సీమా రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీమారావు
కార్ప్స్ బాటిల్ స్కూల్ నార్తర్న్ కమాండ్ ఇండియన్ ఆర్మీలో సీమా రావు
వెబ్‌సైటుఅధికారిక వెబ్‌సైటు

సీమారావు ను భారతీయ మీడియాలో "వండర్ వుమన్ ఆఫ్ ఇండియా" అనే పేరుతో పిలుస్తారు. [1] [2] [3] [4] [5] [6] ఆమె భారతదేశపు మొట్టమొదటి మహిళా స్పెషల్ ఫోర్స్ ట్రైనర్, [7] [8] భారతీయ ప్రత్యేక దళాలకు రెండు దశాబ్దాలకు పైగా డబ్బుతో నిమిత్తం లేకుండా శిక్షణ ఇస్తున్నారు.. ఆమె దగ్గరగా పోరాడే క్వార్టర్ బాటిల్ అనే యుద్ద క్రియ (CQB) [9] లో నిపుణురాలు - గట్టి పోరాటాల్లోనూ వివిధ భారతీయ దళాలకు శిక్షణ ఇవ్వడంలో పాల్గొంటున్నారు. [10] వీటన్నిటిలో తన భర్త మేజర్ దీపక్ రావుతో కలిసి పని చేస్తున్నారు. [11] [12]

జీవిత చరిత్ర[మార్చు]

ఈమె తండ్రి భారత స్వాతంత్ర సమరంలో పాల్గొన్న ప్రొఫెసర్ రమాకాంత్ సినారి. క్రైసిస్ మేనెజ్ మ్ంట్ లో MBA చదివిన ఈమె మిసెస్ ఇండియా వరల్డ్ అందాల పోటీలో ఫైనల్ వరకూ వెళ్ళారు.. [13]

సీమారావు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో స్కైడైవింగ్ కోర్సు చేయడం ద్వారా పారా వింగ్స్ పొందారు. ఈమె కంబాట్ షూటింగ్ నేర్పడంలో నిపుణురాలు, ఆర్మీ పర్వతారోహణ సంస్థ HMI పతక విజేతగా నిలిచారు.

మిలిటరీ మార్షల్ ఆర్ట్స్‌లో 8వ డిగ్రీ బ్లాక్‌బెల్ట్ వరకూ సాధించారు. [14] జీత్ కునే దో అనే ఒక యుద్ద కళను బోధించడానికి అధికారం ఉన్న కొంతమంది బోధకులలో ఆమె ఒకరు. [15] ఆమె తన భర్త దీపక్ రావ్‌తో కలిసి షూటింగ్ లో కొత్త విధానాల కొరకు ది రావ్ సిస్టమ్ ఆఫ్ రిఫ్లెక్స్ ఫైర్ అనే కొత్త పద్ధతిని కనిపెట్టారు. [16] రెండు దశాబ్ధాల నుండి ఇప్పటి వరకూ సీమారావు దంపతులు 15,000 మంది సైనికులకు శిక్షణ ఇచ్చారు [17]

సీమారావు "ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ క్లోజ్ కంబాట్ ఆప్స్", "ఎ కాంప్రెహెన్సివ్ అనాలిసిస్ ఆఫ్ వరల్డ్ టెర్రరిజం". అనే రెండు పుస్తకాలకు సహ రచయితగా ఉన్నారు. ఆమె తన భర్తతో కలిసి "హ్యాండ్‌బుక్ ఆఫ్ వరల్డ్ టెర్రరిజం" అనే పుస్తకాన్ని కూడా రాసింది. [18]

అవార్డులు, గుర్తింపు[మార్చు]

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (కుడి) అంతర్జాతీయ మహిళా దినోత్సవం, 2019 నాడు సీమా రావు (ఎడమ)కి నారీ శక్తి పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు

2019 ఫోర్బ్స్ ఇండియా డబ్ల్యూ-పవర్ ట్రైల్‌బ్లేజర్ జాబితాలో రావు ఆరవ స్థానంలో ఉన్నారు. [19] 2019 లో భారత రాష్ట్రపతి నుండి నారీ శక్తి పురస్కారాన్ని అందుకుంది [20]

మూలాలు[మార్చు]

  1. "Wonder Woman: Dr Seema Rao, India's First And Only Woman Commando Trainer". femina.in (in ఇంగ్లీష్). Retrieved 2022-03-16.
  2. Pawar, Nivedita Jayaram (2017-06-25). "India's wonder woman". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2022-03-16.
  3. LIV, SIpping Thoughts (2019-11-28). "Dr. Seema Rao- The Wonder Woman of India -". Sipping Thoughts Liv (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-03-16.[permanent dead link]
  4. "The Maa-Beti Wonder Women: Seema and Komal Rao - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-03-16.
  5. Says, Theskywalker (2017-10-29). "Interview with 'Wonder Woman' Dr. Seema Rao: "I hold honour and duty above material gains"". Star of Mysore (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-03-16.
  6. "Meet Seema Rao, India's first woman Commando trainer". The Indian Express (in ఇంగ్లీష్). 2018-08-16. Retrieved 2022-03-16.
  7. "Women Power: Dr. Seema Rao's Iron Will". jagran.com. Retrieved 2019-03-14.
  8. "IWD Special Interview of Dr. Seema Rao". bhaskar.com. 7 March 2019. Retrieved 2019-03-08.
  9. "Dr Seema Rao Commando Trainer". indiatimes.com. Retrieved 2017-06-25.
  10. "Training the Indian Forces". BBC News हिंदी. BBC. 25 January 2017. Retrieved 2017-06-25.
  11. "Indian Super Woman Dr. Seema Rao". Deccan Chronicle. 20 August 2016. Retrieved 2016-08-21.
  12. "Meet India's only woman commando trainer Dr Seema Rao". cnbctv18.com (in అమెరికన్ ఇంగ్లీష్). 14 June 2019. Retrieved 2020-10-30.
  13. "Dr Seema Rao - India's only commando trainer". indiatimes. Retrieved 2016-07-11.
  14. "Meet Seema Rao, India's Only Woman Combat Trainer". femina.in (in ఇంగ్లీష్). Retrieved 2020-10-30.
  15. "Jeet Kune Do Instructor - Dr Seema Rao". LokMarg. 19 December 2016. Retrieved 2017-06-25.
  16. "Forbes India - Dr Seema Rao: India's First Female Combat Trainer, Fighting Stereotypes". Forbes India (in ఇంగ్లీష్). Retrieved 2021-12-26.
  17. "Unstoppables Combat Couple". indiatoday.intoday.in. Retrieved 2009-10-04.
  18. "Men in uniform get a shot in the arm from combat couple | Mumbai News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). May 19, 2020. Retrieved 2021-12-26.
  19. "Dr Seema Rao is No 6 in the 2019 Forbes India Woman-Power". forbesindia.com. Retrieved 2019-03-01.
  20. "President gives Nari Shakti Puraskar, woman marine pilot, commando trainer receive loudest cheers". uniindia.com. Retrieved 2019-03-08.
"https://te.wikipedia.org/w/index.php?title=సీమా_రావు&oldid=3875803" నుండి వెలికితీశారు