 2018. Archived from the original on 11 March 2018.
  4. "On International Women's Day, the President conferred the prestigious Nari Shakti Puraskars to 30 eminent women and 9 distinguished Institutions for the year 2017". archive.pib.gov.in. 2018-03-08. Archived from the original on 6 May 2021.
  5. "Dr. C. K. Durga" (PDF). Dr. Ram Manohar Lohia Hospital. Retrieved 31 May 2024.
  6. "RML Hospital to get first woman as chief". The Asian Age. April 5, 2017. Retrieved May 31, 2024 – via PressReader.
  7. 7.0 7.1 "Curriculum Vitae" (PDF). Association of Surgeons of India. Retrieved May 31, 2024.
  8. "Past President Secretaries". Association of Surgeons of India. Retrieved May 31, 2024.