Jump to content

రాష్ట్రపతి భవనం

అక్షాంశ రేఖాంశాలు: 28°36′52″N 77°11′59″E / 28.61444°N 77.19972°E / 28.61444; 77.19972
వికీపీడియా నుండి
(రాష్ట్రపతి భవన్ నుండి దారిమార్పు చెందింది)
రాష్ట్రపతి భవన్
పైన: జైపూర్ స్తంభం వైపు ఆచార స్వాగత మైదానం ఉన్న రాష్ట్రపతి భవన్ ముందు ప్రాంగణం
దిగువ: అమృత ఉద్యానవనం వైపు మధ్య పచ్చిక ఉన్న రాష్ట్రపతి భవన్ వెనుక ప్రాంగణం
రాష్ట్రపతి భవనం is located in ఢిల్లీ
రాష్ట్రపతి భవనం
న్యూ ఢిల్లీ, భారతదేశం
పూర్వపు నామంవైస్రాయ్ హౌస్ (1947 వరకు)
గవర్నమెంట్ హౌస్ (1947–1950)
ఇతర పేర్లుఅధ్యక్ష భవనం
సాధారణ సమాచారం
నిర్మాణ శైలిఢిల్లీ ఆర్డర్[1]
ప్రదేశంరాజ్‌పథ్, రైసినా హిల్, న్యూ ఢిల్లీ
చిరునామారాష్ట్రపతి భవన్, న్యూ ఢిల్లీ, ఢిల్లీ, భారతదేశం
పట్టణం లేదా నగరంఢిల్లీ న్యూఢిల్లీ
దేశం India
భౌగోళికాంశాలు28°36′52″N 77°11′59″E / 28.61444°N 77.19972°E / 28.61444; 77.19972
ఉన్నతి (ఎత్తు)216m
ప్రస్తుత వినియోగదారులు
నిర్మాణ ప్రారంభం1912; 113 సంవత్సరాల క్రితం (1912)
పూర్తి చేయబడినది1929; 96 సంవత్సరాల క్రితం (1929)[2]
ప్రారంభం1931; 94 సంవత్సరాల క్రితం (1931)
యజమానిభారత ప్రభుత్వం
ఎత్తు55 మీటర్లు
సాంకేతిక విషయములు
పరిమాణం130 హెక్టార్ (321 ఎకరం)
అంతస్థుల సంఖ్య4
నేల వైశాల్యం200,000 sq ft (19,000 మీ2)
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిఎడ్విన్ లుటియెన్స్
ఇతర విషయములు
గదుల సంఖ్య340
Short film about Rashtrapati Bhavan

రాష్ట్రపతి భవన్, గతంలో ఇది ప్రెసిడెన్షియల్ ప్యాలెస్' అనే పేరుతో వైస్రాయ్ హౌస్ (1931–1947) గా ఉంది. 1950 జనవరి 26న, రాజేంద్ర ప్రసాద్ భారతదేశ మొదటి రాష్ట్రపతి హోదాలో ఈ భవనాన్ని ఆక్రమించినప్పుడు , దీనికి రాష్ట్రపతి భవన్ - ప్రెసిడెంట్ హౌస్ అని పేరు పెట్టారు.[3] అప్పటినుండి ఇది భారతదేశపు రాష్ట్రపతి అధికారిక నివాస భవనంగా మారింది. ఇది భారతదేశ రాజధాని కొత్త ఢిల్లీలో రాజ్‌పథ్, రైసినా హిల్ పశ్చిమ చివరన ఉంది.[4]

భారతదేశం పరిపాలన 1947కు ముందు వలస పాలకులైన బ్రిటిష్ వారి పరిపాలన క్రింద ఉండేది. నాటి బ్రిటిష్ రాజు జార్జ్- 5 అప్పటివరకు భారత దేశానికి రాజధానిగా వున్న కోల్‌కాతా నుండి రాజధానిని 1911 వ సంవత్సరంలో ఢిల్లీకి మార్చాలని తలపెట్టాడు. అప్పటికే ఢిల్లీలోని పురాతన భవనాలను, ఇతర కట్టడాలను చూసిన రాజు బ్రిటిష్ రాజ ప్రతినిధుల కొరకు ఒక నగరాన్ని, వారి నివాసానికి ఒక అద్భుతమైన పెద్ద భవనాన్ని నిర్మించాలని తలపెట్టాడు. అతని ఆలోచన రూపమే ఢిల్లీ ప్రక్కనే నిర్మితమైన కొత్తఢిల్లీ నగరం. అందులోనే నేటి రాష్ట్రపతి భవనం ఉంది. ఈ భవన నిర్మాణానికి లుట్యెంస్ అనే వాస్తుశిల్పి రూప కల్పన చేసాడు. దీని నిర్మాణానికి హగ్ కీలింగ్ చీఫ్ ఇంజనీరుగా పనిచేశారు. దీని నిర్మాణంలో భారతీయ, మొగల్ నిర్మాణ రీతులు కనిపిస్తాయి. ఈ నిర్మాణంలో తలమానికమైన బారీ డోం. ఇది భౌద్ద నిర్మాణాలను తలపిస్తుంది.

స్వాతంత్య్రానంతరం ఈ భవనంలోనికి అడుగు పెట్టిన మొదటి వ్వక్తి అప్పటి మొదటి భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారి. ఆ తర్వాత భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్బవించడంతో రాష్ట్రపతి పదవి సృష్టించబడింది. రాష్ట్ర పతి నివాసానికి కేటాయించిన ఈ భవనానికి నాడు రాష్ట్రపతి భవన్ గా నామ కరణం చేశారు. అప్పుడు రాజాజీ వుండిన గదుల్లోనే ఇప్పటికి వరకు రాష్ట్ర పతులందరూ ఉంటున్నారు. బ్రిటిష్ వైస్రాయ్ లు ఉపయోగించిన గదులను మాత్రం నేడు, దేశ పర్యటనకు వచ్చిన విదేశాధినేతలకు కేటాయిస్తున్నారు.

ఈ రాష్ట్రపతి భవనంలో మొత్తం 340 గదులుండగా, అందులో దర్బాలు హాలు, అశోకాహాలు, డైనింగు హాలు, మొగల్ గార్డెన్ లను మాత్రమే సందర్శకులను అనుమతిస్తారు. రంగు రంగు చలువ రాళ్లతో మనోరంజకంగా వుండే దర్బారు హాలులో జాతీయ అవార్డుల ప్రధానోత్సవాలకు ఉపయోగిస్తారు. అందమైన షాండియర్లు అలంకరించిన అశోకా హాలు మంత్రుల ప్రమాణ స్వీకరణోత్సవాలకు ఉపయోగిస్తారు. డైనింగు హాలులో ఒకేసారి 104 మంది కూర్చొని బోజనం చేయవచ్చు. వారి భోజనానినికి వెండి పాత్రలను ఉపయోగిస్తారు.

ఈ భవనాన్ని రాంత్రింబవళ్లు కాపలాకాయడానికి వెయ్యి మంది ఢిల్లీ పోలీసులుంటారు. బ్లాక్ కమెండోలు కూడా వుంటారు. ఈ కాపలా దారులంతా అశ్వ, నావిక, వైమానిక దళాలో శిక్షణ పొంది ఉంటారు. వీరందరు ఆరడుగుల పైనే ఎత్తును కలిగిఉంటారు. రాష్ట్రపతి ఈ భవనం నుండి బయట కాలు పెడితె చాలు.. అది అరగంట పనైనా, సుదీర్ఘ విదేశ పర్యటన అయినా, అతను బయటకు వెళ్లే టప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు, వీడ్కోలు, పలకడానికి, వచ్చినప్పుడు ఆహ్వానం పలకడానికి 150 మంది సిక్కు సైనిక దళం సర్వ వేళలా సిద్దంగా వుంటుంది. ఇతర దేశాధిపతులకు కూడా వీరు ఆహ్వానం, వీడ్కోలు పలుకుతారు.

రాష్ట్రపతి కుటుంబానికి, అక్కడికి వచ్చే అతిధులకు అవసరమైన వంటకాలను తయారు చేయడానికి 18 మంది వంట మనుషులు, వడ్డించడానికి 10 మంది బట్లర్లు వుంటారు. గదులను ఊడ్చడానికి శుభ్రంగా వుంచడానికి 110 మంది పని వాళ్లుంటారు. అంతేగాక 10 మంది డ్రైవర్లు, ఐదుగురు మెకానిక్కులు, 180 మంది అంగ రక్షకులు, ఇంకా డాక్టర్లు, సెక్రెటరీలు, క్లర్కులు.. మొదలగు వారందరూ కలిపి 1000 మంది పైగానే పనిచేస్తుంటారు. రాష్ట్రపతి ప్రయాణించడానికి ఎస్ క్లాస్ 600 పుల్ ల్మన్ గార్డ్ మెర్సిడెజ్ కారును ఉపయోగిస్తారు. ఈ రాష్ట్రపతి భవన్ నిర్వహణ ఖర్చు ఏడాదికి వంద కోట్ల రూపాయలకు పైనే వుంటుంది.

ఈ రాష్ట్రపతి భవన ఆవరణలో అందమైన ఉద్యాన వనాలున్నాయి. అవి మొఘల్ గార్డెన్, హెర్బెల్ గార్డెన్, న్యూట్రిషన్ గార్డెన్, స్పిరిచ్యుల్ గార్డెన్ వంటివి ఉన్నాయి. వాటి బాధ్యతలను చూడడానికి 150 మంది తోట పని వారుంటారు. ఈ ఉద్యాన వనాల్లో ప్రధానాకర్షణ మొగల్ గార్డెన్. ఇందులో మామిడి, సపోట, జామ, అరటి వంటి పండ్ల చెట్లే గాక వేప, మర్రి, రావి లాంటి వృక్షాలు కూడా ఉన్నాయి. ఈ గార్డెన్ లో 8 టెన్నిస్ కోర్టులు, ఒక గోల్పు మైదానం, ఒక క్రికెట్ మైదానం కూడా ఉన్నాయి. అబ్దుల్ కలాం పదవీ కాలంలో రాష్ట్రపతి భవన్ లో అదనంగా సైన్స్ మ్యూజియం, చిల్డ్రన్ గ్యాలరి, కిచెన్ మ్యూజియం, హెర్బల్ గార్డెన్ అదనంగా చేరాయి. వైశాల్యం పరంగా, ఇటలీలోని క్విరినల్ ప్యాలెస్ తర్వాత ఇది ప్రపంచంలోనే ఏ దేశాధినేతకైనా రెండవ అతిపెద్ద నివాసం..[5]

కాగా మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్ గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం 2023 జనవరి 28న నిర్ణయం తీసుకుంది. దీనిని ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి 29న ప్రారంభించారు. ప్రజల సందర్శన నిమితం ఈ అమృత్ ఉద్యాన్ ను జనవరి 31 నుంచి మార్చి 26 వరకు తెరిచి ఉంచుతారు.

హైదరాబాద్ (తెలంగాణ)లోని రాష్ట్రపతి నిలయం, డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్)లోని రాష్ట్రపతి అషియానా, సిమ్లా (హిమాచల్ ప్రదేశ్) లోని రాష్ట్రపతి నివాస్ రాష్ట్రపతి విశ్రాంతి నిలయాలుగా ఉన్నాయి.

రాష్ట్ర పతులుగా పనిచేసిన వారి జాబితా

[మార్చు]

భారత రాష్ట్రపతి, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా దేశాధినేత, భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్. రాష్ట్రపతిని భారతదేశ ప్రథమ పౌరుడిగా పేర్కొంటారు.[6][7] భార1950లో భారత రాజ్యాంగాన్ని ఆమోదించడంతో భారతదేశం రిపబ్లిక్‌గా ప్రకటించబడినప్పుడు ఈ పదవిని స్థాపించినప్పటి నుండి భారతదేశానికి 2024 నాటికి వివిధ సమయాలలో 15 మంది అధ్యక్షులు పనిచేసారు.[8] ఈ పదిహేను మందితో పాటు ముగ్గురు తాత్కాలిక రాష్ట్రపతులు కూడా తక్కువ కాలం పదవిలో ఉన్నారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Kahn, Jeremy (30 December 2007). "Amnesty Plan for Relics of the Raj". The New York Times. Archived from the original on 30 October 2012. Retrieved 26 June 2012. He also invented his own "Delhi Order" of neo-Classical columns that fuse Greek and Indian elements.
  2. "Rashtrapati Bhavan". The President of India. Archived from the original on 26 November 2010. Retrieved 23 December 2011.
  3. Hidayatullah, M. (2004). Law in the Scientific Era. Universal Law Publishing Company. ISBN 978-8175342606. Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.
  4. "Rashtrapati Bhavan". rashtrapatisachivalaya.gov.in. Retrieved 2021-08-01.
  5. Goyal, Shikha (8 March 2017). "20 amazing facts about the Rashtrapati Bhavan". Dainik Jagran. Jagran Prakashan Limited. Archived from the original on 10 November 2021. Retrieved 18 September 2022.
  6. "President Ram Nath Kovind is Indias first citizen. Your chances begin only at Number 27". indiatoday.com. Times of India. Archived from the original on 30 July 2017. Retrieved 19 November 2017.
  7. "The Constitution of India". Ministry of Law and Justice of India. Archived from the original (.doc) on 5 February 2009. Retrieved 4 January 2009.
  8. "1950: India becomes a republic". BBC News. 26 January 1950. Archived from the original on 17 January 2008. Retrieved 6 January 2009.

బయటి లింకులు

[మార్చు]