వంట
ఆహారం తయారు చేసే ప్రక్రియను వంట చేయడం అంటారు. వంట తయారీకి ముఖ్యంగా వేడిని ఉపయోగిస్తారు. అందువలన ఆహారానికి సంబంధించిన పదార్ధాలను వేడిచేయడం ద్వారా అనగా వండడం ద్వారా తినడానికి తయారు చేసుకున్న అహార పదార్ధాలను వంటకాలు అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా వంట తయారీకి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే పద్ధతులు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వంట పద్ధతులలో పర్యావరణ, ఆర్థిక మరియు సాంస్కృతిక సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. వంటమనుషులు అవసరానికి అనుగుణంగా మారుతూ విస్తృతంగా వారికి వారే శిక్షణ పొందుతూ వంట తయారీలో నైపుణ్యాన్ని సాధిస్తుంటారు.
![]() | ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
విషయ సూచిక
మళ్లీమళ్లీ వేడిచేయడం వల్ల ఆహారానికి జరిగే నష్టము , Loss to the food if heated more times[మార్చు]
వండిన వాటినే రెండోసారి వేడి చేయడం చాలా ఇళ్లల్లో తప్పనిసరవుతోంది. వేపుళ్లకి వాడగా మిగిలిన నూనెను ఇతర పదార్థాల తయారీలో ఉపయోగించడం.. కూరలని, మాంసాహారాన్ని మళ్లీమళ్లీ వేడి చేయడం.. వంటివన్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని గుర్తించాలి. మళ్లీమళ్లీ వేడి చేయడము వల్ల గుండెకు చేటు. పండుగలప్పుడు, ఇంట్లో కార్యక్రమాలున్నప్పుడు పిండి వంటలు తప్పనిసరి. ఇందుకోసం పెద్ద కడాయి నిండా నూనె వేసి రకరకాల పదార్థాల్ని వేయిస్తాం. మిగిలిన నూనెను మళ్లీ వాడుతుంటాం. ఒకసారి నూనెని స్మోక్ పాయింట్ వరకు వేడిచేస్తే దానిలో రసాయన చర్య జరిగి స్వభావం మారుతుంది. మళ్లీ దానినే వేడిచేస్తే అందులో విషపదార్థాలు తయారవుతాయి. ఆ నూనెతో చేసిన పదార్థాల్ని తినడం వల్ల గుండెజబ్బులు, నరాల సంబంధ వ్యాధులు దాడిచేస్తాయి. ముఖ్యంగా రోడ్డువారన అమ్మే పదార్థాలు, రెస్టారంట్ ఆహారం పట్ల జాగ్రత్త అవసరం. స్వీట్లు, బజ్జీల వంటివి తినేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి.
నూనెలను వేడి చేయకూడదు[మార్చు]
- ఇంట్లో వాడే సోయా, వెజిటబుల్ నూనెల్ని మళ్లీమళ్లీ వేడి చేయకూడదు. నెయ్యి, డాల్డా, కొబ్బరినూనె, వేరు సెనగనూనె వంటివి (కొంతవరకు) వేడిచేసినా వాటి స్వభావం పెద్దగా మారదు. కానీ అవీ హానికరమే! అందుకని కావాల్సినంతే వాడాలి. చిన్న కడాయిలో వంటకాలు చేస్తే నూనె తక్కువ పడుతుంది. మిగలదు. అన్నాన్ని వేడి చేస్తున్నారా? వండిన అన్నం వండినట్టే ఉంది. పారేయలేం. పైగా బియ్యం బోలెడు ఖరీదంటూ తిరిగి అన్నాన్ని వేడిచేసే వారిని చూస్తుంటాం. అది తప్పేం కాకపోయినా.. అన్నాన్ని సరిగ్గా భద్రపరచకున్నా.. ఆ తరువాత సక్రమంగా వేడిచేయకపోయినా ఆరోగ్యానికి ప్రమాదమే. అన్నాన్ని కొన్ని గంటల పాటు బయటే ఉంచి.. ఆ తరువాత ఫ్రిజ్‌లో పెట్టి తినాలనుకున్నప్పుడు అరకొరగా వేడిచేయడం సరికాదు. బియ్యంలో కొన్నిసార్లు బ్యాక్టీరియా ఆవాసం ఉంటాయి. దాంతో అన్నాన్ని సరిగా వేడిచేయనప్పుడు వృద్ధిచెందుతాయి. అందుకే పూర్తిగా వేడిచేయాలి. అన్నంపై కాసిని నీళ్లు చల్లి కుక్కర్‌లో ఉంచి ఒక కూత రాగానే దించేయాలి. దాంతో బ్యాక్టీరియా వృద్ధి చెందదు. అలాగే వేడివేడిగా ఉన్నప్పుడే తినేయాలి. చల్లారాక తిందామనుకుంటే పోషకాలు అందవు. అనారోగ్యం కూడా.
మాంస కృత్తులు అధికంగా వుండే ఆహార పదార్థాలను మాటిమాటికి వేడి చేయవద్దు[మార్చు]
పదేపదే వేడిచేస్తే... పోషకాలు అధికంగా ఉండే ఏ పదార్థాలయినా త్వరగా పాడవుతాయి. ముఖ్యంగా మాంసకృత్తులు అధికంగా ఉండే చికెన్, చేప, పాలు, పాల ఉత్పత్తులు, పచ్చి బఠాణీ, గుడ్డు.. వంటివాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చికెన్‌లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుంది. వండిన తర్వాత రెండు గంటలకన్నా ఎక్కువ సేపు ఆ కూరను బయట ఉంచకూడదు. త్వరగా చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టేయాలి. పాలు, పాల ఉత్పత్తులనూ చల్లార్చాకే ఫ్రిజ్‌లో ఉంచాలి. మాంసాన్ని తిరిగి వేడిచేసి తినాలనుకుంటే.. హడావుడిగా కాకుండా బాయిలింగ్ పాయింట్ కంటే ఎక్కువగా వేడి చెయ్యాలి. ముఖ్యంగా చికెన్ ముక్కలు మధ్యభాగంలోనూ వేడెక్కాలి. అయినా పదేపదే వేడి చేసి తినడం ఆరోగ్యానికి మేలు చేయదు. చిన్న రెస్టారంట్లలో చికెన్‌ను మళ్లీ మళ్లీ వేడిచేస్తారు. ఫలితంగా పోషకాలు అందవు సరికదా త్వరగా జీర్ణం కాదు. వేపుళ్లలో నూనె కూడా ఎక్కువే కాబట్టి ఆరోగ్యపరంగా చేటు.
గ్రుడ్డును మరలా వేడి చేయకూడదు[మార్చు]
- ఒకసారి వండిన గుడ్డు రబ్బరులా సాగుతుంటే రెండోసారి వేడిచేయకూడదు. అలాగే పదార్థాలని వేడిచేసేటప్పుడు పరిశుభ్రత తప్పనిసరి. అంటే అప్పుడే పచ్చిమాంసాన్ని పట్టుకొని వెంటనే మరో కూర వండుతుంటే బ్యాక్టీరియా దానికి వ్యాపిస్తుంది. కాబట్టి చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. * బఠాణీలు వండుతున్నప్పుడు ఎండువి ఎంచుకుంటే తిరిగి వేడిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పచ్చివయితే త్వరగా పాడవుతాయి. వేడితో కరిగే పోషకాలు.. పాలను వేడిచేస్తేనే వాటి నాణ్యత తెలుస్తుంది. పాలల్లో సమస్య ఉంటే.. వేడిచేసినప్పుడు విరిగిపోతాయి. అందుకే ప్రతిసారీ వేడి చేసుకొని తాగాలి. కాకపోతే వేడి చేసినప్పుడల్లా పాలల్లోని వాటర్ సాల్యుబుల్ విటమిన్లతో పాటు కొన్ని పోషకాలు తగ్గుతూ ఉంటాయి. అవసరానికి తగినంతయితే.. మేలు * తాజా కాయగూరలని వండినప్పుడు సహజంగానే కొన్ని పోషకాలు తగ్గుతాయి. ఇక,
రెండోసారి వేడి చేస్తే పోషకాలు తగ్గుతాయి[మార్చు]
రెండోసారి వేడిచేస్తే మరికొంత నష్టం. అందుకే అవసరం మేరకే వండుకోవడం మేలు. * చికెన్ బిర్యానీ త్వరగా పాడవుతుంది. కాబట్టి మళ్లీ వేడిచేయకూడదు. చైనీస్ ఫ్రైడ్‌రైస్ తయారీలో అన్నాన్ని సగమే వండి వేయిస్తారు. దీన్నీ రెండోసారి వేడిచేయాలనుకోకూడదు. మీట్‌శాండ్‌విచ్, చికెన్ కట్‌లెట్లలో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుందని తెలుసుకోవాలి. * మైక్రోవేవ్‌లో ఒకనిమిషం వేడి చేసి వెంటనే తియ్యకూడదు. ఒకసారి తీసి కలిపి మళ్లీ అందులో పెట్టాలి. * మాంసం రంగు చూసి కాకుండా.. ఉడికిందని నిర్థారించుకున్నాకే దింపాలి. --పోషకాహార నిపుణులు డాక్టర్ లతాశశి.