Jump to content

శోభా గస్తీ

వికీపీడియా నుండి
Woman receives award from president of India
నారీ శక్తి పురస్కారం స్వీకరిస్తున్న గస్తి

శోభా గస్తీ భారతీయ రాష్ట్రమైన కర్ణాటకలోని బెల్గాం కేంద్రంగా పనిచేస్తోంది. ఆమె 1997 లో మహిళా అభివృధి మట్టు సంరక్షణ సమస్తే (MASS) ను స్థాపించింది. ఇది కర్ణాటకలోని 360 గ్రామాలకు చెందిన దేవదాసి మాజీ మహిళలు వారి జీవితంలో ముందుకు సాగడానికి సహాయపడుతుంది. [1] 2,500 మంది సభ్యులతో ప్రారంభించి, 2014 నాటికి 3,600 మంది పాల్గొన్నారు. [2] 45 సంవత్సరాలు పైబడిన మాజీ దేవదాసీలకు పింఛన్లు పొందడంలో మాస్ విజయం సాధించింది. [3] చైల్డ్ రైట్స్ అండ్ యు (CRY) వంటి సమూహాలతో కలిసి పనిచేస్తూ, గస్తీ కూడా పిల్లల హక్కులను ప్రోత్సహిస్తుంది. [4]

మహిళా అభివృధి మట్టు సంరక్షణ సమస్తే

[మార్చు]

దేవదాసీ లకు కూడా హక్కులు ఉంటాయని, వాళ్లకు మంచి జీవితం ఇవ్వాలని ‘మాస్’​ అనే ఎన్జీవో పెట్టింది  కర్నాటక లోని బెల్​గావికి చెందిన శోభా గస్తీ. అమాయకత్వం వల్ల నష్ట పోతున్న దేవదాసీ మహిళల్ని కాపాడేందుకు శోభ గస్తి ‘మాస్‌‌’ ( మహిళా అభివృధి మట్టు సంరక్షణ సమస్తే)ను 1997లో మొదలు పెట్టింది. దాని ద్వారా చాలామందిని దేవదాసి వ్యవస్థ నుంచి బయటపడేలా చేసింది. బెల్​గావిలోని మూడు తాలూకాల్లో ఉన్న 509 ఊర్లలో విమెన్‌‌ ఎంపవర్‌‌‌‌మెంట్‌‌ కోసం చాలా ఏండ్లుగా కృషి చేస్తోంది ‘మాస్​’ ఎన్జీవో. చైల్డ్ మ్యారేజ్​లను అడ్డుకోవడం, ఆడపిల్లల్ని చదివించడం కోసం పనిచేస్తోంది. దేవదాసి రిహాబిలిటేషన్‌‌ సెంటర్‌‌‌‌ స్టార్ట్‌‌ చేసి వాళ్ల బతుకుల్లో వెలుగులు నింపింది. మాస్‌‌ సంస్థ  ద్వారా ఇప్పటి వరకు 3779 మందికి పైగా మహిళల జీవితాల్ని ఒక దారికి తెచ్చింది. మాస్‌‌తో పాటు పని చేస్తున్న ఇంకొన్ని ఆర్గనైజేషన్స్‌‌ సాయంతో ఎంతోమందికి ఉపాధి కలిపిస్తోంది శోభా.  అమ్మాయిలను వ్యభిచారులుగా మార్చడం, చైల్డ్‌‌ మ్యారేజ్‌‌, మహిళలపై జరిగే వేధింపుల మీద కూడా పోరాడుతోంది. వాళ్లకు హెచ్‌‌ఐవి పైన ఉన్న అపోహలు పోగొట్టి ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకునేలా  చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలన్నీ తిరిగి దేవదాసీ వ్యవస్థ, చైల్డ్‌‌ మ్యారేజ్‌‌ల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్​ గురించి అవగాహన కల్పిస్తోంది. [5]

అవార్డులు

[మార్చు]

ఆమె కృషికి గుర్తింపుగా, గస్తీకి 2022లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2021 నారీ శక్తి పురస్కారాన్ని అందించారు. [6]

మూలాలు

[మార్చు]
  1. "Shobha Gasti and Nivruti Rai from Karnataka honoured by the President". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-03-09. Retrieved 2022-10-30.
  2. "NGOs hail SC directive to stop Devadasi system - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-10-30.
  3. May 6, TNN / Updated:; 2014; Ist, 00:31. "Elusive pension pushes devadasis into distress | Bengaluru News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-10-30. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  4. BN, Janardhan. "The President of India Recognized Shobha Gasti's work on Girl Child Education and Devadasi Women". Bangalore News Network (in English). Retrieved 2022-10-30.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  5. Velugu, V6 (2022-03-10). "దేవదాసీల రాత మార్చింది". V6 Velugu. Retrieved 2022-10-30.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "Karnataka Bengaluru News Highlights: State reports 197 Covid-19 cases, 8 deaths". The Indian Express (in ఇంగ్లీష్). 2022-03-08. Retrieved 2022-10-30.