ప్రణిత తాలూక్దార్
ప్రణిత తాలూక్దార్ | |
---|---|
అస్సాం శాసనసభ | |
In office 1967–1978 | |
అంతకు ముందు వారు | అక్షయ్ కుమార్ దాస్ |
తరువాత వారు | హేమెన్ దాస్ |
నియోజకవర్గం | సోర్భోగ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1935[1] |
మరణం | 20 ఏప్రిల్ 2019 (వయస్సు 83-84) |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
ప్రణీతా తాలూక్దార్ భారత జాతీయ కాంగ్రెస్ కు చెందిన ఉపాధ్యాయురాలు, సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకురాలు. ఆమె సోర్భోగ్ నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా అస్సాం శాసనసభ సభ్యురాలిగా రెండుసార్లు ఎన్నికైనది.
జీవిత చరిత్ర
[మార్చు]తాలూక్దార్ 1935లో జన్మించింది. ఆమె భర్త ఘనేశ్యామ్ తాలుక్దార్ అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు, ఆమె బార్నగర్ కళాశాలను స్థాపించింది. [1]
తాలూక్దార్ సొరాలీ హయ్యర్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, బార్నగర్ కళాశాల, బార్పేట సొరాలీ కళాశాలకు అధ్యాపకురాలు. [1]
తాలూక్దార్ 1967 లో సోర్భోగ్ నుండి అస్సాం శాసనసభ సభ్యురాలుగా ఎన్నికైనది. [2] ఆమె 1972 లో సోర్భోగ్ నుండి తిరిగి ఎన్నికైనది. [3]
అవార్డులు
[మార్చు]తాలూక్దార్ కూడా మహిళల కోసం పనిచేసింది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ సంఘం అధ్యక్షురాలిగా ఉన్నది. [1] మహిళా సాధికారతకు ఆమె చేసిన కృషికి 2013లో స్త్రీ శక్తి పురస్కారం అందుకుంది. [4] [5] [6]
మరణం
[మార్చు]తాలుక్దార్ 20 ఏప్రిల్ 2019న మరణించింది.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "সৰভোগৰ প্রাক্তন বিধায়িকা প্ৰণীতা তালুকদাৰৰ দেহাৱসান". NE Now (in అస్సామీస్). 21 April 2019. Retrieved 31 October 2019.
- ↑ "Assam Legislative Assembly - MLA 1967-72". Assam Legislative Assembly. Retrieved 31 October 2019.
- ↑ "Assam Legislative Assembly - MLA 1972-78". Assam Legislative Assembly. Retrieved 31 October 2019.
- ↑ "Pranab Mukherjee bestows Rani Laxmi Bai award on Delhi gangrape victim". The Indian Express. 8 March 2013. Retrieved 31 October 2019.
- ↑ "Rani Lakshmibai award for Delhi braveheart". The Hindu. 8 March 2013. Retrieved 31 October 2019.
- ↑ "President gives Stree Shakti awards on International Women's Day". News18. 9 March 2013. Retrieved 31 October 2019.