సుమితా ఘోష్
సుమితా ఘోష్ | |
---|---|
జననం | కోల్‌కతా |
జాతీయత | భారతీయురాలు |
విద్య | ముంబాయి |
జీవిత భాగస్వామి | సంజయ్ ఘోష్ |
సుమితా ఘోష్ భారతీయ పారిశ్రామికవేత్త. ఈమె 2006లో రంగ్ సూత్ర అనే పరిశ్రమని స్థాపించి[1] వందలాది మంది హస్తకళాకారులకు ఉపాధిని కల్పించింది.[2] ఇక్కడ వాళ్ళు తయారు చేసిన వస్తువులను ఐకియా వంటి గ్లోబల్ కస్టమర్‌లకు విక్రయిస్తుంటారు. ఈమె హస్తకళాకారులకు చేసిన సేవలకు గాను 2015లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుండి నారీశక్తి పురస్కారాన్ని అందుకుంది.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]సుమితా ఘోష్ కోల్‌కతాలో జన్మించింది. ముంబై యూనివర్సిటీ నుండి ఆర్థికశాస్త్రంలో పీజి చేసింది. ఈమె సంజయ్ ఘోష్ ను వివాహం చేసుకుంది, వీరిద్దరు రాజస్థాన్‌లో ఆరోగ్య విద్యను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్న గ్రామీణ వర్గాలతో కలిసి పనిచేశారు. సంజయ్ ఘోష్ ను అస్సాంలోని యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం కిడ్నాప్ చేసింది, అతను మళ్ళీ తిరిగి రాలేదు.[4]
వృత్తి
[మార్చు]ఈమె చాలా సంవత్సరాలు భారతదేశ గ్రామీణ ప్రాంతాలలోని సమాజం, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి కృషి చేసింది.[5] 2006లో ఘోష్ గ్రామీణ కళాకారులకు మెరుగైన జీతంతో కూడిన పని ఉండలని వారికీ సహాయపడటానికి ఒక వ్యాపారాన్ని స్థాపించాలని నిర్ణయించుకుంది. ఆమె దగ్గర తగినంత డబ్బు లేకపోవడంతో హస్తకళాకారులను పెట్టుబడి పెట్టడానికి ఒప్పించింది, బదులుగా వారికి అభివృద్ధి చెందుతున్న కంపెనీలో వాటాలను కలిగి ఉండేలా చేసింది. వారు పెట్టుబడి పెట్టిన దానితో రంగ్ సూత్రని ప్రారంభించింది.[2][6] రంగ్ సూత్ర 2,000 మంది హస్తకళాకారులపెట్టుబడిదారులను కలిగి ఉంది.[5]
2020లో రంగ్ సూత్ర, ఐకియా థాయిలాండ్, రొమేనియా, జోర్డాన్,భారతదేశంలోని సామాజిక వ్యాపారవేత్తల సహకారంతో వారి డిజైనర్లు సృష్టించిన బొటానికల్ థీమ్ శ్రేణిని ప్రారంభించి వందలాది కార్మికులకు ఉపాధిని కల్పించింది.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Faces of a Vibrant Bharat". Faces of a Vibrant Bharat. Retrieved 2023-07-01.
- ↑ 2.0 2.1 "Sumita Ghose: Founder of Rangsutra, a Socioeconomic Enterprise to Promote Rural India". OpenGrowth. Retrieved 2023-07-01.
- ↑ "Give women freedom to exercise choices at home, workplace: President Pranab Mukherjee". The Economic Times. 2016-03-08. Retrieved 2020-07-09.
- ↑ "जिद को जुनून बनाने से मिलती है जीत, रंगसूत्र : 50 देशों में करोड़ों का कारोबार". Dainik Bhaskar. 2015-09-08. Retrieved 2020-07-11.
- ↑ 5.0 5.1 "Sumita Ghose". The Resource Alliance. Retrieved 2020-07-11.
- ↑ "One Woman Is Changing Lives of 3,000 Artisans from Remote Indian Villages with Their Own Help". The Better India. 2017-01-04. Retrieved 2020-07-11.
- ↑ "IKEA India unveils BOTANISK, a handcrafted series created in collaboration with six social entrepreneurs". Architectural Digest India. 2020-03-18. Retrieved 2020-07-11.